Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నాడు వేదన.. నేడు వేడుక..

సరిహద్దు సైనికులు.. జాతి సంపద సృష్టించే గని కార్మికులు ఒక్కటే. వారి బాధ్యతను మనం మానవత్వంతో స్వీకరించాలి. ఉత్పత్తి, లాభం, బోనస్‌లతో సింగరేణి కార్మికులు చరిత్ర సృష్టించారు. తెలంగాణ పాలన అంటే ఏమిటో చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగానే కాకుండా, ఉద్యోగాల కల్పనకు సింగరేణి ఉపయోగపడుతుంది. – కేసీఆర్

తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి ముఖ్యమంత్రి చొరవతో వెలుగులు నింపుకొని ముందుకు సాగుతున్నది. సీమాం ధ్ర పాలనలో చీకటిలో మగ్గిన కార్మికుల జీవితాలు నేడు కళకళలాడుతున్నాయి. సిరులవేణి సింగరేణి సీమాంధ్ర పాలనలో విధ్వంసానికి గురైం ది. తెలంగాణ ఉద్యమనేత, కార్మిక పక్షపాతి మన కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రకటించిన వరాలతో ప్రస్తుతం సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అయితే, ఈ చీకటి నుంచి వెలుగుల ప్రస్థా నం అంతా ఆషామాషీగా ఏం జరుగలేదు. బుసలు కొడుతున్న సమైక్య నాగుల చెర నుంచి, పదునెక్కిన కుట్రల కత్తులు ఛేదించేందుకు కార్మికు లు చేసిన కృషి అసామాన్యం, అనితర సాధ్యం. సిరులవేణి సింగరేణి కొత్తగూడెం ప్రాంతంలో ప్రారంభమైంది. దేశం లో మొట్టమొదటి ప్రభుత్వరంగ బొగ్గు సంస్థగా సింగరేణి కాలరీస్ ఘన త వహించింది. 1949లో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి సింగరేణి కాలరీస్ కంపెనీ వచ్చింది. 1956లో భారత ప్రభుత్వం సింగరేణి కంపెనీలో భాగస్వామ్యం తీసుకోగా అప్పటినుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సం యుక్తంగా కొనసాగుతున్నది. ఎంతోమందికి ఉపాధి కల్పించిన సింగరే ణి తల్లిపై సీమాంధ్ర పాలకుల కన్నుపడింది. దీన్ని విధ్వంసం చేసే దిశగా ముందుకు సాగారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న హయాంలో ఈ సంస్థలో కార్మికులు మనుగడ సాగించలేని పరిస్థితి. పారిశ్రామిక విధానంలో భాగంగా ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. దానిలో భాగంగానే సింగరేణి సైతం మూసివేత దిశగా సాగింది. చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున కార్మికులను బయటకు పంపించారు. గోల్డెన్ హాండ్‌షేక్ పేరుతో ముప్ఫై వేల మంది కార్మికులను బయటకు పంపారు.

ఎన్నికలు జరుగనున్న డిసెంబర్ 7కు ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్నది. ఆ రోజున అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన విద్యార్థులపై లాఠీచార్జి జరిగిన సందర్భంలో మా బిడ్డల నెత్తురు చుక్క నేలిరాలితే.. బొగ్గుబాయి కార్మికులం అగ్గిలాగా మండుతం, సమైక్యవాదాన్ని దహిస్తమని సింగరేణి కార్మికులు పోరాటస్ఫూర్తితో సమ్మెకు దిగిన రోజది. మళ్లీ అదే డిసెంబర్ 7వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో సమైక్యవాదాన్ని బొందపెట్టి, కర్రు కాల్చి వాత పెట్టేందుకు ఎదురుచూస్తున్నారు.

