Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సామాజిక సంక్షేమమే పరమావధి

నిపుణులు చెబుతున్నదానిని, రేటింగ్స్‌ను బట్టి చూస్తే తెలంగాణ అత్యంతవేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇతర రాష్ర్టాలను త్వరలో దాటి పోనున్నది. అభివృద్ధి, జాతీయ ఐక్యత, ఉగ్రవాదం, సామాజిక సంక్షే మం, సామాజిక న్యాయం మొదలైన అంశాలలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. తెలంగాణ బడ్జెట్ సామాజిక సంక్షేమం, సామాజిక న్యాయానికి తోడ్పడేది. దీనిని విమర్శించడం తప్పుడు అవగాహనను సూచిస్తుంది. ఎంతో అధ్యయనం, కృషి తరువాత రూపొందించే జీడీఎస్‌పీ అంకెలను తప్పుపట్టడం విచక్షణారాహిత్యమే.ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపె ట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ ఉత్తేజకరమైనది. రివాజుగా లెక్కలు, తీసివేతలు సరిసమానం చూసుకుంటూ చేసే గుమాస్తాగిరీ ఇందులో కనిపించదు. బడ్జెట్‌లో సంక్షేమ పాలన, ప్రజాకేంద్ర బడ్జెట్ అనే కొత్త రాజకీయ పరిభాష కనిపిస్తున్నది. తెలంగాణను పునరావిష్కరించాల నే కేసీఆర్ నిబద్ధత కూడా బడ్జెట్‌లో వ్యక్తమవుతున్నది.

బంగారు తెలంగాణ (సంక్షేమ రాజ్యం) నిర్మించాలనేది కేసీఆర్ ప్రగాఢ వాంఛ. ఈ అనురక్తి ఆయనను గతంలో మాదిరిగా సామాజిక సేవా కేటాయింపులకు పరిమితం చేయకుండా, అణగారినవర్గాల అభ్యున్నతికి పాటుపడి, వారికి ఉన్నతవర్గాల వారికి మధ్య అంతరాన్ని తొలిగించపూనుకునేలా చేసింది. సంక్షేమరా జ్యాన్ని స్థాపించాలనేది రాజ్యాంగ లక్ష్యం. ఆదేశిక సూత్రాల ద్వారా దీనికి తగిన చట్రాన్ని నిర్మించి పెట్టింది. దీనిని సాకారం చేయడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నా రు. సామాజికరంగ కేటాయింపులతో కొత్త ఆర్థిక నిర్మాణానికి అట్టడుగు వర్గాలపై దృష్టిపెట్టా రు. ఇందులో సామాజికవర్గ ప్రాతిపదికగా సామాజిక సంక్షేమంపై దృష్టిసారించారు. ఈ విధమైన కేటాయింపులు సాగించినంత మాత్రాన, గ్రామీణం, మౌలిక వసతులు, గృహకల్పన, మంచినీళ్ళు, సాగునీళ్ళు, ఐటీ-పరిశ్రమలు మొదలైన రంగాల ప్రాధాన్యాన్ని బడ్జెట్‌లో తగ్గించకపోవడం గమనార్హం. వ్యవసాయం దాని అనుబంధరంగాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఒకవైపు ఆర్థిక జాగరూకత ద్వారా ఈ సమ్యక్ దృక్పథంతో బడ్జెట్ రూపకల్పన సాధ్యమైంది. పెద్దగా వెసులుబాటు ఉండకపోవడం వల్ల రాష్ట్ర బడ్జెట్‌లు మూస పద్ధతిలో, రొడ్డకొట్టుడుగా ఉంటాయి. మార్పు కోసమే అంటూ ఇటువంటి బడ్జెట్‌లను ప్రవేశపెట్టడం విచిత్రం. లాభాలు తెస్తాయనే ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడం, జమా