Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆశీర్వాదాల జోష్!

-గులాబీ అభ్యర్థులకు మద్దతు పలుకుతున్న వివిధ వర్గాల ప్రజలు
-నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో భారీ ర్యాలీలు.. ఆత్మీయ సమావేశాలు
-పర్యటనలు.. ప్రచారాలతో గులాబీవనాలుగా మారుతున్న గ్రామాలు
-ఎన్నికల ఖర్చు కోసం విరాళాలు పోగుజేసి అందజేస్తున్న ప్రజలు

గులాబీ దళాల ప్రచారం గ్రామగ్రామానా విస్తృతంగా సాగుతున్నది. భారీ ర్యాలీలు, మహిళల మంగళహారతులు, ప్రజల ఆశీర్వాదాలు శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. ఎన్నికల ఖర్చు కోసం ప్రజానీకం విరాళాలు పోగుజేసి అందజేస్తుండటంతో అభ్యర్థుల్లో మరింత ఉత్సాహం పెరుగుతున్నది. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో జరిగిన కార్యకర్తల సమావేశంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 100 సీట్లు గెలువడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు అనంతరం పలు ఆశీర్వాద, ఆత్మీయ సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలంలో ఉసిళ్లు వచ్చినట్టు ఎన్నికల సమయంలో కాంగ్రెసోళ్లు వస్తారని, ఓట్లు డబ్బాలో పడగానే మాయమవుతారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంకలో జరిగిన ఆశీర్వాద సభల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది టీఆర్‌ఎస్ పార్టీయేనని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలో మంత్రి లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ టువీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఎన్నికల ఖర్చు కోసం రూ. 5,116లు అందజేసి, మద్దతు తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో జరిగిన ముస్లిం మైనార్టీ సమావేశానికి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి హాజ ప్రసంగించారు.

ఊరూరా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు చేత జెండాలు పట్టుకుని తీస్తున్న భారీ బైక్ ర్యాలీలతో గ్రామాలు గులాబీ వనాల్లా మారుతున్నాయి. అభ్యర్థులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలుకుతున్నారు. మహిళలు మంగళహారతులు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మీదేనని.. అండగా ఉంటామని ఆశీర్వదిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలన దేశానికే ఆదర్శమని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లోని దళితకాలనీ వాసులు, కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు శనివారం మంత్రి పోచారాన్ని ఆయన స్వగృహంలో కలిసి మద్దతు ప్రకటించారు. టూవీలర్స్ అసోసియేషన్ సభ్యులు ఎన్నికల ఖర్చు కోసం మంత్రికి రూ. 5,116 అందజేశారు. నిజామాబాద్ అర్బన్ అభ్య ర్థి బిగాల గణేశ్‌గుప్తా నగరంలో విస్తృత ప్రచారం చేశారు. ఆర్మూర్ అభ్యర్థి జీవన్‌రెడ్డి మామిడిపల్లి లో, మహబూబ్‌నగర్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ పట్టణంలో, వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మక్తల్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అమరచింతలో, దేవరకద్ర అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కొత్తకోటలో ప్రచారం నిర్వహించారు.కరీంనగర్ జిల్లాలో..: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రశంసిస్తూ గాంధీనగర్‌కు చెందిన మహిళలు మంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ పట్టణం లో పర్యటించారు. మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్ శంకరపట్నంలో, సైదాపూర్ మండలంలో హుస్నాబాద్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ ప్రచారం నిర్వహించారు.

