Monthly Archives: October 2020

కర్షక దేవాలయాలు

రైతుకు వెన్నుదన్నుగా నిలిచి రైతు తన కష్టానికి తనే ధర నిర్ణయించుకోవాలన్న ఉద్దేశంతో రైతుబంధు సమితులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి రైతువేదికలను నిర్మిస్తున్నది. ఇవి కేవలం భవనాలు కావు. రైతాంగం భవిష్యత్‌ నిర్మాణ వేదికలు.


CM KCR inaugurated Rythu Vedika in Jangaon


బీజేపీది గంటకొక అబద్ధం.. పూటకొక వదంతి

బీజేపీతో తస్మాత్‌ జాగ్రత్త. బీజేపీ నాయకులు అబద్ధాల పునాదులపై అధికారంలోకి రావాలని చూస్తున్నారు. దుబ్బాకలో గెలువాలని ప్రయత్నిస్తున్నారు. పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. వారి పట్ల దుబ్బాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మోసపోతే గోస పడుతం. తస్మాత్‌ జాగ్రత్త. – మంత్రి హరీశ్‌రావు


ధరణి శకం

యావత్‌ దేశానికే మార్గదర్శనం కాగల.. చరిత్రాత్మక భూ పరిపాలనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీకారంచుట్టారు. అన్ని రకాల భూ లావాదేవీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడంకోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి వెబ్‌ పోర్టల్‌ను.. గురువారం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కార్యాలయంలో ప్రారంభించారు.


అభివృద్ధికే ఓటేస్తరు.. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

ప్రజాభిమానాన్ని నమ్ముకున్న టీఆర్​ఎస్​ ఒకవైపు, తప్పుడు ప్రచారాలను నమ్ముకున్న కాంగ్రెస్, బీజేపీ మరోవైపు దుబ్బాక ప్రజల ముందు పరీక్షకు నిలబడ్డాయి. ప్రజల కోసం పని చేసేవారెవరో, సీజనల్​గా వచ్చే వైరస్​ల మాదిరిగా ఎన్నికలప్పుడు వచ్చి హడావుడి చేసేదెవరో గ్రహించలేనంత అమాయకులు కారు దుబ్బాక ప్రజలు.


నవ శకానికి నాంది

రెవెన్యూ సమస్యలతో విసిగి వేసారిన రైతన్న మోము వికసించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘ధరణీ’శకానికి నాంది పలికారు. ఏండ్ల తరబడి సాగుతున్న అక్రమాలు, అవకతవకలకు చరమ గీతం పాడారు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో గురువారం ధరణి పోర్టల్‌ను పండుగ వాతావరణంలో ప్రారంభించారు.


గోదావరి నీళ్లతో కాళ్లు కడిగి దుబ్బాక రుణం తీర్చుకుంటా

‘బీజేపోళ్లు మన పిల్లలకు సీసలిస్తరట.. గా సీసలతో బతుకుతమా? కాళేశ్వరం నీళ్లు జీవితాంతం వస్తయి.. మన బతుకులు మారుతయి. గోదావరి నీళ్లు తెచ్చి మీ కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటా’ అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


సోషల్‌మీడియాలో గులాబీదళం

సోషల్‌ మీడియాలో ఏ పార్టీకి లేనంతగా స్వచ్ఛంద సైనికులు టీఆర్‌ఎస్‌కు ఉన్నారని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు అన్నారు. ఉద్యమసమయం నుంచి నేటిదాకా కేసీఆర్‌ నాయకత్వాన్ని టీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా స్వచ్ఛంద సైనికులు బలపరుస్తూ వస్తున్నారని చెప్పారు.


టీఆర్‌ఎస్‌దే దుబ్బాక

ఎవరెన్ని ఎత్తులేసినా, ఎన్ని కుట్రలు పన్నినా దుబ్బాకలో గెలిచేది ముమ్మాటికీ టీఆర్‌ఎస్సేనని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు.