Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అందరికీ సంక్షేమం

-టార్చిలైట్‌ పెట్టి వెతికినా వివక్షకు తావులేదు
-కల్యాణలక్ష్మి ఏ కులానికి ఇచ్చాం
-కేసీఆర్‌ కిట్టు ఏ మతానికి ఇచ్చాం
-రైతుబంధులో చిన్నాపెద్దా ఉన్నారా?
-ఎల్బీస్టేడియం జీహెచ్‌ఎంసీ ఎన్నికల బహిరంగసభలో సీఎం కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరినీ ఆదుకొన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. శాంతిభద్రతల్లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదన్నారు. టార్చిలైట్‌ పెట్టి వెతికినా వివక్షకు చోటులేకుండా చేశామని ఉద్ఘాటించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

అన్ని కులాలకు, మతాలకు అతీతం
టీఆర్‌ఎస్‌ ఏ సంక్షేమం చేపట్టినా, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రాంతం, జాతి, కులం, మతం అనే తేడా ఉండదు. కంటివెలుగు.. ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ఆచరణ చేయని కార్యక్రమం. ప్రతిఇంటికీ, ప్రతి కంటికీ పరీక్షలు నిర్వహించి దాదాపు 50 నుంచి 60 లక్షల మంది పేదలకు అద్దాలు, మందులు, వైద్య సదుపాయాలు కల్పించిన విషయం మీ అందరికీ తెలిసిందే. కల్యాణలక్ష్మి ఇది ఏ కులానికి? ఏ మతానికి? ఇది పొందనివారున్నరా.. ఇలాంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో అయినా ఉన్నదా? ఇదీ టీఆర్‌ఎస్‌ సంక్షేమం. కేసీఆర్‌ కిట్టు ఇది ఏ కులానిది? ఇది ఏ మతానిది? నిరుపేద మహిళలు ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీకి గురవుతుంటే.. అనవసరమైన అడ్డమైన సిజేరియన్‌ ఆపరేషన్లు చేసి వారి ఆరోగ్యాలు చెడగొడుతుంటే, మంచిది కాదని బాధపడి కేసీఆర్‌ కిట్టు అనే పథకాన్ని ప్రారంభించాం. కేసీఆర్‌ కిట్టు.. సూపర్‌హిట్‌ పథకమని మీ అందరికీ తెలుసు. రైతుబంధు ఈ దేశంలో ఎక్కడైనా ఉందా. ఏ ప్రభుత్వమన్న ఇస్తదా? దీంట్లో కూడా కులం, ప్రాంతం, మతం ఏదైనా ఉన్నదా. చిన్నా పెద్దా తేడా ఉన్నదా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతుకు ఠంచనుగా రూ. 10 వేలు ప్రతి ఎకరానికి ఇచ్చే ఏకైక ప్రభు త్వం ఇండియాలో తెలంగాణ ప్రభుత్వం. ఇది మీ కండ్ల ముందు లేదా? రైతు బీమా.. ఏ రైతు చనిపోయినా ఎల్‌ఐసీ ద్వారా బాజాప్తాగా రూ.5 లక్షలు వారంలోపట వారి కుటుంబం ఖాతాలో పడేలా చేశాం.

కులవృత్తులను ఆదుకొన్నాం
కులవృత్తుల వారందరినీ ఆదుకొన్నాం.. నేత కార్మికుల కోసం ప్రయత్నాలుచేశాం. గీత కార్మికులకోసం కల్లు దుకాణాలు తెరిపించినం. మత్స్య పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. గొర్రెల పంపకంచేస్తున్నాం.. ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలు ఇచ్చే బాధ్యత నాది. రజకులు దోబీ ఘాట్లకు, లాండ్రీలకు కరెంటుకావాలని అడిగినారు. దోబీ ఘాట్ల బోరు మోటర్లకు, లాండ్రీలకు కరెంటు బిల్లు కట్టే అవసరంలేదు. నాయీబ్రాహ్మణ సోదరుల సెలూన్లకు ఉచిత కరెంట్‌ సరఫరాచేయాలని నిర్ణయించాం. ఎంబీసీలకు కార్పొరేషన్‌ పెట్టినం. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం వెయ్యి గురుకులాలు ప్రారంభించినం. ఇండియాలో ఎక్కడ కూడా లేవు.

రూ.52 వేల కోట్ల నష్టం వచ్చినా
కరోనా వ్యాధి వచ్చింది. ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. రాష్ర్టానికి రూ.52 వేల కోట్ల నష్టం వచ్చింది. అయినా సంక్షేమం ఆపలే. పేదలకు ఇంకా పెంచినం. సంక్షేమ కార్యక్రమాల్లో మనకు ఎవరూ సాటిలేరు. ఏటా రూ 40 వేల కోట్ల పైచిలుకు కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండంగా కంప్లీట్‌ చేస్తా ఉన్నాం.

రూ.70 వేల కోట్లు ఖర్చు పెట్టి కష్టపడినం
వ్యవసాయం బాగలేక చెడిపోయి లక్షల మంది బతకడానికి వచ్చి నగరం పలువైపులా విస్తరించింది. బస్తీలు, వాడలు, కాలనీలు వెలిసినయ్‌. కానీ సరైన సదుపాయా లు లేవు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లేదు. విశ్వప్రయత్నం చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీ. దాదాపు రూ.70 వేల కోట్లు ఖర్చు పెట్టి శ్రమపడ్డది. ఎంతవరకు తండ్లాడాల్నో తండ్లాడింది. ఇం కా కూడా చేయాల్సిన అవసరమున్నది.

వివక్ష లేదు
హైదరాబాద్‌లో కానీ, రాష్ట్రంలో కానీ కుల, మత, జాతి, ప్రాంత వివక్ష లేకుండా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఈ ఆరేండ్లలో ఎటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించిందో.. మీరు ఆలోచించాలి. తెలంగాణ గడ్డమీద ఉన్న ప్రతిబిడ్డ మా బిడ్డే.. భారతదేశంలోని ఏ మూల నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా.. హైదరాబాద్‌లో ఉన్న ప్రతిబిడ్డా.. మా బిడ్డే అని.. వారి సంరక్షణ, శాంతిభద్రతలు మా బాధ్యత అని నేను ధైర్యంగా చెప్పాను. గత ఏడేండ్లలో అదే పద్ధతిలో పాలన చేశాం. టార్చిలైట్‌ పెట్టి వెతికినా ఏరకమైన వివక్ష లేకుండా చేశాం. ఏడేండ్ల పాలనలో ఎవరూ ఊహించని అద్భుత విజయాలు సాధించాం. భారత దేశ తలసరి విద్యుత్‌ వినియోగంలో 29 రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్‌వన్‌ అని నేను గర్వంగా ప్రకటిస్తున్నా. ఇది నా లెక్కకాదు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు. వట్టి మాటలతోనే ఇదంతా జరగలేదు.. దీని వెనుక ఎంత కృషి ఉన్నదో మీరంతా గమనించాలని నేను కోరుతున్నా.

దేశంలో నంబర్‌వన్‌
ప్రాజెక్టులు అన్నీ పూర్తిచేశాం. లక్షల ఎకరాలతో తెలంగాణ ఇండియాలో నంబర్‌వన్‌కు పోతుంది. ప్రస్తుతం నంబరు -2 పొజిషన్‌కు వచ్చినం. కొద్దిరోజుల్లోనే నంబర్‌-1కు పోతాం. ప్రభుత్వ వైఖరి ఏంది.. ప్రభుత్వ లక్షణం ఏంది. ఎవరికోసం తపన పడుతా ఉన్నది. ఎప్పుడైనా ఎన్నికల్లో ఓటు వేసేముందు అలవోకగా, గాలివాటంగా ఓటు వేయకూడదు. ఇవన్నీ ఆలోచించాలనే మీ ముందు నేను పెట్టినా..

బస్తీ దవాఖానలు ఎప్పుడైన కలగన్నమా?
బస్తీ దవాఖాన గురించి ఎప్పుడన్న కలగన్నమా.. ఊహించినమా.. మా హెల్త్‌ మినిస్టర్‌ రాజేందర్‌ ఆధ్వర్యంలో పురపాలక మంత్రి కేటీఆర్‌, నగర మంత్రులు అంతా కలిసి 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినారు. ఏ బస్తీకి ఆ బస్తీలోనే ఇవాళ మందులు అందుతున్నాయి. హైదరాబాద్‌ చరిత్రలో ఎవరూ ఇది చేయలే.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.