తీసివేతలను సరిచూసుకోవడానికి బడ్జెట్ ప్రక్రియ పరిమితమవుతుంది. ఈ క్రమంలో కిందివర్గాలకు ఈ నిధులు చేరకపోవడం వల్ల, సామాజిక న్యాయంపై ఈ దుష్ప్రభావం పడుతుంది. కేసీఆర్ ఆయనకు నమ్మకమైన యోధుడు ఆర్థికమంత్రి పాత బంధనాల నుంచి బయటపడి కొత్తగా ఆలోచించారు. సామాజిక కేటాయింపులు వేరు, సామాజిక సంక్షేమం వేరు అనే స్పృహ కేసీఆర్‌కు ఉన్నది కనుకనే ఆయన సంక్షేమరంగాన్ని విస్మరించకుండానే సామాజికరంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన ప్రజల సంక్షేమానికి తగు ప్రాధాన్యం లభించింది. బడ్జెట్ లక్ష్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో విశ్లేషించి చూస్తే, అభివృద్ధి అంచులకు ఆవల ఉన్న విస్తృత సామాజికవర్గాలను కలుపుకొనే విస్తృత- సమ్మిళిత విధానమనే తాత్వికత దృక్కోణం వెల్లడవుతుంది. సాధికారత, అభివృద్ధికి నోచుకోవలసిన సామాజికవర్గాలను నిర్దిష్టంగా గుర్తించడం ద్వారా ఈ కృషి సాగింది. ఇంతకాలం ఈ విధాన సూక్ష్మాంతరాన్ని పదేప దే వల్లించారు తప్ప ఏనాడు అమలు చేయలేదు. ఇందుకు సామాజికవర్గ విధానం సులభసాధ్యమైనదిగా మారింది. బడ్జెట్‌లో కేటాయింపులకే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయికి చేరే విధమైనట్టి పథకాల రూపకల్పన జరిగింది. క్యాబినెట్ ప్యానెల్ నిపుణుల, క్షేత్రస్థాయి కార్యకర్తల తోడ్పాటుతో కార్యాచరణ ఉప పథకాలను పర్యవేక్షిస్తున్నది. ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన సామాజికవర్గాలను ఆదుకునేందుకు బడ్జెట్‌లో మోస్ట్ బ్యాక్‌వర్డ్ కాస్ట్స్ (ఎంబీసీలు)లనే దృక్కోణం ప్రవేశపెట్టారు. న్యాయబద్ధంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావడానికి ఎదురుచూస్తున్న వర్గాలివి. అయితే ఈ ఎంబీసీల జాబితా ఇంకా తయారుచేయవలసి ఉన్నది.బడ్జెట్ కేటాయింపు తీరులో దృఢ నిశ్చయం వ్యక్తమవుతున్నది. దీనిని కచ్చితంగా అమలుచేయడానికి నిర్ణీత వ్యవధిలో శాసనసభ పర్యవేక్షణ ఉండే ఏర్పాటు చేశారు. నిర్ణీత కాలవ్యవధిలో ఈ పథకాలు నేరుగా ప్రజలను చేరాలనేదే ఈ ఏర్పాటులోని మూలభావన. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఉపయోగించడమే మా బడ్జెట్ అనేది ఆర్థిక మంత్రి దృఢ నిశ్చయం అయ్యాక ఇక ఇంతకు మించి చేసేది ఏముంటుంది. ఇది బ్యాలట్ బాక్స్ బడ్జెట్ కాదు అంటారాయన. ఆర్థికమంత్రి సమర్పించిన 47 పుటల బడ్జెట్ పత్రంలోని 85 అంశాలలో సగం కన్నా ఎక్కువగా కొత్త సంక్షేమ విధానం గురించి వివరించడానికే కేటాయించారు. మీడియా దీనిని వరద పాశమనే రీతి లో వ్యాఖ్యానించింది. ఇది మామూలు పాయసం కాదు, విస్మత వర్గాల హక్కుల కలశం.

