Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అన్నదాతా సుఖీభవ!

-రాష్ట్ర బడ్జెట్ 1.74 లక్షల కోట్లు -భారీ పద్దును సమర్పించిన ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ -మొత్తం బడ్జెట్ : రూ.1,74,453.84 కోట్లు -ప్రగతి పద్దు : రూ.1,04,757.90 కోట్లు -నిర్వహణ పద్దు : రూ.69,695.94 కోట్లు -2017-18లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 14.1% -జాతీయ సగటు వృద్ధిరేటు 9.5% కంటే అధికం -సామాజిక సేవారంగాలకు రూ.45 వేల కోట్లు -ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికే -రూ.35 వేల కోట్లు కొన్ని కీలక శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి -ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ: రూ.12,708.73 కోట్లు -గిరిజన సంక్షేమశాఖ: రూ.8,063.48 కోట్లు -వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ: రూ.7,375.20 కోట్లు -పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ: రూ.7,250.56 కోట్లు -హోంశాఖ: రూ.5,790.35 కోట్లు -రోడ్లు, భవనాలశాఖ: రూ.5,575.23 కోట్లు -విద్యుత్‌శాఖ: రూ.4,393.50 కోట్లు -ఉన్నతవిద్యాశాఖ: రూ.2,447.88 కోట్లు -మహిళా, శిశు, వికలాంగులు, -వయోవృద్ధుల సంక్షేమ శాఖ: రూ.1,798.82 కోట్లు -ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొన్ని పథకాలకు కేటాయింపులు -ఆసరా పింఛన్లు : రూ.5,366.89 కోట్లు -విద్యుత్ సబ్సిడీ : రూ.4,984.30 కోట్లు -ఉపకారవేతనాలు : రూ.3,282.24 కోట్లు -కల్యాణలక్ష్మి, షాదీముబారక్ : రూ.1,450.46 కోట్లు -కేసీఆర్ కిట్స్ పథకం : రూ.560.50 కోట్లు

అన్నదాతా.. సుఖీభవ.. అంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు, రైతుకు అవసరమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పెద్ద మొత్తంలో కేటాయింపులు చేశారు. సంక్షేమరంగానికి రూ.45,479.57 కోట్లు ప్రతిపాదించగా, వ్యవసాయ అనుబంధరంగాలు, గ్రామీణాభివృద్ధికి రూ.20, 820.08 కోట్లు, సాగునీటిరంగానికి రూ.25వేల కోట్లు కేటాయించారు. గతేడాది 2017-18 బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సుమారు రూ.13,640 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.7,179 కోట్లు పెంచడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పంట పెట్టుబడి పథకం అమలుకోసం ఏకంగా రూ.12వేల కోట్లను, తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విప్లవాత్మక నిర్ణయం రైతు బీమా అమలు కోసం రూ.500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించడం గమనార్హం. పేదల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సంక్షేమ రంగానికి రూ.45వేల కోట్లపైనే కేటాయించగా, ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి రూ.35వేల కోట్లపైనే కేటాయించింది. మొత్తంగా ఈ వర్గాలకు రూ.5,200 కోట్లకుపైగా కేటాయింపులు పెరుగడం గమనార్హం. ఆరోగ్యరంగానికీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన ఆర్థికమంత్రి.. ఈసారి బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు రూ.7,375.20 కోట్లు కేటాయించారు.

ఇది గతంతో పోల్చితే రూ.1,579.03 కోట్లు అదనం. ఇందులో ఆరోగ్యశ్రీకి రూ.699.44 కోట్లు, కేసీఆర్ కిట్ల పథకానికి రూ.560.50 కోట్లు, ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి పౌరునికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ తయారుచేసేందుకు, అన్ని గ్రామాల్లో ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించి, కంటి అద్దాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఆరోగ్యరంగానికి కేటాయింపులు పెరిగాయి. నిరుపేదలకోసం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకానికి ఈ బడ్జెట్‌లో రూ. 2,795.15 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.1898.39 కోట్లను డబుల్ బెడ్‌రూం నిర్మాణాలకు కేటాయించగా, ఈసారి సుమారు 900 కోట్ల మేరకు అదనంగా కేటాయించనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, మత్స్య, పట్టుపరిశ్రమలకు రూ.1126 కోట్లను కేటాయించారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి 582 కోట్లు పెరుగడం విశేషం.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1,74,453.84 కోట్లతో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ.1,25,456.70 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.33,369.10 కోట్లుగా ఉంది. ఇది మొత్తం వ్యయంలో 19 శాతంగా ఉంది. రూ.1,04,757 కోట్లను ప్రగతిపద్దు (స్కీమ్ ఎక్స్‌పెండిచర్) కింద ప్రతిపాదించారు. నిర్వహణ పద్దు రూ.69,695.94 కోట్లుగా చూపారు. రాష్ట్రంలో ఏ ఏటికాయేడు రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి. రెవెన్యూ ఖర్చులకంటే రాబడులు ఎక్కువగా ఉండటంతో వరుసగా నాలుగోసారి రాష్ట్ర బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు కనిపించింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2014-15 సంవత్సరం పదినెలల కాలానికి తొలి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2015-16 నుంచి రెవెన్యూ ఖర్చులను అధిగమించి రెవెన్యూ రాబడులను ఎక్కువ మొత్తంలో సాధించి వరుసగా మిగులు రాష్ట్రంగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ మిగులు రూ.5,520.41 కోట్లుగా ఉండవచ్చని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తన బడ్జెట్ ప్రతిపాదనల్లో అంచనావేశారు. ఈ ఏప్రిల్ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి వరకు రెవెన్యూ రాబడులు రూ.1,30,975.11 కోట్లు, రెవెన్యూ ఖర్చులు రూ.1,25,454.70 కోట్లుగా అంచనావేశారు. వెరసి, రూ.5,520 కోట్లు మిగులు ఉంటుందని అంచనావేశారు. గత వార్షిక బడ్జెట్లను గమనిస్తే 2015-16లో మిగులు రూ.238 కోట్లుగా ఉంది. 2016-17 వాస్తవ బడ్జెట్‌లో రూ.1,385.76 కోట్లు, 2017-18లో సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.1,545.39 కోట్లు మిగులు ఉంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.