-పనులు దక్కించుకున్న ఎల్అండ్టీ వెల్లడి -ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 9.36 లక్షల ఎకరాలకు సాగునీరు -సీతారామ ఎత్తిపోతలకు ఏడాదంతా నీటి లభ్యత -ఖమ్మం జిల్లా పరిధిలో 36.57 టీఎంసీల నీటి నిల్వ -జల విద్యుత్ కేంద్రం 320 మెగావాట్లతో -సీతమ్మబరాజ్‌తో ప్రయోజనాలు
కృష్ణాబేసిన్‌కు వరద లేనిసమయంలో సాగర్ ఎడమకాలువ పరిస్థితి అయోమయంగా మారుతున్నది. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు దిగువన ఉన్న సాగర్ ఎడమకాలువ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించేలా పనులు జరుగుతున్నాయి. కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం మాదిరిగా.. సీతమ్మబరాజ్‌తో నీటి లభ్యతతో సాగర్ ఎడమకాలువ పునర్జీవం కూడా సాధ్యమవుతుంది.
గోదావరిపై దుమ్ముగూడెం దిగువన తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన సీతమ్మబరాజ్ నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తిచేస్తామని పనులు దక్కించుకున్న ఎల్అండ్టీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదలచేసింది. గత నెలలో నిర్వహించిన టెండర్లలో అంచనా వ్యయంకంటే 2.99% ఎక్కువకు కోట్‌చేసి ఎల్అండ్టీ సంస్థ పనులు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు విలువ రూ.2,500 కోట్ల నుంచి రూ. 5వేల కోట్ల వరకు ఉంటుందని ప్రకటనలో స్పష్టంచేసింది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 9.36 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లివద్ద గోదావరిపై దుమ్ముగూడెం బరాజ్ దిగువన బరాజ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
-సమ్మక్క బరాజ్ తర్వాత గోదావరిపై ఇప్పటివరకు నీటి నిల్వకు అవకాశం లేదు. సీతమ్మబరాజ్‌తో ఖమ్మం జిల్లా పరిధిలో ఏకంగా 36.57 టీఎంసీల నీటినిల్వకు అవకాశం లభిస్తుంది. -తెలంగాణ పరిధిలో కృష్ణానదిపై మాత్రమే భారీ జల విద్యుత్ కేంద్రాలు ఉండగా.. సమ్మక్క బరాజ్‌తో గోదావరిపై భారీ జలవిద్యుత్ కేంద్రం సాకారం కానున్నది. -బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ఈ బరాజ్‌తో 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. -సీతారామ ఎత్తిపోతల పథకానికి సీతమ్మ బరాజ్‌తో ఏడాది పొడవునా నీటిలభ్యత