Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అన్ని ఆఫీసులు ఒక్కచోటే..

పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల ప్రాంగణాలను ఏడాదిలో నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ బడ్జెట్‌లోనే వీటికి నిధులు కేటాయిస్తామని ఆయన ప్రకటించారు.

జిల్లా స్థాయి కార్యాలయాలన్నీ ఒక్కచోట కొలువుతీరేలా అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. పోలీసు, అగ్నిమాపక శాఖ మినహా అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండాలని ఆయన చెప్పారు. అలాగే ప్రతి జిల్లాలోనూ జిల్లా పోలీసు కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో నూతన కార్యాలయాలు ఉన్నందున అవి మినహాయించి మిగిలిన 28 జిల్లాల్లో భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామని ఆయన చెప్పారు. గురువారం ప్రగతిభవన్‌లో సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యాలయాలకు డిజైన్లను ఖరారు చేసి టెండర్లు పిలువాలని, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. కొత్త కార్యాలయాలు అన్ని వసతులతో ప్రజలకు, అధికారులకు అనువుగా ఉండాలని సీఎం చెప్పారు.

600400

కార్యాలయాలన్నీ ఒకేచోట.. పాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో రా ష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, పరిపాలన మరింత సమర్థంగా జరుగాలంటే మంచి కార్యాలయాలు కూడా చాలా అవసరమని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. పోలీస్, ఫైర్ మినహా మిగతా కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, ఇటు అధికారుల మధ్య సమన్వయం కూడా ఏర్పడుతుందని అన్నారు. ప్రస్తుత అవసరాలతోపాటు భవిష్యత్తులో కూడా సేవలు అం దించే విధంగా ఈ కాంప్లెక్స్‌లు ఉండాల ని, ఇరుకిరుకుగా కాకుండా.. విశాలంగా డిజైన్ చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు, పనిచేసే అధికారులకు సౌకర్యంగా ఉండాలని, ఆయా సందర్భాల్లో ఏర్పాటు చేసుకునే సమావేశాలు, స్టేట్ ఫెస్టివల్స్, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అనువుగా ఉండాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ రూపొందించిన డిజైన్లను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు.

600

ధారాళంగా వెలుతురు, గాలి వచ్చేలా.. ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాల పర్యటన సందర్భంగా సమీక్ష సమావేశాలతో పాటు వివిధ వర్గాలతో మాట్లాడేందుకు వీలుగా వెయ్యి మంది కూర్చునే విధంగా కాన్ఫరెన్స్ హాలును ఈ ప్రాంగణంలో భాగంగా నిర్మించాలని సీఎం చెప్పారు. ప్రతి గదికీ గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించే విధంగా క్రాస్ వెంటిలేషన్ ఉండాలని, పచ్చదనం ఉట్టిపడేలా ల్యాండ్ స్కేపింగ్ ఏర్పాటుచేయాలని, వాకింగ్ ట్రాక్స్ ఉండాలని అన్నారు.

20-25 ఎకరాల్లో.. నూతన ప్రాంగణాలను కనీసం 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతమున్న కార్యాలయాల్లా కాకుండా అధికారులు, ఉద్యోగులతో పాటు సందర్శనకు వచ్చే ప్రజల కోసం కూడా టాయిలెట్లు, క్యాంటీన్లు ఉండాలన్నారు. లంచ్ రూములు, బ్యాంకు ఏటీఎం, మీ సేవా కేంద్రం, రికార్డు రూం, స్ట్రాంగ్ రూం, విద్యుత్ సబ్ స్టేషన్, జనరేటర్, యానిమల్ ట్రాప్స్ విధిగా ఉండాలని సీఎం అన్నారు. వీటన్నింటినీ గమనంలోకి తీసుకొని డిజైన్లు ఖరారు చేసి టెండర్లు పిలువాలన్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఇప్పటికే స్థలాలు గుర్తించారని, వాటికి వెంటనే లే అవుట్లు తయారుచేయాలని సీఎం చెప్పారు.

పోలీసు కార్యాలయాలుకూడా.. అన్ని జిల్లా కేంద్రాల్లో పరేడ్ గ్రౌండ్‌తోకూడిన పోలీసు కార్యాలయాలు (డీపీవో) నిర్మించాలని సీఎం ఆదేశించారు. తమిళనాడులో డీపీవోలు బాగున్నాయనే సమాచారం ఉన్నదని సీఎం చెప్పారు. డీజీపీ నాయకత్వంలో ఉన్నతస్థాయి అధికారుల బృందం వెంటనే అక్కడ పర్యటించి అధ్యయన వేదికను, డిజైన్లను అందించాలని సూచించారు.

పోలీసులు నేర భాష మార్చుకోవాలి.. జిల్లా పోలీసు కార్యాలయాలపై చర్చ సందర్భంగా క్రైం మీటింగులు నిర్వహించుకోవడానికి కాన్ఫరెన్స్ హాలు ఉండాలని పోలీసు అధికారులు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో ఛలోక్తి విసిరారు. పోలీసులే నేరభాష మాట్లాడితే ఎలా? ప్రతినెలా నిర్వహించే సమీక్షకు క్రైం మీటింగ్ అని పేరు పెట్టారు. అది తప్పు. నెగెటివ్ సెన్స్‌లో ఉండవద్దు. క్రైం మీటింగ్ పేరు మార్చండి. ఇంకా ఇలాంటి నెగెటివ్ భావనలకు సంబంధించిన పదాలుంటే వాటిని కూడా మార్చండి అని సీఎం సూచించారు.

భగీరథ పనుల్లో వేగం పెంచాలి.. మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో పనులు ఆశించిన వేగంతోనే జరుగుతున్నా పట్టణ, నగర ప్రాంతాల్లో జాప్యం జరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు సునీల్‌శర్మ, రామకృష్ణారావు, శాంతికుమారి, స్మితా సభర్వాల్, గణపతిరెడ్డి, సురేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.