కేసీఆర్‌లో ఇమిడి ఉన్న ఔదార్యం ఈ బడ్జెట్ రూపకల్పనను మరింత ఉత్తేజకరంగా మార్చింది. ఈ అణగారిన వర్గాలను, కేసీఆర్ తన సహచరులు అని సంబోధిస్తుంటారు. వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అనేకసార్లు కంటతడి పెడుతుంటారు. ఎంతో కాలంగా ఈ అట్టడుగువర్గాల వారి బాధలు అరణ్యరోదనగా ఉండేవి. ఇప్పుడు కేసీఆర్ వారిని పట్టించుకొని ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు. కొందరు సమాజంలో గౌరవప్రదంగా ఉన్నప్పటికీ దురదృష్టకర జీవనం గడుపుతుంటారు. అంగన్‌వాడీ కార్మికులు, జీహెచ్‌ఎంసీ స్వీపర్లు, కాంట్రాక్ట్ స్టాఫ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులు, హోంగా ర్డులు, వివిధ ప్రాజెక్టులలోని కాజువల్ లేబర్, ఇతరత్రా చాలీచాలని వేతనం గల బడుగులు. వీరందరిని కేసీఆర్ దైవదూతలుగా గౌరవంగా చూడాలంటారు. వారి పని పరిస్థితులను, ఇంతకాలం వారిపట్ల చూసిన నిర్లక్ష్యాన్ని గ్రహించి ఆవేదన చెందుతూ కన్నీరు కారుస్తుంటారు. ఆయన వ్యక్తం చేసే ఆ ఆవేదనే తాజా బడ్జెట్‌లో వ్యక్తమైంది. మానవ మర్యాదను గుర్తించడంతోపాటు, తన బాధ్యతను చేపట్టడం ఉత్తేజకరమైన విష యం. ఐదు విధాలుగా భిన్న సామాజిక సంక్షేమ పథకాలను బడ్జెట్‌లో పొందుపరిచారు. 1.వేతన పెంపు, మెరుగైన పనిపరిస్థితులు. 2.వృత్తి కులాలకు సామాజిక సంక్షేమ పథకాలు. 3.మొత్తం సంక్షేమ కేటాయింపుల లో 28 శాతం ఎస్సీ ఎస్టీలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ రూపంలో కేటాయింపు. 4.ఆసరా పింఛన్ల రూపంలో సామాజిక భద్రత. దీనిని ఇప్పుడు నిరాశ్రయులు, ఒంటరి మహిళలకు వర్తింపజేశారు. కల్యాణ లక్ష్మీ తోడ్పాటు కూడా 50001 నుంచి 75 వేలకు పెంచారు. 5.మహిళా శిశు సంక్షేమ పథకం (ఆరోగ్యం, పోషకాహారం)లో భాగంగా తల్లికి పన్నెండు వేలు ఇవ్వడంతోపాటు, నవజాత శిశువుకు ఆరు వందల రూపాయల విలువ గల కేసీఆర్ కిట్ అందజేస్తారు. ఆడశిశువు అయితే తల్లికి మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తారు.

ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగస్తులకు 42 శాతం ఫిట్‌మెంట్‌తో మొదలుపెట్టారు. రెండు లక్షల మంది ఉద్యోగస్తులకు 50 నుంచి 200 శాతం మేర వేతనం పెంచారు. కడగొట్టు మనిషికి న్యాయం అందేలా ప్రయత్నిస్తున్నారు. మరో విషయం. సామాజికవర్గాల ప్రాతిపదికన సం క్షేమ బడ్జెట్ కేటాయింపుల మూలంగా ఒక్కో గొర్రెల పెంపకందారు ఇరవై గొర్రెలను, ఒక పొట్టేలును 75 శాతం సబ్సిడీతో పొందుతాడు. చేపలు పట్టడం పరిశ్రమ హోదా పొందడం వల్ల అపరిమత నిధులు పొందవచ్చు. క్షురకులు, రజకులకు కొత్త పథకాలు బడ్జెట్‌లో ఉన్నాయి. విశ్వకర్మలకు, మేర, గౌడ తదితర వృత్తుల వారికి ఉదారంగా నిధులు కేటాయించారు. చేనేత మార్కెటింగ్‌కు, ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. అన్నిటికి మించి, మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌ను గుర్తించి, వెయ్యి కోట్ల రూపాయల కార్పస్‌తో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తున్నారు. ఈ విధంగా బీసీలకు ప్రత్యేకించి 5070 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. దీనికి అదనంగా సబ్సిడీ బియ్యం, ఉచిత కరెం టు, రైతు రుణాల రద్దు, ఆరోగ్య, విద్యా సౌకర్యాల వం