– విద్యుత్ సమస్యకు టీడీపీ, కాంగ్రెస్‌లే కారణం: బాల్కసుమన్

రాష్ట్రంలో ఆంధ్రా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని వారి ఆటలు సాగనీయబోమని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన టీఆర్‌ఎస్‌వీ, టీఆర్‌ఎస్‌యూ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసగించారు.
తెలంగాణలో విద్యుత్ సమస్యకు కారణం టీడీపీ, కాంగ్రెస్‌లేనని ఈ విషయాన్ని మరిచిపోయి కొందరు నేతలు మాట్లాడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌వీ గ్రేటర్ అధ్యక్షుడు బాబా ఫసీయుద్దీన్ మాట్లాడుతూ.. ఈ నెల 19న జరగనున్న ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేందుకు విద్యార్థి విభాగం వలంటీర్లుగా పనిచేస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీలు రాములు నాయక్, వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్ నేత రాకేష్, విద్యార్థి నాయకులు వినీత్, విజయరామ్‌రెడ్డి, జగన్మోహన్‌రావు, కిరణ్ పాల్గొన్నారు.