టీఆర్ఎస్కు వెల్లువెత్తుతున్న సకల జనుల మద్దతు టీఆర్ఎస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి సబ్బండ వర్ణాలు టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నాయి. గులాబీ పార్టీ సభ్యత్వాలనుస్వీకరించేందుకు సకలజనులు ముందుకొస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పురోహితులు సైతం గులాబీ పార్టీ సభ్యత్వాలను స్వీకరించడమే దీనికి నిదర్శనం.టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరందుకున్నది. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం గురువారానికి రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా ప్రారంభమైంది. పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. గురువారం 31 జిల్లాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదయ్యాయి.

మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వ్యాడ్యాల్లో వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, వనపర్తిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డల రవికుమార్ గురువారం మంత్రి లకా్ష్మరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా ఆయనకు మంత్రి పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి జగదీశ్‌రెడ్డి పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సభ్యత్వ నమోదును శాసనమండలిలో విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించి నియోజకవర్గ ఇన్చార్జి శంకరమ్మకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. కోదాడలో నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి మొదటి సభ్యత్వాన్ని మాజీ ఎమ్మెల్యే చందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులిఅనితానాగరాజులకు అందచేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖమ్మంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ బుడాన్ బేగ్ పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని అందజేశారు. మధిర, బోనకల్ మండలాల్లో విత్తన కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు సభ్యత్వాలను అందించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి సభ్యత్వాన్ని స్వీకరించారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్య మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ జీ నాగేందర్‌గౌడ్, ఎమ్మెల్యే బీ సంజీవరావు, రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చేవెళ్లలో ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య సభ్యత్వ నమోదును ప్రారంభించారు.


సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, సిద్దిపేట, వర్గల్ మండలాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. వర్గల్ మండలంలోని గౌరారంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సభ్యత్వ తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు జరిగింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డిప్యూటీమేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్లు ఎంఏ షఫి, సంజయ్‌గౌడ్, కిలారి మనోహర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆల్విన్ కాలనీలో, మేడ్చల్‌లో ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లిలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును చేపట్టారు.