Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గ్రామీణ రోడ్లకు మహర్దశ

-సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు -ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో పంచాయతీరాజ్,   గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాలనా దక్షతతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమనాయకుడు, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానంతో జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణ సాధనతోనే ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని, ప్రజాప్రతినిధులలో మానవీయకోణం, ప్రజలకు మేలు చేయాలనే తపన పెరిగిందని చెప్పారు. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ కొత్త పుంతలు తొక్కుతున్నదని, సంక్షేమరంగంలో దూసుకు పోతున్నదని అన్నారు. ఉపాధిహామీలో ఐదు అవార్డులు సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని, టీఆర్‌ఎస్ పాలనలో గ్రామీణ రోడ్లకు మహర్దశ చేకూరిందని తెలిపారు.

17 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నా. కాంగ్రెస్‌లో ఏడాదిన్నర కాలం మంత్రిగా పనిచేసినా ప్రజలకు ఏం చేయలేక పోతున్నామన్న అసంతృప్తి ఉండేది. టీఆర్‌ఎస్‌లో చేరాక ఆ అనుభూతే వేరు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఈ మూడేండ్లలో ప్రజాప్రతినిధిగా చాలా సంతోషంగా ఉన్నా. ప్రజల కనీస అవసరాలను తీరుస్తున్నామన్న సంతృప్తి ఉన్నది అని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ మూడేండ్ల పాలనపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నమస్తే తెలంగాణతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

మూడేండ్ల్లలో పంచాయతీరాజ్ శాఖలో సాధించిన ప్రగతి? టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే గ్రామీణ రోడ్ల నిర్మాణం కోసం నూతన పాలసీని రూపొందించింది. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు రోడ్ల నిర్మాణం చేపట్టాం. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ ఏడాదికి రెండు, మూడు వందల కోట్ల నిధులు కూడా తెలంగాణకు కేటాయించే వారు కాదు. పైరవీలు చేసుకోవాల్సి వచ్చేది. కానీ సొంత రాష్ట్రంలో సుమారు రూ.3,778 కోట్లతో 14,169 గ్రామీణ రోడ్లను నిర్మించాం. పేదల ఆత్మగౌరవం కాపాడేందుకు సుమారు 37.46 లక్షల మందికి పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఆసరా పింఛన్లను ఇస్తున్నాం. ఈ నెల 4 నుంచి సుమారు మరో లక్షన్నర మందికి పింఛన్లు అందించనున్నాం.

మిషన్ భగీరథ ప్రాజెక్టు వల్ల సమాజంలో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయి? మిషన్ భగీరథ రూపకల్పన అద్భుతం. సీఎం కేసీఆర్ ఆలోచన దృక్పథానికి నిదర్శనం. 60 ఏండ్లకాలంలో ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూ డా ఈ కోణంలో ఆలోచించలేదు. తాగునీటి కోసం ప్రజలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేయడం గతంలో కనిపించేది. ఆ సమస్య ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా శాశ్వతంగా పరిష్కారం కానున్నది. ఈ ఏడాది చివరినాటికి ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతి అవాసానికి తాగునీరు అందుతుంది.

ఉమ్మడి పాలనకు, ప్రస్తుత పరిస్థితులకు ఉన్న తేడాలేమిటి? ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి మాత్రమే పరిమితమయ్యేవి. ఆ కోణంలోనే స్కీంలు రూపొందించేవారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలే కేంద్ర బిందువుగా, మానవీయ కోణంలో పథకాలు రూపొందిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజల్లో ఏహ్యభావం ఉండేది. సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజల్లో సంపూర్ణ నమ్మకం, తృప్తి పెరిగింది. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు, హామీలు తీరుస్తున్నారు. చెప్పింది చేస్తారనే నమ్మకం సీఎం కేసీఆర్ కలిగించారు. 60 ఏండ్ల సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ బతుకు చిత్రాన్ని పునర్నిర్మించేందుకు కృషి చేస్తున్నారు.

ఉపాధిహామీ అమలులో రాష్ట్రం సాధించిన ప్రగతి ఎలాంటిది? ఉపాధిహామీపథకం అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉం ది. 12 ఏండ్ల్ల కా లంలో మొదటిసారిగా ఒక్క రూపాయికూడా నిరుపయోగం కాకుండా నిధులన్నింటినీ సమర్థంగా వినియోగించాం. 2016-17లో రూ. 2500 కోట్లు ఖర్చు చేశాం. 2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే రూ. 775 కోట్లు ఖర్చు చేశాం. 2018 అక్టోబర్ 2 నాటికి 100శాతం మరుగుదొడ్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నాం. మహిళా స్వయంసహాయక సంఘాలకు స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు అందజేస్తున్నాం. సెర్ప్ ద్వారా మహిళల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నాం.

సర్వేలపై ప్రతిపక్షాల విమర్శల గురించి మీరేమంటారు? సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల ఫలితాల సారాంశమే ఇటీవల వెల్లడించిన సర్వే వివరాలు. ఒక్కోప్రతిపక్ష పార్టీకి రాబోయే 2019 ఎన్నికల్లో మూడు సీట్లు కూడా రావు. ఆ అన్ని పార్టీలకూ కలిపి మూడు సీట్లే వచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ 111 సీట్లు గెలువడం ఖాయం. మా పార్టీకి ఘన విజయం పునరావృతం అవుతుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.