Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బాగుపడుతున్నాం, భయం వద్దు

ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యోగ కల్పన తగ్గుతున్న తరుణంలో, తెలంగాణ మాత్రం ఉద్యోగ కల్పనలో దేశ సగటు కంటే ముందున్నది. అయినా కూడా అమాయక యువకులను రెచ్చగొట్టడం వల్ల తెలంగాణకు మేలు జరుగదని నిజాయితీ గల మేధా వులు భావిస్తున్నారు. తెలంగాణలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగులకు పోటీ పరీక్షల ద్వారా ఇవ్వవలసిందే. వాస్తవికతకు పరిమితి ఉంటుంది, ఊహలోకం అనంతమైంది అని రూసో చెప్పి నట్లు కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం, తమ ఉనికిని కాపాడుకోవడం కోసం నిరుద్యోగులను పక్కదారి పట్టించడానికి చేస్తున్న కుట్రను యువత అర్థం చేసుకుంటున్నది.

నిరుద్యోగ సమస్య అనే కఠినమైన సవాలు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి వారసత్వంగా సంక్రమించింది. గ్రామీణ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడమే నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణమని మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్‌ఠాగూర్ వంటివారు భావించారు. 1955లో విడుదలైన మిస్సమ్మ సినిమాలో కథానాయకుడు, నాయకురాలు డిగ్రీ పూర్తిచేసి, ఉపాధి లభించక, భార్యాభర్తలుగా నటించి ఉపాధి సంపాదిం చడం, ఆ రోజుల్లోనే చదువుకున్న వారి నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌వో) ఇటీవల ప్రచురించిన వరల్డ్ ఎంప్లాయిమెంట్ సోషల్ ఔట్‌లుక్‌లోని నివేదిక ప్రకారం-2016లో నిరుద్యోగులు 5.6 శాతం కాగా, 2017లో, 2018లో 5.7 శాతంగా ఉంటారు. వర్తక వాణిజ్యం క్షీణించి, ప్రైవేటు పెట్టుబడులు తగ్గే అవ కాశం ఉందని, దీనివల్ల నిరుద్యోగం పెరుగవచ్చునని తెలిపింది. ఉపాధి కల్పన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు.

కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ లేబర్ బ్యూరో 2016 నివేదిక ప్రకారం మన దేశంలో సుమారు 52 కోట్ల కార్మిక శక్తి ఉన్నది. అందులో 46.6 శాతం స్వయం ఉపాధిలో ఉన్నారు. 32.8 శాతం సాధారణ కార్మికులు. 17 శాతం మాత్రమే స్థిరమైన వేతనం పొందుతున్నారు. న్యూ ఢిల్లీలోని మానవాభివృద్ధి అధ్యయన సంస్థ ప్రచురించిన నిరుద్యోగ నివేదిక-2016 ప్రకారం భారత్ సేవారంగ ఆధారిత అభివృద్ధి నుంచి ఉత్పత్తి, వ్యవసాయంరంగ అభివృద్ధి వైపు పయనించినప్పుడే ఉద్యోగకల్పన భారీగా పెరుగుతుంది. కార్మికుల్లో విద్యా నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమైంది. భారతదేశం ప్రాథమిక విద్యకు, ఉన్నత విద్యకు నిధుల కేటాయింపు 1:9 నిష్పత్తిలో ఉం దని, అదే అభివృద్ధిచెందిన దేశాల్లో సుమారు 1:1గా, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 1:3గా ఉందని తెలిపింది. ఉపాధి అవకాశాలను పెంచాలంటే ప్రాథమిక విద్యకు నిధులు పెంచాలని సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 500 గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేశారు. ప్రాథమిక విద్యను పెంచి తద్వారా ఉద్యోగ కల్పనకు తోడ్పడాలనే దూరదృష్టితో తీసుకున్న చర్య ఇది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వారు ప్రచురించిన ఎంప్లాయిమెంట్, ఎడ్యుకేషన్ అండ్ స్టేట్ అనే పరిశోధనాపత్రంలో ఉపాధి కలిగి ఉన్న వారిలో 20 శాతం మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారని, మిగతా ఎనభై శాతం అసంఘటిత రంగంలో ఉన్నారని తెలిపింది. భారత దేశంలో ఉపాధి కల్పన పెంచడానికి ప్రాథమిక విద్య, మౌలిక వసతులు, వైద్యంపై శ్రద్ధ వహించాలని మార్గదర్శనం చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి బడ్జెట్‌ను పరిశీలించినట్లయితే, మౌలిక వసతులు, సంక్షేమం, వ్యవసా యం, విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి అత్యధిక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిసిపోతుంది.

