తెలంగాణ ఆత్మాభిమాన్ని ఆంధ్రాబాబు వద్ద చీమూనెత్తురు లేకుండా తాకట్టుపెట్టిన టీడీపీ నేతలకు, ఆ పార్టీ మద్దతులో పోటీచేస్తున్న బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కులేదు. విజయవాడలో మీటింగ్ పెట్టి చంద్రబాబు డైరెక్షన్ చేస్తే తెలంగాణలో యాక్షన్ చేస్తున్న టీడీపీ నేతలకు, ఆ పార్టీ మద్దతుతో తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీకి వరంగల్ ప్రజలు సరైన బుద్ధి చెప్పబోతున్నారు. తండ్రి వైఎస్ అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడ్డ కొడుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారుఅని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వరంగల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు అందరి కంటే ఎక్కువ ద్రోహం చేసింది వైఎస్సేన న్నారు. బయ్యారం ఐరన్‌ఓర్ గనులను వైఎస్ రక్షణ స్టీల్స్‌కు ధారాదత్తం చేస్తే..అసెంబ్లీలో, కోర్టులో బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కని టీఆర్‌ఎస్ కొట్లాడి సాధించుకున్నదని గుర్తుచేశారు. వైసీపీ తాడుబొంగురం లేని పార్టీ అని, తెలంగాణలో దిక్కూదివానంలేదని ఎద్దేవాచేశారు. -విజయవాడ డైరెక్షన్‌లో తెలంగాణ టీడీపీ -తాడుబొంగురం లేని పార్టీ వైసీపీ -బీజేపీ మోసం చేసింది..నిజం కాదా దత్తన్నా? -విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు ఫైర్ -విపక్షాలవి పిచ్చికూతలు: మంత్రి కేటీఆర్ -దయాకర్‌కు భారీ మెజార్టీ: మంత్రి ఈటల -రానున్నది రైతు రాజ్యమే: మంత్రి పోచారం -ప్రతిపక్షాలది గోబెల్స్ ప్రచారం: మంత్రి జగదీశ్‌రెడ్డి -బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ కాంగ్రెస్ పదేండ్లు పాలించి తెలంగాణను యాభై ఏండ్లు వెనక్కి నెట్టిన చరిత్ర నిజం కాదా అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్కరూపాయి ఇవ్వనని, ఏంచేసుకుంటావో చేసుకోవాలన్న మాజీ సీఎం కిరణ్ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న ఉత్తమ్..అప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సారయ్య తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పత్తికి మద్దతు ధర పెంచుతామని హామీ ఇచ్చి మోసం చేశారని, ఇపుపడు ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి దత్తాత్రేయకు కోపం వస్తున్నదన్నారు. 24 లక్షల మంది పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని సీసీఐ చైర్మన్ మిశ్రా చెప్తుంటే, గుర్తింపు కార్డులు ఇవ్వడంలేదని దత్తాత్రేయ అనడం సరికాదన్నారు. ఉప ఎన్నికలో ఓట్ల కోసం బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ దిగజారి మాట్లాడుతున్నాయని.. చైతన్యానికి మారుపేరైన వరంగల్ ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ సుమన్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బిజాల గణేశ్‌గుప్తా పాల్గొన్నారు.

ఇంటింటికీ తాగునీరిస్తాం: మంత్రి కేటీఆర్ 60 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది స్వరాష్ట్రంలో 16 నెలల్లోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 99శాతం నెరవేర్చిందిఅని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టీ రాజయ్య, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రచారంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు పిచ్చికూతలు కూస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే మూడేండ్లలో రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీటిని ఇవ్వకపోతే మళ్లీ ఎన్నికల్లో ఓటు అడగమని ధైర్యంగా ప్రజలకు ముందే చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

బలహీనవర్గాల అభివృద్ధికి కృషి: మంత్రి ఈటల ప్రభుత్వం పేద,బడుగుబలహీన వర్గాల సంక్షేమమే ధ్యే యంగా పనిచేస్తున్నదని, శ్రమజీవులైన గీత కార్మికులకు అండగా ఉంటున్నదని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పరకాలలో గీత కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గీత కార్మికులకు వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నామని, ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్‌గ్రేషియాను రూ.రెండు నుంచి రూ.ఐదు లక్షలకు పెంచామని తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