డిస్మిస్ పేరుతో అకారణంగా నాలుగు వేల మందికి పైగా తొలిగించారు. అనేక బావులు మూసివేయడానికి కారణం కూడా అయ్యారు. సంస్థకు అందించే బడ్జెట్ సప్టోర్ కూడా లేకుండా చేశారు. ఫలితంగా సింగరేణి సంస్థ బీఐఎఫ్‌ఆర్ పరిధిలోకి రెండుమార్లు వెళ్లింది. మూసివేత దశకు చేరుకున్నది. మరోవైపు సీమాంధ్ర కార్మిక సంఘాలు కూడా తానతందాన అంటూ చంద్రబాబుకు మద్దతు పలికాయి. చంద్రబాబు పాదాల వద్ద మోకరిల్లి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టారు. మరోవైపు కార్మికులను బెదిరింపులకు గురిచేస్తూ వారు అసలు ఉద్యోగాలు సైతం భయం భయంగా చేసుకునే పరిస్థితి కల్పించారు. దీంతో చాలామంది కార్మికులు పనులు సైతం కూడా చేయకుండా వదిలేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కార్మికులు కూడా మొండి పట్టుదలతో సంస్థను కాపాడుకున్నారు. బీఐఎఫ్‌ఆర్‌కు ప్రతిపాదనకు వెళ్లి బయటకువచ్చి లాభాల బట్టిన ఏకైక ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి మాత్రమే అంటే కార్మికులు చూపిన పనితీరు, త్యాగనిరతి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కూడా వారు చూపిన తెగువ అనిర్వచనీయం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ, స్వయంపాలనలో సింగరేణి వెలుగులు విరజిమ్ముతూ ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా కేసీఆర్ చూపుతున్న చొరవ నిజంగా అభినందనీయం. కార్మిక పక్షపాతి గా ఆయన కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు సింగరేణి వ్యాప్తంగా చర్రిత సృష్టిస్తున్నాయి. ఉద్యోగాల కల్పన, సింగరేణి విస్తరణ కోసం కేసీఆర్ తయారుచేసిన విజన్ చరిత్రలో నిలిచిపోతుంది.

సింగరేణి వ్యాప్తంగా ఉన్న యువతకు అది ఒక కల్పవృక్షంగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మన కొలువులు, మనకే అనే విధానం ఆచరణలో సాధ్యమవుతున్నది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఎక్కు వ ఉద్యోగావకాశాలు కల్పించి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తొలి ఉద్యోగ ఫలాలను అందించి కలలను సాకారం చేసిన ఘన త సింగరేణి సంస్థకే దక్కింది. తమ రక్తాన్ని చెమట చుక్కల రూపంలో మనకు వెలుగులు అందిస్తున్న కార్మికుల బతుకుకు భరోసా కల్పించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన వారసత్వ హక్కును సమైక్యవాద పార్టీలు పోగొ ట్టి కార్మికుల పొట్టగొట్టాయి. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే దానిపై కేసీఆర్ వెంటనే నిర్ణయం తీసుకున్నారు. అయితే, కోర్టుకు వెళ్లి దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేశారు. కానీ, మనస్సున్న కేసీఆర్ ఏ విధంగానై నా అమలుచేయాలనే లక్ష్యంతో కారుణ్య నియామకాల పేరుతో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో కార్మికుల కుటుంబాలకు భరోసా లభించింది. ఇప్పటికే మూడు వేలకు పైగా కారుణ్య నియామకాల పేరిట ఉద్యోగ కల్పన జరిగింది. సంస్థలో మూడు నోటిఫికేషన్లు ఇచ్చి 2,700 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇంటర్నల్ నోటిఫికేషన్లతో మరో వెయ్యి మంది యువకులకు, పెండింగ్‌లో నానుతున్న మూడు వేల మంది డిపెండెంట్లకు కేవలం రెండేండ్ల కాలంలోనే ఉద్యోగాలు కల్పించింది.

మెడికల్ అన్‌ఫిట్ కేసుల్లో ఉద్యోగం వద్దనుకునే వారికి ఏకమొత్తంగా 25 లక్షల రూపాయల సొమ్ము చెల్లింపు లేదా నెలకు రూ. 25,000 చెల్లించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కూడా ఎంతోమంది కార్మికులకు మేలుచేసింది. సింగరేణి ఉద్యోగుల తల్లిదండ్రులకు సైతం సూపర్‌స్పెషాలిటీ వైద్యం, ఏండ్ల తరబడి బదిలీ వర్కర్లు, బదిలీ ఫిల్లర్లుగా పనిచేస్తే కానీ జనరల్ మజ్దూర్లుగా రెగ్యులర్ కానీ 2,718 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజేషన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో లక్ష రూపాయలు ఉన్న మ్యాచింగ్ గ్రాంట్‌ను 25 లక్షలకు పెం చారు. సహజ మరణం పొందితే 75 వేల రూపాయలు ఉండగా, దీన్ని కూడా రూ.15 లక్షలకు పెంచారు. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం ఆయన కార్మికుల పక్షపాతి అనే విషయం స్పష్టం చేస్తున్నది. తెలంగాణ కు గుండెకాయ అయిన సింగరేణి సంస్థను, ఇక్కడి కార్మికులను తాను ఎన్నడూ మరిచిపోనని కేసీఆర్ చెబుతుంటారు. అదేస్థాయిలో సింగరేణి కార్మికులు సైతం ఆయనను ఏనాడు మరిచిపోరనే సత్యం మరోసారి రుజువుకానున్నది. కార్మికులకు సొంతింటి కల నెరవేర్చేందుకు కూడా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో కార్మికుడు ఇల్లు కట్టుకునేందుకు వడ్డీలేని రుణం కింద రూ.10 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఎన్నో ఏండ్లుగా సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మికులు, కార్మికేతరులకు ఇండ్ల పట్టాలిచ్చేందుకు అంగీకారం తెలిపారు. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రిలో తొందరలోనే ఆ పట్టాలు వారికి అందనున్నా యి. లాభాల వాటా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు 16 శాతం గా ఉండేది. కానీ మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని ఏకంగా 27 శాతానికి తీసుకుపోయారు.

ఈ ఏడాది కార్మికులు ఎప్పుడు లేనంతంగా రూ.327.24 కోట్లు కార్మికులకు చెందాయి. ఇలా ప్రతి అంశాన్ని కార్మికుల దృష్టికోణంలో నుంచి ఆలోచించే ముఖ్యమంత్రి దొరుకడం తెలంగాణ ప్రాంత వాసులు చేసుకున్న అదృష్టమే. ఇలా సీమాంధ్ర పాలనలో ధ్వంసమైన సింగరేణి బతుకుల్లో కొత్త వెలుగులు నింపుతున్న కేసీఆర్‌పైన కార్మికులు నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాటనే బాటగా నడిచారు. సాధారణ ఎన్నికల్లో, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కేసీఆర్ వైపే నిలబడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తీర్పు ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం లో కార్మికులు చూపిన పోరాట స్ఫూర్తి అద్భుతం. యావత్ తెలంగాణకే వారు ఆదర్శంగా నిలబడ్డారు. ఢిల్లీ పీఠం సైతం కదిలించే పోరాటాలకు వేదికయ్యింది సింగరేణి. సందర్భంగా ఏదైనా ఉద్యమనేత కేసీఆర్‌తో భుజం భుజం కలిపి నడిచారు. ప్రస్తుతం చిగురిస్తున్న ఆశలను చిదిమే సే దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆంధ్ర వలసపాలకు లు తిరిగి తెలంగాణలో ఆధిపత్యం కొనసాగించేందుకు ఢిల్లీ, అమరావ తి వేదికగా కుట్రలకు తెర లేపుతున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ, కోదండరామ్, సీపీఐ కలికట్టుగా మహాకూటమి పేరుతో ద్రోహ కూటమి పేరుతో ముందుకువస్తున్నారు. సింగరేణిలో బాయిల మీదకు దండయాత్రకు వస్తున్నారు. కార్మికులారా తస్మాత్ జాగ్రత. సిద్ధాంతాలు మరిచి, విభేదాలను పక్కనబెట్టి కేసీఆర్ అభివృద్ధి అడ్డుకోవడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. కుట్రలను పసిగట్టి, కుహనా నాయకుల విధానాలను ఎండగట్టడంలో ముందుడే నల్లసూరీళ్లు మరోసారి తమ ఉద్య మస్ఫూర్తిని చాటుకునే సమయం ఆసన్నమైంది. తెగువకు, ధైర్యానికి ప్రతీకలైన సింగరేణి కార్మికులు ప్రతిసారి జరుగుతున్న కుట్రలను తుత్తునీయలు చేస్తున్నారు.

ఇప్పుడు జరుగుతున్న కుట్రలను సైతం పసిగట్టి వాటిని ఛేదించేందుకు సిద్ధమయ్యే ఉన్నారు. వాటిని పసిగట్టి తెలంగాణ పౌరుషాన్ని చాటేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎన్నికలు జరుగనున్న డిసెంబర్ 7కు ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్నది. ఆ రోజున అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన విద్యార్థులపై లాఠీచార్జి జరిగిన సందర్భం లో మా బిడ్డల నెత్తురు చుక్క నేలిరాలితే.. బొగ్గుబాయి కార్మికులం అగ్గిలాగా మండుతం, సమైక్యవాదాన్ని దహిస్తమని సింగరేణి కార్మికులు పోరాటస్ఫూర్తితో సమ్మెకు దిగిన రోజది. మళ్లీ అదే డిసెంబర్ 7వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో సమైక్యవాదాన్ని బొందపెట్టి, కర్రు కాల్చి వాత పెట్టేందుకు ఎదురుచూస్తున్నారు. (వ్యాసకర్త: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు) బాల్క సుమన్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.