టీఆర్‌ఎస్‌కు మద్దతుగా టీఎస్, ఓయూ జేఏసీ..
కరీంనగర్‌లో ఓయూ జేఏసీ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, అధ్యక్షుడు బండారి వీరబాబు, ఖమ్మంలో కందుల మధు మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. సిరిసిల్లలో జరిగిన జెండా పండుగల్లో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, రాష్ట్రనాయకుడు నర్సింగరావు పాల్గొన్నారు. పద్మనాయక ఫంక్షహాల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశానికి కొండూరితోపాటు రాష్ట్ర నాయకుడు చిక్కాల రామారావు హాజరయ్యారు. శాంతినగర్ వాసులు మంత్రి కేటీఆర్‌కు మద్దతు ప్రకటించారు. వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు కార్యకర్తలతో కలిసి పట్టణం లో ఇంటింటా ప్రచారం చేశారు. టీఎస్ జేఏసీ, ఓయూ జేఏసీ నేతలు చేపట్టిన ప్రచారయాత్ర సిరిసిల్లకు చేరింది. జగిత్యాల జిల్లా ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు గోవింద్‌పల్లికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త రవీంద్రకుమార్ రూ.51 వేలు, జగిత్యాల అభ్యర్థి సంజయ్‌కుమార్‌కు పలువురు ఎన్నికల ఖర్చుకోసం విరాళంగా అందజేశారు.

నల్లగొండ జిల్లాలో..: నల్లగొండ జిల్లా నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం నార్కట్‌పల్లి మండలంలో, మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నాంపల్లి మండలంలో, దేవరకొండ అభ్యర్థి రమావత్ రవీందర్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి చింతపల్లి మండలంలో, కంచర్ల భూపాల్‌రెడ్డి నల్లగొండలో, మిర్యాలగూడ అభ్యర్థి భాస్కర్‌రావు మిర్యాలగూడలో, తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్ శాలిగౌరారం మండలంలో విస్తృతంగా ప్రచా రం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ.. మరోసారి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి నర్మెట లో, స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి రాజయ్య లింగాలఘనపురం మండలంలో ప్రచారం చేశారు.

టీఆర్‌ఎస్ పాలనలోనే ముస్లింలకు ఆత్మగౌరవం..
సీఎం కేసీఆర్ పాలనలో ముస్లిం మైనార్టీలకు ఆత్మగౌరవం పెరిగిందని, అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి పాటుపడ్డారని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో జరిగిన ముస్లిం మైనా ర్టీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీల పాలనలో ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశారని విమర్శించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి తోడుదొంగలని విమర్శించారు. కుత్బుల్లాపూర్ అభ్యర్థి కేపీ వివేకానంద్ నిజాంపేటలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నా రు. గాగిళ్లాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ బోరబండలో ప్రచారం చేశారు. షాద్‌నగర్ అభ్యర్థి అంజయ్య యాదవ్‌కు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల గ్రామస్థులు మద్దతు ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ: మంత్రి లకా్ష్మరెడ్డి
జడ్చర్ల టౌన్: సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని, అందుకే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మంత్రి లకా్ష్మరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలో బేడబుడగ జంగాల కాలనీలో ఏర్పాటుచేసిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైన నాలుగున్నరేండ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారని వెల్లడించారు. ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని, మళ్లీ గులాబీ పార్టీదే అధికారమని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంగీత, నాటకరంగ అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు చుక్కెదురు
అయిజ రూరల్: జోగుళాంబగద్వాల జిల్లా అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం అయిజ మండలం సంకాపురం గ్రామానికి ప్రచార నిమిత్తం వెళ్లిన ఆయన్ను.. ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగున్నరేండ్లలో కన్నెత్తి చూడని మీరు.. ఇప్పుడు ఎందుకొచ్చారంటూ గ్రామస్థులు నిలదీశారు. దీంతో సంపత్ వర్గీయులు కూర్చొని మాట్లాడుకుందామని గ్రామస్థులకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు లేక నానాఇబ్బందులు పడ్డామని, ఎవ్వరూ పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉండి గ్రామానికి ఏమిచేశారని నిలదీశారు. ఇన్నిరోజులు గుర్తుకు రాని గ్రామం ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామ్లెట్ గ్రామాలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే క్రమంలో తమ గ్రామానికి పంచాయతీ హోదా దక్కిందని ఇది తెలంగాణ ప్రభుత్వ చొరవేనని తెలిపారు. ఇన్నాళ్లకు గుర్తుకు రాని తమను ఓటు వేయమని ఏవిధంగా అడుగుతారని నిలదీశారు. ఓ దశలో మాజీ ఎమ్మెల్యే గ్రామస్థులను సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో గ్రామాన్ని అభివృద్ధి చేయనందుకు క్షమించాలని కోరి అక్కడినుంచి వెళ్లిపోయారు.