నిరుపేదకు, ధనవంతులకు మధ్యఎన్నికలు: మంత్రి పోచారం రాష్ట్రంలో రానున్నది రైతు రాజ్యమేనని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రేగొండ మండలంలో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఉప ఎన్నిక నిరుపేదకు, ధనవంతులకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. పోరాటంలో చివరికి ధర్మమే గెలుస్తుందన్నారు.
ప్రతిపక్షాలవి అర్థంలేని విమర్శలు: మంత్రి జగదీశ్‌రెడ్డి అబద్ధాన్ని వందసార్లు పలికితే నిజమవుతుందని భావిస్తున్న ప్రతిపక్ష నాయకులు.. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. తొర్రూరులో మాజీ ఎమ్మెల్యే ఎన్ సుధాకర్‌రావుతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ నిధులు, నీళ్లను దోచుకున్నారని, ఆ పాపాలను కడిగేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. 60 ఏండ్లలో రోడ్ల అభివృద్ధికి ఎన్ని నిధులైతే వెచ్చించారో 17 నెలల్లో అన్ని నిధులు కేటాయించినట్లు వివరించారు.
ఎస్సీ వర్గీకరణపై బీజేపీని నిలదీయండి: ఎంపీ సుమన్ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఓసొల్లు సైకో. ఓటుకు నోటు కేసులో జైల్లో చిప్పకూడు తిని మతిస్థిమితం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎర్రగడ్డ మెంటల్ దవాఖానలో ఉండాల్సినోడు బయట తిరుగుతూ సొల్లు సైకోలా తయారైండు. పెద్దవాళ్లను తిడితే పెద్దోడిని కావచ్చనే ఆశతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటీ నిజం లేదు. బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్. రేవంత్‌రెడ్డి. కాంట్రాక్టర్లు, వ్యాపారులను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజిన నీచుడు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్న రేవంత్ వైఖరి మార్చుకోకుంటే నాలుకకోసి కాకతీయ కళాతోరణానికి కడతాం అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. బుధవారం వరంగల్‌లో టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

ఎస్సీ వర్గీకరణకు టీఆర్‌ఎస్ కట్టుబడి ఉన్నదని, ఇప్పటికే అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపిందన్నారు. కడియం శ్రీహరి ఎంపీగా ఉన్నప్పుడే ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిలదీయాల్సింది ప్రచారంలో స్వేచ్ఛగా తిరుగుతున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలనే కానీ, టీఆర్‌ఎస్‌ను కాదన్నారు. మంద కృష్ణకు దమ్ముంటే బీజేపీతో బిల్లు పెట్టించాలని, టీఆర్‌ఎస్ మద్దతిస్తుందన్నారు. జాతీయ పార్టీలను వదిలేసి టీఆర్‌ఎస్‌ను అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆశ వర్కర్ల డిమాండ్ కేంద్రానికి సంబంధించినదన్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని నేతృత్వంలో సీఐటీయూ తెలంగాణలోనే పోరాటం చేసి, ఏపీ లో మౌనంగా ఉండడం వెనక కుట్ర ఏమిటని నిలదీశారు.
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీలు రాష్ట్ర సమస్యలపై ఏనాడు పార్లమెంట్‌లో మాట్లాడలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలను ఏ ప్ర భుత్వం చేపట్టలేదన్నారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం దిమ్మతిరుగుతుందని, విపక్షాలకు గుణపాఠం అవుతుందన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రజాసేవతోనే నాయకులు ఉన్నతంగా రాణిస్తారని, కానీ కొందరు దిగజారుడు రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడినా టీడీపీ నాయకులు ఆంధ్రా నేతల మోచేతి నీళ్లుతాగి వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రి జోగు రామన్న, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన ఎమ్మెల్యే అరూరి రమేశ్, అభ్యర్థి దయాకర్ పాల్గొన్నారు.