Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆనంద ఘడియలు.. కల్వకుర్తి పరుగులు

పాలమూరు జిల్లా ప్రజల దశాబ్దాల కల నేరవేరింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2,3 లిఫ్టులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి కేవలం రేండేండ్లలోనే పూర్తయింది. రైతుల ముఖాల్లో చిరునవ్వు నింపింది. కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం లక్ష, మరో మూడు నెలల్లో మరో రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీటితో పాటు తాగు నీరు అందుతుంది.

harish-rao-luanched-the-kalwakurty-lift-irrigation-project-2and3

కల్వకుర్తి కాలువలో గతంలో మాటలు పారినయి: హరీష్‌రావు మహబూబ్‌నగర్: గత పాలకుల హయంలో జిల్లా ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగిందిన మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కాంగ్రెస్,టీడీపీ నేతలు మాటలకు మాత్రమే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఇవాళ ఆయన జొన్నలబొగడ వద్ద కల్వకుర్తి-2, 3 లిఫ్టు ఇరిగేషన్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఇంతకు ముందు కల్వకుర్తి కాలువలో మాటలు మాత్రమే పారాయని ఎద్దేవా చేశారు. ఇవాళ అదే కల్వకుర్తి కాలువలో సాగునీరు పారుతోందని వివరించారు. ఇదంతా సీఎం కేసీఆర్ చలవ వల్ల సాధ్యమైందన్నారు. ఇవాళ లక్షా 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. కల్వకుర్తికి 1970 ఒకసారి, 1999లో మరోసారి కొబ్బరి కాయలు కొట్టి దులిపేసుకున్నారని ధ్వజమెత్తారు. శిలఫలకాలు వేసి చేతులు దులిపేసుకున్నారని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో చేసింది శూన్యమన్నారు. కల్వకుర్తి గురించి లక్ష కోట్ల మాటలు మాట్లాడారు కానీ ఒక్కపైసా కేటాయించలేదని విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్ పాలకులు చేసిందేంటంటే కేవలం కొబ్బరికాయ కొట్టడమేనని స్పష్టం చేశారు.

ఓ సారి చంద్రబాబు కొబ్బరికాయ కొట్టిపోతే చంద్రబాబు పక్కన పెట్టాడని, చంద్రబాబు కొబ్బరికాయ కొట్టిపెడితే వైఎస్‌ఆర్ పక్కన బెట్టారని దుయ్యబట్టారు. టీడీపీ రూ.12 కోట్లు ఖర్చు పెట్టి రెండు కొబ్బరి కాయలు కొట్టిందని తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి వచ్చి కల్వకుర్తి దగ్గర మరో కొబ్బరికాయ కొట్టాడని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి పనులు 70 శాతం పూర్తయ్యాయయని, మరో 30 శాతం పనులు ఇంకా జరగాల్సి ఉందన్నారు. తొమ్మిది నెలల్లో మిగతా పనులు కూడా చేసి తీరుతామన్నారు.

కాంగ్రెస్ పాలకులు ఎందుకు నిలదీయలేదు? కల్వకుర్తిని పక్కనబెట్టి హంద్రీనీవాను తీసుకెళ్లే కాంగ్రెస్ నేతలు ఎవరూ నిలదీయలేదని విమర్శించారు. హద్రీనావాకు హారతులు పట్టిన ఘనత కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలకే దక్కుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల మాటలకు చేతలకు పొంతనేలేదన్నారు. ఆనాడే అడిగి నిలదీసి ఉంటే ఇవాళ పాలమూరు ప్రజలకు ఈ గతి పట్టేదా? అని ప్రశ్నించారు. టీ టీడీపీ నేతలు కూడా చంద్రబాబు ఎజెండా మోస్తున్నారని విమర్శించారు. ఇవాళ కల్వకుర్తి పనులు అయ్యాయంటే అవన్నీ సీఎం కేసీఆర్ వచ్చాకే జరిగాయని వెల్లడించారు. ఇవాళ కరువు కాలంలో కూడా కాలువల్లో నీరు పారుతోందని తెలిపారు. కల్వకుర్తి పనులు పూర్తి చేయడానికి ఇంజినీర్ల మీద ఎంతో ఒత్తిడి తెచ్చామని తెలిపారు. వారు కూడా అందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి 6 లక్షల ఎకరాలకు సాగునీరి అందిస్తామన్నారు.

టీ టీడీపీకి తెలంగాణలో కొనసాగే హక్కులేదు పాలమూరు ఎత్తిపోతలను ఆపాలని ప్రయత్నించిన టీడీపీకి తెలంగాణలో ఉండే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. నాగర్ కర్నూలు వాసులు నాగర్ కర్నూల్ జిల్లా కావాలని కోరుకుంటు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎంత సేపు కేసులు వేయడం అడ్డుకోవడమే తప్ప టీ టీడీపీ నేతలకు తెలంగాణ అభివృద్ధి గురించి పట్టింపులేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతోపాటు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

నానా తిప్పలు పడిన తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరులోని నిర్మాణంలోనున్న ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వందల పర్యాయాలు వీటిపై సమీక్షలు నిర్వహించి, ఇంజినీర్ల వెంటపడ్డారు. నిధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2016-17 సంవత్సర బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.336 కోట్లు కేటాయించింది. ఐదు నెలల్లోనే ఈ ప్రాజెక్టుపై 243.43 కోట్లు ఖర్చు చేసింది. మరో 119.27 కోట్ల బిల్లులు చెల్లింపునకు సిద్ధంగా ఉన్నాయంటే.. ఎంత యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారో అర్థమవుతుంది.

తొలి దశగా లక్షన్నర ఎకరాలకు సాగునీరు కల్వకుర్తి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జొన్నలబొగుడ (లిఫ్టు-2), గుడిపల్లిగట్టు (లిఫ్టు-3) ద్వారా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం సాగునీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రెండు దశల్లోనూ ఒక్కో మోటారు ద్వారా నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం ట్రయల్న్‌ల్రో రెండో లిఫ్టులో డిజైన్‌పరంగా 800 క్యూసెక్కుల డిశ్చార్జి ఉండగా… 850 క్యూసెక్కుల వరకు డిశ్చార్జి ఉంది. అదేవిధంగా లిఫ్టు-3లో మోటారు డిజైన్ డిశ్చార్జి 650 క్యూసెక్కులు ఉండగా… 700 క్యూసెక్కులకు పైగా డిశ్చార్జి ఉంది. మూడో లిఫ్టులో రెండు మోటారును సెప్టెంబరు-అక్టోబరులో పూర్తి చేస్తామన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి ఎం శ్యాంప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.