58 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ నీళ్ళు, నిధులు, నియామకాల్లో అన్యాయానికి గురైం దనేది చారిత్రక సత్యం. వ్యక్తుల ప్రయోజనాల కంటే సమూహ ప్రయోజనాలే ముఖ్యమైనవ ని రూసో మహనుభావుడు అభిప్రాయపడ్డాడు. కేసీఆ ర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్ణాల కు ప్రయోజనం కలిగే విధంగా తన పరిపాలనను సాగిస్తున్నది. నీరే అభివృద్ధికి ఉపాధికి కారణమని హరప్పా నాగరికత నుంచి మానవాళికి తెలిసిన చరిత్ర. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖ.. నీళ్ళు మాత్రమే స్థిరాభివృద్ధికి కారణమని, నీటి లభ్యత ఉపా ధి, విద్య, వైద్య, సంక్షేమ రంగాల అభివృద్ధికి కారణమవుతుందని తెలిపింది. తెలంగాణలో కృష్ణా, గోదావ రి నదుల్లోని నీటి హక్కుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రయత్నిస్తూ, నీటి హక్కులను కాపా డటానికి ఎంతో రాజనీతిని ప్రదర్శిస్తున్నారని ఎందరో మేధావులు ప్రజలు కొనియాడుతున్నారు. ముఖ్య మం త్రి విజ్ఞతను, ముందుచూపును ప్రశంసిస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ నీటి హక్కులను కాపాడు తూనే, నీటి పారుదల, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలను చేపడు తున్నారు. వలసల జిల్లాగా పేరుగాంచిన అవి భక్త పాలమూరు జిల్లాలో నీటి లభ్యత వల్ల అనేక మం ది జీవితాలు చిగురుతొడిగాయి. పాలమూరుకు వ్యవ సాయ కూలీలుగా పక్క రాష్ట్రం నుంచి వలసవచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఇది కేసీఆర్ ప్రభుత్వం రెండున్నరేండ్లలోనే సాధించిన ఘనత.

ముఖ్యమంత్రి కలలుగన్నట్టు గా, తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారిన నాడు, తెలంగాణ ఉపాధి అవకాశాల బంగారు గనిగా మారి సిరి సంపదలతో తులతూగుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొద్ది కాలంలోనే తీసుకున్న నిర్ణయాలు గమనార్హమైనవి. మిషన్ భగీరథ, వ్యవసాయ రుణమాఫీ, మౌలిక వస తుల కల్పనకు అత్యధిక నిధుల కేటాయింపు, చేపల పెంపకం, గొర్రెల పెంపకం, చేనేత కార్మికులకు చేయూ త, ఆటో కార్మికుల రవాణా పన్నురద్దు, ట్రాక్టర్ రవా ణా పన్ను రద్దు, గృహ, వాణిజ్య అవసరాలకు 24 గం టల విద్యుత్తు, వ్యవసాయరంగానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు, సెలూన్ విద్యుత్తు చార్జీలను గృహ వినిమయ రుసుముకు మార్చడం మొదలైనవన్నీ ఉపా ధి అవకాశాలను పెంపొందించేవే. బీడీ, గీత, వృద్ధ, వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్, అసంఘటిత కార్మికులకు ఆరు లక్షల బీమా మొదలైనవి పేదల సం క్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. తెలంగాణ ఏర్పడేనాటికి నిర్వీర్యమై ఉన్న స్వయం ఉపాధి వ్యవస్థ 24 గంటలు కరెంటు సరఫరా మూలంగా పుంజుకుంటున్నది. వడ్రంగి, గిర్నీ, వెల్డింగ్ వంటి వృత్తులవారికి చేతినిండా పని ఉండటమే కాకుండా కొత్తవారికి ఉపా ధి లభిస్తున్నది.

