Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతు కదిలె.. ఢిల్లీ దద్దరిల్లె

  • రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నాలు
  • భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు

రైతన్న ఉగ్రుడయ్యాడు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షపై భగ్గుమన్నాడు. రైతుల కోసం ధాన్యం కల్లాల నిర్మాణానికి వినియోగించిన ఉపాధి హామీ పథకం నిధులను వెనక్కి ఇవ్వాలంటూ కేంద్రం ఇచ్చిన తాఖీదులపై ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఇదేం పద్ధతి? అంటూ నిలదీశాడు. మోదీ సర్కార్‌ పద్ధతి మార్చుకోవాలని నినదించాడు. ఉపాధి హామీ పథకం నిధులపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరారమారావు పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రైతు మహాధర్నాలు విజయవంతమయ్యాయి. అన్ని జిల్లాల కేంద్రాల్లో నిర్వహించిన మహాధర్నాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, రైతులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా నినాదాలు చేశారు. పలుచోట్ల ధాన్యం ఆరుబయట పోసి నిరసన వ్యక్తంచేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డితోపాటు పార్టీ జిల్లా అధ్యక్షులు, పలువురు ఎంపీలు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

సంగారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. మెదక్‌లో జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సిద్దిపేటలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌ హుస్సేన్‌, యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్‌ మహాధర్నాలో ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, కామారెడ్డి ధర్నాలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే పాల్గొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్‌, రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, రాములునాయక్‌, హరిప్రియానాయక్‌, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

దద్దరిల్లిన కరీంనగర్‌ కలెక్టరేట్‌
కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జగిత్యాలలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, వనపర్తిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్‌, జోగుళాంబ గద్వాల జిల్లాలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

కదంతొక్కిన నల్లగొండ
నల్లగొండలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో నిర్వహించిన ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌, సూర్యాపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి, భువనగిరిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

గర్జించిన ఓరుగల్లు
వరంగల్‌లో నిర్వహించిన ధర్నాలో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌, హనుమకొండలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్మృతి వనం(ఏకశిలా పార్కు)లో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జనగామలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య, గూడూరులోని ఎన్‌హెచ్‌ 365పై నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, ములుగులో ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య తదితరులు పాల్గొన్నారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌, ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌, మంచిర్యాల కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఎమ్మెల్యే కాలెయాదయ్య, వికారాబాద్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుల వెన్నంటి నిలవాలి
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కేంద్రం వెన్నంటి నిలవాలి. మోదీ సర్కార్‌ ఇప్పటికైనా కర్షక వ్యతిరేక విధానాలను విడనాడాలి. జాతీయ రైతు దినోత్సవం రోజు రైతులు నిరసనలు చేపట్టడం దురదృష్టకరం. ఈ దుస్థితికి కేంద్రమే కారణం. ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.151 కోట్లతో కల్లాలను నిర్మించాం. వీటి కోసం ఖర్చు చేసిన నిధులను వెనక్కి ఇవ్వాలని మోదీ సర్కార్‌ తాఖీదు పంపడం ఎంత వరకు సమంజసం? ఇదే విధానాన్ని అమలు చేస్తున్న పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ర్టాల్లో నిధులు వెనక్కి ఇవ్వాలని ఎందుకు తాఖీదులు ఇవ్వలేదు? దేశంలో చట్టం అందరికీ ఒకేలా ఉండాలి. కానీ వారికి అనుకూలమైన రాష్ర్టాలకు ఒక చట్టం, తమ తప్పుడు విధానాలను ఎండగట్టే రాష్ట్రాలకు మరో న్యాయమా?

-నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

బీజేపీ కుట్రలు సాగనీయం
బీజేపీ కుట్రలు తెలంగాణలో సాగనీయం. రైతులు నిర్మించుకున్న పంట కల్లాలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. కల్లాలకు వ్యతిరేకంగా విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలి.
– మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

బీజేపీ రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్‌ ఉందా?
తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు తదితర పథకాలు బీజేపీ రాష్ర్టాల్లో ఉన్నట్టు బండి సంజయ్‌ నిరూపిస్తే.. మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం చేస్తా. కల్లాల నిర్మాణానికి వినియోగించిన పైసలు తిరిగి ఇవ్వాలని ఎలా అడుగుతారు? మోదీ ఇంట్లో నుంచి పైసలు ఇచ్చాడా?
– కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి

సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు తెలుసా?
ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన రూ.150 కోట్లను కేంద్రం రికవరీ చేయడం సరికాదు. కేంద్రం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు వీలుగా కమ్యూనిటీస్‌ స్టోరేజ్‌ కింద కల్లాలను ఏర్పాటు చేశాం. 40,199 మందికి ఉపాధి హామీ కింద డబ్బులు చెల్లించాం. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున రోడ్లపై వడ్లు ఆరబెడితే అరెస్ట్లు చేయాలని, జరిమానాలు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు ప్రత్యామ్నాయం చూడాలని సూచించింది. సీఎం కేసీఆర్‌ ముందస్తు ఆలోచనలో భాగంగానే రైతుల కోసం కల్లాలను నిర్మించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రైతులు ధాన్యాన్ని ఎకడ ఆరబోసుకోవాలో కేంద్రమే చెప్పాలి. కేంద్రం చేయాల్సిన పని రాష్ట్రం చేస్తుంటే అభినందించాల్సింది పోయి అకసు వెళ్లగక్కడం దారుణం. రాష్ట్రానికి రావాల్సిన ఉపాధి హామీ పథకం డబ్బులు రూ.150 కోట్లను జీఎస్టీలో రికవరీ చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్రం ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నది.
– బోయినపల్లి వినోద్‌కుమార్‌,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.