మహాకూటమిని అడ్డుకోవాలి: ఎంపీ బడుగుల
కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్ర సాధనలో అడ్డుపడిన పార్టీలే నేడు టీఆర్‌ఎస్‌ను ఓడించాలనే ఉద్దేశంతో మహాకూటమి పేరుతో ప్రజల్లోకి వస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. అలాంటివారి మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ బడుగుల మాట్లాడుతూ.. యాదవ కులమంటే మాట మీద నిలబడే కులమని తప్పకుండా మద్దతుగా ఉంటామని పెద్దపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డికి హామీ ఇచ్చారు. మనల్ని గుర్తించినోళ్లను గెలిపించుకుందాం.. టీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మరిన్ని పథకాలను సొంతం చేసుకుందామని గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్ అన్నారు. యాదవుల సంక్షేమం కోసం గత పాలకులెవ్వరూ కృషి చేయలేదని చెప్పారు. దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ యాదవుల గురించి అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.

ఉద్యమ ద్రోహులను తరిమికొట్టాలె మంత్రి ఈటల రాజేందర్
జమ్మికుంట/వీణవంక: తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది టీఆర్‌ఎస్ పార్టీయేనని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంకలో జరిగిన ఆశీర్వాద, మద్దతు సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మనకో చరిత్ర ఉంది. అది కనుమరుగు కావద్దు. చారిత్రాత్మక ఉద్యమాలు నడిపించినం. ప్రాణాలు పణంగా పెట్టినం. నాటి ఉద్యమ ద్రోహులు మన కండ్ల ముందున్నరు. వాళ్లపై యుద్ధం చేయాలె. మానుకోట ఉద్యమ ద్రోహులను తరిమికొట్టాలెఅని ఈటల అన్నారు. ఉద్యమానికి ఊపిర్లూదింది విద్యార్థులేనని, అరవై ఏండ్ల పరాయి పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. మరోసారి గెలిపిస్తే కడుపులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు.

ఎన్నికలప్పుడే కాంగ్రెసోళ్లు వస్తరు: మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వానకాలంలో ఉశిల్లు వచ్చినట్టు.. ఎన్నికల సమయంలో కాంగ్రెసోళ్లు వస్తారని, ఓట్లు డబ్బాలో పడగానే మాయమవుతారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శనివారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశీర్వాద సభ, హుస్నాబాద్‌లో గొల్ల, కురుమల ఆత్మీయ సమావేశంలోనూ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓట్ల కోసం అవకాశవాదులంతా ఒక్కటై వస్తున్నారని, వారి మా టలు నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు తెలంగాణకు రావాలని చూస్తున్నాడని, ఎన్నటికైనా బాబు ఆంధ్రాబాబేనని విమర్శించారు. కాళేశ్వరాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు తెలంగాణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఓట్ల కోసం ఐదేండ్లకోసారి వచ్చేవారు నాయకులేకాదని, వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు ఖాయం: హోంమంత్రి నాయిని

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ: ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు రావడం ఖాయమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. మంత్రి నాయిని మా ట్లాడుతూ.. దాదాపు 60 ఏండ్లపాటు రాష్ర్టాన్ని నిలువునా దోచుకున్న కాంగ్రెస్, టీడీపీలు జతకట్టి మహాకూటమిగా ఏర్పడటం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. అలాంటివారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆంధ్రాబాబు చంద్రబాబుకు తెలంగాణలో ఏంపని అని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం, కల్వకుర్తి అభ్యర్థి జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.