టివి కలిపితే భారీ కేటాయింపు అవుతుంది. ఉదారంగా కేటాయించిన ఈ నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలె. ఈ సందర్భంగా రెండు అంశాలు గమనించాలె. గొర్రెల పెంపకం, ఉన్ని సేకరణ గొల్లలకు, కురుమలకు సంబంధించినది కాగా రెండింటినీ యాదవులనే ఒకే గొడుగు కింద చేర్చారు. చేపలు పట్టేవారిని, ముదిరాజ్‌లను కూడా ఇదేవిధంగా ఒకేచోట చేర్చారు. అవసరమున్న వారిని ఆదుకోవాలనే ఆతృతలో ముం దంజ వేసిన వారివల్ల బలహీనులు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలె. సామాజికరంగంలో వచ్చిన మార్పును కూడా పరిగణనలోకి తీసుకోవాలె. ఉదాహరణకు- చేనేత కార్మికులు బాధిత వర్గంగా తోడ్పాటు అవసరమే. అయితే రాష్ట్రంలో ఎక్కువలో ఎక్కువగా ఏడువేల మగ్గాలు ఉండి ఉంటాయి. పక్కన పడేసిన మగ్గాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పనిలోకి తేవడమా అనేది స్పష్టం కాలేదు. ఎంబీసీలలోని చాలా మంది ఇంకా సంప్రదాయ వృత్తులలో లేరు. మొత్తానికి గురుకులాలు, మిషన్ భగీరథ కూడా కలిపి లెక్కిస్తే, సామాజిక సంక్షేమంపై దృష్టిసారించి డెబ్బయి శాతం అభివృద్ధి నిధులు కేటాయించారు. బడ్జెట్ అభివృద్ధి కోణం గురించి మాట్లాడుకునే ముందు మన జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపించే రెండు ప్రధాన పథకాలను ప్రస్తావించుకోవడం అవసరం. ఇందులో మొదటిది గురుకుల పాఠశాలల ఏర్పాటు. ఇది సామాజికసేవల కిందకు వచ్చినప్పటికీ సంక్షేమ పథకం. గురుకుల విధానం బలహీనవర్గాలకు నేరుగా తోడ్పడుతుంది. రెండవది- మిషన్ భగీరథ. స్వాతంత్య్రం సిద్ధించి డెబ్బయి ఏండ్లయినా, ఇది ప్రాధాన్యాంశం అని గాంధీ కూడా చెప్పినా, ఇప్పటి వరకు మంచి నీళ్ళు అందించకపోవడం సిగ్గుచేటు. ఈ ఏడాది చివరి నాటికి మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా సాగుతుంది. మిషన్ కాకతీయ చరిత్ర సృష్టించనుంది. ఇక అభివృద్ధి కోణం విషయానికి వస్తే, మూడేండ్లలో మనం సాధించినవాటికి గర్వపడవలసిందే. పెద్ద నోట్ల రద్దు సమస్య ఎదురైనప్పటికీ, 13.1 శాతానికి చేరుకోవడం ద్వారా మన రాష్ట్రం డబుల్ డిజిట్ వృద్ధిని సాధించింది. ఇది కేంద్ర వృద్ధి రేటు కన్నా ఎక్కువ. పారిశ్రామిక రంగ అభివృద్ధి 2013-14లో 0.6 శాతం ఉండగా, 2016 నాటికి 7.5 శాతానికి చేరుకోవడం కూడా చెప్పుకోదగినదే. కేంద్రమే తగినంత వృద్ధి రేటు సాధించలేక తంటాలు పడుతున్న దశలో ఈ అభివృద్ధి విశేషమైనది. రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఆర్థిక రంగం పుంజుకున్నదనడానికి ఇదే ఉదాహరణ. నిపుణులు చెబుతున్నదానిని, రేటింగ్స్‌ను బట్టి చూస్తే తెలంగాణ అత్యంతవేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇతర రాష్ర్టాలను త్వరలో దాటి పోనున్నది. అభివృద్ధి, జాతీయ ఐక్యత, ఉగ్రవాదం, సామాజిక సంక్షేమం, సామాజిక న్యాయం మొదలైన అంశాలలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. తెలంగాణ బడ్జెట్ సామాజిక సంక్షేమం, సామాజిక న్యాయానికి తోడ్పడేది. దీనిని విమర్శించడం తప్పుడు అవగాహనను సూచిస్తుంది. ఎంతో అధ్యయనం, కృషి తరువాత రూపొందించే జీడీఎస్‌పీ అంకెలను తప్పుపట్టడం విచక్షణారాహిత్యమే. (వ్యాసకర్త: పార్లమెంటు సభ్యులు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.