Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

16 గెలిస్తే బంగారు తెలంగాణే..!

-కాళేశ్వరానికి జాతీయ హోదా
-రాష్ట్రవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది
-విభజన అంశాలకు మోక్షం
-ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలకూ వాస్తవరూపం

ఆ పదహారు లోక్‌సభ స్థానాలు గెలిస్తే ఏం జరుగుతుంది? బ్రహ్మాండం బద్దలవుతుందా? పదహారు సీట్లు గెలువాలంటూ ప్రతి సభలో మాట్లాడుతున్నారు? నిజంగా గెలిస్తే 543 సీట్లున్న లోక్‌సభలో ఈ పదహారు మంది ఎంపీలు ఏం చేయగలరు? అన్న ప్రశ్నలు తెలంగాణలో కొంతకాలంగా వినిపిస్తున్నాయి. సందేహం రావడం నిజమే. ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్రసమితి మొత్తం 16 సీట్లు గెలిస్తే.. మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి ఆ సంఖ్యను 17కు చేరిస్తే.. బంగారు తెలంగాణ నిర్మాణంలో ముఖ్యమైన అడుగు పడినట్లే. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలో నిర్ణయించే శక్తి ఈ పదహారు మందికి లభిస్తే.. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి అద్భుతమైన అవకాశం లభిస్తుంది. తెలంగాణ ప్రజాప్రతినిధులకు కేంద్రంలో కీలకపాత్ర పోషించేందుకు వీలవుతుంది. ఆ తర్వాత తెలంగాణను చిన్నచూపుచూసే పరిస్థితి కేంద్రానికి ఉండదు. ఇప్పటి వరకు పెండింగులో ఉన్న అంశాలన్నీ నెరవేర్చుకునే వీలు కలుగుతుంది. పక్క రాష్ట్రంతో ఉన్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. కేంద్రం నుంచి రావాల్సినవి అన్నీ రాబట్టుకోవచ్చు. విభజన సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు ఉండవు.

మొదటి నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇదే విషయాన్ని చెప్తున్నారు. మిత్రపక్షం ఎంఐఎం సీటు (హైదరాబాద్)ను పక్కనపెడితే.. మిగిలిన 16 లోక్‌సభ స్థానాలను తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) గెలిస్తే.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో మనమే కీలకపాత్రను పోషించే అవకాశం ఏర్పడుతుంది. ఎన్‌డీయే, యూపీఏలకు పూర్తిస్థాయి మెజారిటీ రాదనేది.. ప్రతి సర్వేలోనూ వెల్లడవుతున్నది. పైపెచ్చు బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ఈ ఫ్రంట్ ఏర్పాటులో మన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకంగా వ్యవహరిస్తున్న విషయంకూడా తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారు. ఈ నేపథ్యంలో యూపీఏ, ఎన్డీఏలకు కావాల్సిన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు. అలాంటప్పుడు 16 సీట్లు ఉన్న టీఆర్‌ఎస్ కీలకపాత్ర వహిస్తుందని రాజకీయ విశ్లేషకులుకూడా ఒప్పుకుంటున్న అంశమే.

ప్రాజెక్టులకు అండదండలు
దేశంలోనే ఎవరూ చేయని విధంగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి తదితర భారీ ఎత్తిపోతల పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది. ఈప్రాజెక్టుల వల్ల తెలంగాణ సస్యశ్యామలం అవుతుందనే అందరూ నమ్ముతున్నారు. పునర్విభజన చట్టంలో చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చారు. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం మొత్తం కేంద్రమే భరిస్తున్నది. మన రాష్ట్రం విషయానికి వస్తే.. కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు ప్రధానితోసహా కేంద్ర మంత్రులకు విన్నవించారు. ఇక లేఖలు, రాష్ట్ర మంత్రుల విన్నపాలకు లెక్కేలేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఏర్పడనున్న ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తే.. కాళేశ్వరానికికూడా జాతీయహోదా కల కాదు. నిజం అవుతుంది. దీనివల్ల మనపై ఆర్థిక భారంకూడా తగ్గుతుంది. అలాగే పాలమూరు-రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులతోపాటు కేంద్రం నుంచి సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇప్పించుకోవచ్చు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు చేయూత..
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని.. ఇందుకు కేంద్రం రూ.24 వేల కోట్ల నిధులు సాయం చేయవచ్చని నీతిఆయోగ్ సిఫారసుచేసింది. కానీ ఒక్కపైసాకూడా కేంద్రం ఇవ్వలేదు. అదే కేంద్ర ప్రభుత్వాన్ని శాసించేస్థాయిలో ఉంటే పరిస్థితి అలా ఉంటుందా? తప్పకుండా.. నిధులు విడుదల అవుతాయి. దీనివల్ల మన ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది. విభజన చట్టంలోని అంశాలను సాధించుకోవచ్చు. విభజన చట్టంలో పేర్కొన్నవాటిలో ముఖ్యమైనవి ఏవీకూడా ప్రస్తుతం ఉన్న కేంద్రం నెరవేర్చలేదనేది అందరికీ తెలిసిందే. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవచ్చు. అలాగే ఏపీ రాజధాని నుంచి హైదరాబాద్‌కు సూపర్‌ఫాస్ట్ రైలు, రోడ్డు మార్గాలను ఏర్పర్చుకోవచ్చు.

ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..
యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరుచేసిన ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్)ను ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కావాలనే రద్దుచేసింది. అదివస్తే.. హైదరాబాద్‌లో లక్షలాది ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. పెట్టుబడులు వస్తాయి. ఒకవేళ 16 ఎంపీ సీట్లను గెలిస్తే.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తే.. తప్పకుండా ఐటీఐఆర్ లాంటి ప్రాజెక్టులను తెచ్చుకోవచ్చు.ఇక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి, రైల్వే కనెక్టివిటీ గురించి ఎంతచెప్పినా తక్కువే. లాలూప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తన అత్తగారింటికికూడా రైల్వే లైను వేసుకున్నారని తరచుగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్రధారులం మనమే అయినప్పుడు అలాంటి అవకాశం మనకు కూడా దక్కుతుంది. రైల్వే కనెక్టివిటీ విషయంలో చాలా వెనుకబడ్డ తెలంగాణకు కావల్సినన్ని రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్లు తెచ్చుకోవడంతోపాటు.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీనికూడా సాధించవచ్చు. దీనివల్ల వరంగల్ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. వీటితోపాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులను మన రాష్ర్టానికి తెచ్చుకోవచ్చు.

ఏపీతో వివాదాల పరిష్కారం
పక్క రాష్ట్రమైన ఏపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు ఫుల్‌స్టాప్ పెట్టవచ్చు. గడిచిన ఐదేండ్లుగా పరిష్కారం కాని అనేక అంశాలతోపాటు.. కృష్ణా, గోదావరి జల వివాదాలు, పోలవరం ముంపు సమస్య, షెడ్యూల్ 9, 10లోని విభజన అంశాలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు. ఇక ఉద్యోగుల విభజన, సంస్థల విభజన అనేది సాఫీగా సాగేట్టు, కేంద్రం తొందరగా పరిష్కరించేలా ఒత్తిడి తేవచ్చు. దీనివల్ల పరిపాలన మరింత సులభమవుతుంది. మన రాష్ర్టానికి రావాల్సిన విద్యుత్, ఇతర ప్రాజెక్టుల నుంచి మన వాటాను రాబట్టుకోవచ్చు. అంతేకాకుండా.. ఎన్టీపీసీ ఏర్పాటుచేయాల్సిన థర్మల్ విద్యుత్ కేంద్రం పనులనుకూడా వేగవంతం చేయవచ్చు.

కేంద్రంలో ఏర్పడనున్న ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తే.. కాళేశ్వరానికికూడా జాతీయహోదా కల కాదు. నిజం అవుతుంది. దీనివల్ల మనపై ఆర్థిక భారంకూడా తగ్గుతుంది.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని.. ఇందుకు కేంద్రం రూ.24 వేల కోట్ల నిధులు సాయం చేయవచ్చని నీతిఆయోగ్ సిఫారసుచేసింది. కానీ ఒక్కపైసాకూడా కేంద్రం ఇవ్వలేదు. 16 సీట్లు గెలిస్తే ఈ నిధులు తెచ్చుకోవడం సాధ్యమవుతుంది.

యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరుచేసిన ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్)ను ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కావాలనే రద్దుచేసింది. అదివస్తే.. హైదరాబాద్‌లో లక్షలాది ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. పెట్టుబడులు వస్తాయి.

రైల్వే కనెక్టివిటీ విషయంలో చాలా వెనుకబడ్డ తెలంగాణకు కావల్సినన్ని రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్లు చ్చుకోవడంతోపాటు.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీనికూడా సాధించవచ్చు. గడిచిన ఐదేండ్లుగా పరిష్కారం కాని అనేక అంశాలతోపాటు.. కృష్ణా, గోదావరి జల వివాదాలు, పోలవరం ముంపు సమస్య, షెడ్యూల్ 9, 10లోని విభజన అంశాలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు.

కేంద్రం మన చేతిలో ఉంటే ఏమైనా సాధించవచ్చు.. ఏమైనా పనులు చేయించుకోవచ్చు. ఆ అవకాశం కేవలం 16 మంది లోక్‌సభ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ విజయదుందుభి మోగిస్తేనే సాధ్యమవుతుంది. అప్పుడు బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్‌ద్వారా కేంద్ర ప్రభుత్వంపై పట్టు సాధించవచ్చు. అది తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి, వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.