Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆడపడుచుల పెద్దన్న కేసీఆర్

-ఉత్సాహపూరిత వాతావరణంలో బతుకమ్మ చీరెల పంపిణీ.. కానుక తీసుకుని మురిసిపోయిన మహిళలు -కోటీ ఆరు లక్షల చీరెలు పంపిణీ చేస్తాం -ఆడబిడ్డలకు గౌరవం.. నేతన్నలకు ఉపాధి -సమయం లేకనే ఇతర ప్రాంతాలకు ఆర్డర్లు -రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ -అన్ని వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు -ఇక నేతన్నలకేనని ప్రకటన -భూ రికార్డుల ప్రక్షాళన విప్లవాత్మక నిర్ణయమని వ్యాఖ్య -తొలి రోజు 10వేల కేంద్రాల్లో -25 లక్షల మందికి చీరెలు -ఉదయం నుంచే బారులు తీరిన మహిళలు -అవసరమైతే 26వతేదీ వరకూ పంపిణీకి సర్కార్ నిర్ణయం

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరెల పంపిణీ సోమవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదటిరోజు ప్రశాంతంగా కొనసాగిన కార్యక్రమంలో పది వేల కేంద్రాల్లో 25 లక్షల చీరెలను మహిళలకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సారెను తీసుకోవడానికి ఉదయం నుంచే మహిళలు పెద్దఎత్తున పంపిణీ కేంద్రాలకు తరలివచ్చి, బారులు తీరారు. తమ వద్దనున్న అధారాలను చూపించి చీరెలు అందుకున్నారు. సంతోషంతో ఇంటికి తిరిగి పయనమయ్యారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని చీరెలను అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, గంభీరావుపేట మండల కేంద్రాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పంపిణీచేశారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడారు. ముస్తాబాద్‌లో ఎల్లవ్వ అనే మహిళకు కేటీఆర్ చీరెను అందించినప్పుడు ఆమె సంతోషం వెలిబుచ్చుతూ.. ఈ చీరెను పుట్టింటి నుంచి వచ్చిన కానుకగా భావిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేదల ఆత్మగౌరవం పెంచేందుకే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం తరఫున ఉచితంగా చీరెలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

అన్ని మతాలు, కులాలు, వర్గాలను తెలంగాణ ప్రభుత్వం ఆదరిస్తుందని అన్నారు. ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి సంబురంగా జరుపుకొనే పండుగ బతుకమ్మ. అలాంటి పండుగకు ఉచితంగా చీరెలను కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలాగా ఆలోచించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటీ ఆరు లక్షల చీరెలను పంపిణీ చేస్తున్నాం అని కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభంనుంచి గట్టెక్కించి, నేత కార్మికులకు చేతినిండా పని కల్పించడం కోసం చీరెల ఆర్డర్లు సిరిసిల్లకు ఇచ్చామన్నారు. సమయం తక్కువ ఉండటంతో సగభాగం సూరత్‌కు ఇచ్చామని, దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. తెల్లరేషన్ కార్డులున్న పేదల కోసం మొదటిసారి చీరెల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. వచ్చే సంవత్సరం చీరెల తయారీతోపాటు ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే అన్ని వస్ర్తాల తయారీ ఆర్డర్లు నూరు శాతం సిరిసిల్ల నేతన్నలకే ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు.

రైతును రాజును చేసే సంకల్పంతో పెట్టుబడి పథకం రైతును రాజు చేయాలన్న సంకల్పంతో వచ్చే ఏడాది నుంచి ఒక్కో పంటకు ఎకరానికి రూ.నాలుగు వేలు ఇవ్వనున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారని మంత్రి కేటీఆర్ చెప్పారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో భారీ వర్షాలకు నీరు చేరి, పంట దిగుబడి నాలుగు రెట్లు పెరిగిందని, 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశామని చెప్పారు. ఒకవైపు పంటకు పెట్టుబడి, మరోవైపు 24 గంటల ఉచిత కరెంటు, రెండు పంటలకు నీరిచ్చేలా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మన వ్యవసాయం ద్వారా దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారుతుందని కేటీఆర్ ఆకాంక్షించారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు గడిచినా భూముల రికార్డు శుద్ధీకరణపై దేశంలో ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక ఆలోచనతో రైతుల ఇంటికే అధికారులు వచ్చేలాచేసి, భూముల సమస్యలు తొలిగించేలా చేశారని పేర్కొన్నారు.

గ్రామాల్లో భూతగాదాల పరిష్కారానికి ప్రజలు కలెక్టర్లు, తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడేవారని, లంచం ఇవ్వనిదే పట్టాదారు పాసుపుస్తకం, పహాణీలో పేరు ఎక్కదన్న అపవాదు రెవెన్యూ ఉద్యోగులపై ఒకప్పుడు ఉండేదని అన్నారు. దానిని తొలిగించి రైతులు, ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు చేపట్టిన రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమని కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌కు రైతులపై ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని చెప్పారు. గొల్లకుర్మల ఉపాధికోసం గొర్రెలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటింటికీ బర్రెలను పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, ఆర్డీవో పాండురంగ, మదన్‌మోహన్, జెడ్పీటీసీలు శరత్‌రావు, పద్మ, తోట ఆగయ్య, ఎంపీపీలు అక్కరాజు శ్రీనివాస్, గంగ సాయవ్వ, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, డైరెక్టర్ విజయరామారావు, బత్తుల తదితరులు పాల్గొన్నారు.

తగిన సదుపాయాల మధ్య చీరెల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా పేద మహిళలకు బతుకమ్మ కానుకగా చీరెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. మొత్తంగా కోటీ నాలుగు లక్షల చీరెలను పంపిణీ చేయనున్నారు. దీంతో ప్రత్యేకంగా విశాలమైన ప్రాంతాలను ఎంపికచేసి కార్యక్రమాన్ని చేపట్టారు. లబ్ధిదారులు ఎక్కువ ఉండటంతో అసౌకర్యం కలగకుండా టెంట్లు వేసి, కుర్చీలు ఏర్పాటుచేశారు. మొదట నిర్ణయించినట్లుగా ఈ నెల 20వరకే కాకుండా పంపిణీలో మిగిలిన లబ్ధిదారులకు చీరెలను అందించడానికి ఈ నెల 26 వరకు కూడా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్లర్లను ఆదేశించింది. పంపిణీ చేసే రోజు స్థానికంగా ఆ కుటుంబ సభ్యులు లేకపోయినా, ఇతరత్రా కారణాలతో చీరెలు తీసుకోవడానికి రాలేకపోయినా వారికి వెసులుబాటు ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. చీరెలను పంపిణీ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా చీరెలను నిలువ చేయడానికి 90 గోడౌన్ పాయింట్లను, 20వేల పంపిణీ కేంద్రాలను ఏర్పాటుచేశారు. తొలి రోజు ఎదురైన చిన్న ఇబ్బందులను సరిచేయాలని స్థానిక అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.