బాంబే స్టాక్ ఎక్సేంజ్, సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) వారు 2016 ఫిబ్రవరి నుంచి 2017 జనవరి మధ్యకాలంలో నిరుద్యోగ శాతం జాతీయస్థాయిలో 7.98 శాతం ఉండగా, తెలంగాణలో 5.5 శాతంగా ఉందని వెల్లడించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలు, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ మొదలైన అనేక పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం వల్లనే మన రాష్ట్రంలో నిరుద్యోగ శాతం దేశ సగ టు కన్నా తగ్గింది. ఎవ్వరైతే తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోరో వారు అభివృద్ధిని సాధించలేరని జార్జి బెర్నార్డ్ షా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతన ఆలోచనా విధానాన్ని అవలంబిస్తూ టీఎస్ ఐపాస్ వం టి నూతన చట్టాలను రూపొందించడం ద్వారా అమెజాన్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి మరెన్నో అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవిధంగా ఆకర్షించింది. టీహబ్, టాస్క్ వంటి సం స్థల ద్వారా సృజనాత్మకత, నైపుణ్యం పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని రతన్ టాటా, సుందర్ పిచాయ్, టీం కుక్ వంటివారు ప్రశంసించ డం గమనార్హం. ఫార్మాసిటీ, టెక్స్‌టైల్ పార్క్ వంటివి నెలకొల్పడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తున్నది. తద్వారా ఉపాధి అవకాశా లు పెరుగుతాయనడంలో సందేహం లేదు.

జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత ఉద్యోగస్తుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసి, గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు ఎంతమంది ఉద్యోగస్తులు అవసరమో శాస్త్రీయంగా అధ్యయనం చేయిస్తున్నది. కమలనాథన్ కమిటీ ఉద్యోగస్తులను తొందరగా విభజించాలని కేంద్రంపై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉద్యోగ ఖాళీలను గుర్తిం చి, వాటిని టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేయడానికి ప్రయత్నిస్తున్నది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీ కరించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతున్నది. కొందరు కోర్టుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినప్పటికీ వాటిని పటాపంచ లు చేస్తూ ప్రభుత్వం క్రమబద్ధీకరించే దిశలో ప్రయత్ని స్తున్నది. ఎక్కడ విజ్ఞతతో సహజవనరుల వినియోగం సాగు తుందో అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇక్కడి వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం, తద్వారా ఉపాధి, అభివృద్ధి పెంపుదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారు.

హేతుబద్ధత ఎప్పుడూ ఉన్నప్పటికీ సహేతుకంగా లేదు అన్నాడు కార్ల్‌మార్క్స్. కొందరు మేధావులు, కొన్ని పార్టీలు వాస్తవాలను కప్పిపుచ్చి, లేని భయాం దోళనలు కలిగించడం ద్వారా ఉపాధి కోసం ప్రయత్ని స్తున్న అమాయక యువకులను రెచ్చగొడుతున్నారు. తద్వారా ఒక వ్యక్తి కార్యాచరణను ఉమ్మడి కార్యాచరణ గా చెప్పుకుంటున్నారు. దీనినంతా అత్యధిక ప్రజలు అ సహ్యించుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యోగ కల్పన తగ్గుతున్న తరుణంలో, తెలంగాణ మాత్రం ఉద్యోగ కల్పనలో దేశ సగటు కంటే ముందున్నది. అయినా కూడా అమాయక యువకులను రెచ్చగొట్టడం వల్ల తెలంగాణకు మేలు జరుగదని నిజాయితీ గల మేధా వులు భావిస్తున్నారు. తెలంగాణలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగులకు పోటీ పరీక్షల ద్వారా ఇవ్వవలసిందే. వాస్తవికతకు పరిమితి ఉం టుంది, ఊహలోకం అనంతమైంది అని రూసో చెప్పి నట్లు కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం, తమ ఉనికిని కాపాడుకోవడం కోసం నిరుద్యో గులను పక్కదారి పట్టించడానికి చేస్తున్న కుట్రను యువత అర్థం చేసుకుంటున్నది.

– సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.