Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అద్భుతఘట్టం ఆవిష్కృతం

-కాళేశ్వరం ప్రపంచానికే ఆదర్శం
-ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ కేసీఆరే
-భూములిచ్చిన రైతులు త్యాగధనులు
-నిర్మాణంలో భాగస్వాములైన హరీశ్‌రావు, అధికారులు, కార్మికులకు అభినందనలు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
-రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులో జలపూజ

ఈ రోజు తెలంగాణలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమయింది. మానవ ఇతిహాసంలో ఎవరూ ఊహించని అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం.. అతి తక్కువ సమయంలో నిర్మాణం పూర్తిచేసుకుని ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. అది కూడా తెలంగాణ ఆవిర్భావంతోనే సాధ్యపడింది అని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఎంతో త్యాగధనులని, వారికి శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ గౌరవాన్ని నలుదిశలా చాటేందుకు కర్త, కర్మ, క్రియ అన్నీతానై ప్రజల కలను సాకారంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టి స్ఫూర్తిప్రదాతగా నిలిచారని కొనియాడారు.

ప్రాజెక్టు నిర్మాణానికి కృషిచేసిన మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇంజినీరింగ్ అధికారులు, రాళ్లు ఎత్తిన కూలీలు, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులో శుక్రవారం ఆయన జలపూజ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రారంభమైనందుకు ప్రజల గుండెల్లో సంతోషం నిండింది. తెలంగాణ కోసం సర్వస్వం అర్పించిన జయశంకర్ సార్ వర్ధంతి రోజున కాళేశ్వరం ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉన్నది. కాళేశ్వరం ద్వారా 13 జిల్లాలకు రెండు పంటలకు పుష్కలంగా నీరిచ్చి బీడు భూములు సస్యశ్యామలం చేస్తాం. హైదరాబాద్‌లోని కోటిమందికి 40 టీఎంసీల నీటిని అందిస్తాం. మరో పదిశాతం నీటిని పరిశ్రమలకు అందించి యువతకు ఉపాధి కల్పించే ఆలోచన చేస్తున్నాం అని పేర్కొన్నారు.

వేలకోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు
తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం అమెరికా, చైనా, యూరప్ దేశాల్లోని ప్రాజెక్టులకన్నా అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును రూ.వేలకోట్ల ప్రజాధనంతో నిర్మించాం. 203 కిలోమీటర్ల పొడవుగల సొరంగ మార్గాల్లో రెండు డబుల్‌డెక్కర్‌లాంటి బస్సులు ఒకేసారి వెళ్లే వెడల్పుతో నిర్మాణాలు చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా 1,531 కిలోమీటర్ల పొడవుగల కాలువల నిర్మాణం పూర్తికావొచ్చింది. రూ.కోట్ల విలువచేసే రైతుల భూములు నష్టపోవద్దని 300 మీటర్ల లోతు లో పంపుహౌస్‌లను నిర్మించాం. అభివృద్ధిలో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలుపుతాం. అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టుపై కొందరుచేస్తున్న విమర్శలు వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నాను అని కేటీఆర్ అన్నారు

కేంద్ర ప్రభుత్వానికీ రైతుబంధు స్ఫూర్తి
రైతుల కష్టసుఖాలు తెలిసిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌ను మించిన వారెవరూ దేశంలో లేరన్నది నా అభిప్రాయం. రైతుబంధు పథకం అమలుచేసి ఎకరాకు రూ. ఐదు వేలు ఇస్తే, దానిని స్ఫూర్తిగా తీసుకున్న కేంద్రం కిసాన్ సమ్మాన్ పేరిట పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులకు బీమా పథకం ప్రవేశపెట్టి రూ.5 లక్షల పాలసీ చేయించాం. నేటివరకు 12,140 రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించాం. వచ్చే దసరావరకు కాళేశ్వరం ఎత్తిపోతలతో మానేరు ప్రాజెక్టును నింపి గోదావరి జలాలతో మెట్టప్రాంతాన్ని అభిషేకించి రైతుల కాళ్లు కడుగుతాను. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం.

వచ్చేనెల నుంచి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, గీత, నేత కార్మికులందరికీ డబుల్ ఆసరా పింఛన్లు అందిస్తాం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్‌బాషా, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, చెన్నూరు, వేములవాడ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.