Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నగరం.. గులాబీమయం

భాగ్యనగరం గులాబీ మయంగా మారింది. ఆరు దశాబ్దాల పోరాటం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారమైన సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇందుకోసం జూన్ 2న ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు నడుంబిగించింది. అదే రోజున కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నందున గ్రేటర్‌లోని అన్ని కూడళ్లలో గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. కేసీఆర్‌కు భారీగా స్వాగతం పలికేందుకు స్వాగత హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరంలో 61 ప్రాంతాలలో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి చౌరస్తాను గులాబీ మయంగా మార్చేశారు. నగరంలో ఎక్కడ చూసినా బారీకేడ్లు, హోర్డింగ్‌లతో పాటు స్వాగత తోరణాలు, బంటింగ్స్, పెద్ద పెద్ద జెండాలు, బెలూన్స్ వంటివి దర్శనమిస్తున్నాయి. పెద్ద ఎత్తున బాణసంచాలు, సంబురాలు, ధూందాంలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 1వ తేదీన అర్ధరాత్రి నుంచే సంబురాలు నిర్వహిస్తామని టీఆర్‌ఎస్ శ్రేణులు తెలిపారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద 25 మంది ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచాలు కాల్చి సంబురాలు నిర్వహిస్తారని సమాచారం. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలోని చారిత్రత్మక కట్టడాలైన చార్మినార్, శిల్పరామం, కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లతోపాటు పలు ముఖ్యమైన కట్టడాల వద్ద విద్యుత్ కాంతులు వెదజల్లేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. నగరంలోని ముఖ్యమైన కూడళ్లలో 20కిపైగా ప్రత్యేక స్వాగత వేదికలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా స్టేజీల వద్ద సాంస్కతిక కార్యక్రమాలు, ధూందాంలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

మోత మోగనున్నా పటాకులు… జూన్ 2న సంబరాలు అంబారాన్ని తాకనున్నాయి. తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్‌లోని 61 చోట్ల భారీ సంఖ్యలో పటాకులు పేల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తారజువ్వలు.. లక్ష్మీబాంబులు.. క్రాకర్లు.. రాకెట్లు అకాశంలోకి దూసుకు వెళ్లనున్నాయి. పటాకుల ద్వారా పూల వర్షం, సువాసన జల్లులు వేద జల్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరహా పటాకులను ప్రత్యేకంగా తయారు చేయించినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.

నగరంలోని తెలంగాణ భవన్, క్యాన్సర్ ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పంజాగుట్ట సర్కిల్, ఖైరతాబాద్ చౌరస్తా, సచివాలయం, లక్డికాపూల్, గన్‌పార్కు, లిబర్టీ, హిమాయత్‌నగర్, కాచిగూడ, కోఠిజంక్షన్, ఆబిడ్స్ జీపీఓ, మొజంజాహి మార్కెట్, చార్మినార్, సిటీ కాలేజ్, ఇందిరాపార్కు, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, ముషిరాబాద్, చిలకలగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్‌టవర్, రసూల్‌పూర చౌరస్తా, అత్తాపూర్ రింగ్‌రోడ్డు, గచ్చిబౌలీ ైప్లె ఓవర్, యూసుప్‌గూడ, మైత్రీవనం చౌరస్తా, ఎర్రగడ్డ, మోతీనగర్, కూకట్‌పల్లి వైజంక్షన్, బాలనగర్, గ్రీన్‌ల్యాండ్స్, మోహిదీపట్నం, మెట్టుగూడ, తార్నక, ఉప్పల్, ఎల్బీనగర్, బాలనగర్ రింగురోడ్డు, సంతోష్‌నగర్, ముసారాంబాగ్,. మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, బర్కత్‌పుర చామన్, అంబేద్కర్‌కాలేజ్, విద్యానగర్, ఓయూ క్యాంపస్, సంగీత్‌చౌరస్తా, ప్యాట్నీ సెంటర్, జూబ్లీ బస్టాండ్, ప్యారడైజ్ చౌరస్తా, బోయిన్‌పల్లి చౌరస్తా, సుచిత్ర, ఈసీఐఎల్, చాంద్రాయణగుట్ట, అరంఘడ్ చౌరస్తా, సిటిలైట్ చౌరస్తాల వద్ద భారీ బాణసంచా పేల్చడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. కేసీఆర్ నివాసం ఉంటున్న నందినగర్ బస్‌స్టాఫ్ వద్ద పటాకులు కాల్చడానికి ఇనుప గ్రిల్స్‌తో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.నగరం.. గులాబీమయం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.