పార్టీ సభ్యత్వ నమోదులో గులాబీ దండు దూకుడు పెంచింది. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు ఈ ఏడాది బడ్జెట్‌లో బీసీలకు ముఖ్యంగా కులవృత్తులకు పెద్దపీఠ వేయడంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో సకల జనులు టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో గులాబీ శ్రేణులు కూడా పార్టీ సభ్యత్వాలు అందించేందుకు ఇంటింటి కార్యక్రమం చేపట్టారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదు కార్యక్రమం జోరుగా సాగింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కలలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో గతేడాది 60 వేల సభ్యత్వాలు నమోదు చేశామని, ఈ సారి 80 వేలు చేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ్యత్వం తీసుకున్నవారికి రూ.2 లక్షల భీమా వర్తిస్తుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మానిక్‌బండార్‌లో సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రారంభించారు.


వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ నగరంలోని 33వ డివిజన్ తరాలపల్లిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మె ల్సీ పురాణం సతీశ్‌కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర మహిళ కార్యదర్శి రాథోడ్ చారులత పర్యటించి సభ్యత్వాలు అందజేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిగిలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, సిద్దిపేట పట్టణంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరిక సింగారంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇండస్ట్రీయల్ చైర్మన్ బేగ్, గ్రేటర్ హైదరాబాద్ నగరం లోని రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లిలో ఎమ్మెల్యే టీ ప్రకాశ్‌గౌడ్, మూసపేటలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ తూము శ్రావణకుమార్, రామంతాపూర్‌లో మేయర్ బొంతు రామ్మోహన్, కంటోన్మెంట్‌లోని లాల్‌బజార్‌శాస్త్రినగర్‌లో ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, తార్నాకలో టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీ ఎలిమేనేటి కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వలో ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
