Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అన్నింటా మార్గదర్శకమే

నీరు బతుకడానికే కాదు, దేశ పురోగాభివృద్ధి కూడా నీటిపైనే ఆధారపడి ఉన్నది. ప్రపంచదేశాలన్నీ నీటితోనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని గుర్తించి లక్షల కోట్లు ఖర్చు పెట్టి నీటి వనరులను సంరక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉడుంపట్టుతో చేసిన పనుల ఫలితం ఇప్పుడు అందరికీ కానవస్తున్నది. రాష్ట్రంలో పచ్చటి పొలాలతో కళకళలాడుతున్న గ్రామాలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.

తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా రీ డిజైన్‌ చేస్తే ఓర్వలేని ప్రతిపక్షాలు రీ డిజైన్‌ వల్ల వ్యయం పెరిగిందని అసత్య ప్రచారాలకు ఒడిగట్టాయి. అసలు ప్రపంచదేశాలు తమ దేశాల్లో నీళ్ల కోసం ఖర్చుపెడుతున్న వివరాలను మనం బేరీజు వేసుకుంటే వాస్తవ పరిస్థితి స్పష్టమవుతుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావ డంతో ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నమ్మకం బలపడింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక సామాజిక, ఆర్థిక మార్పు స్పష్టంగా కనిపించ బోతున్నది. పంటల దిగుబడులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరుగుతున్నాయి. కలలుగన్న బంగారు తెలంగాణను కండ్లారా చూసే అవకాశం రాబోతున్నదన్న నమ్మకాన్ని ప్రజల్లో కేసీఆర్‌ ఇప్పటికే కలిగించారు. తెలంగాణను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది.

తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాజె క్టును రీ డిజైన్‌ చేస్తే ఓర్వలేని ప్రతిపక్షాలు రీ డిజైన్‌ వల్ల వ్యయం పెరిగిందని అసత్య ప్రచారాలకు ఒడిగట్టాయి. అసలు ప్రపంచదేశాలు తమ దేశాల్లో నీళ్ల కోసం ఖర్చు పెడుతున్న వివరాలను మనం బేరీజు వేసుకుంటే వాస్తవ పరిస్థితి స్పష్టమవుతుంది. కాళేశ్వరానికి అయిన ఖర్చు, కాబోయే ఖర్చు చాలా తక్కువ. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని అందించే ప్రాజెక్టు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ర్టానికి చెందిన డీశాలినేషన్‌ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, ఏటా అయ్యే ఖర్చులను పరిశీలిస్తే వాస్తవాలు బోధపడుతాయి. సుమా రు రెండు కోట్ల యాభై లక్షల దేశ జనాభా ఉన్న ఆస్ట్రేలియాలో విక్టోరియా రాష్ట్ర జనాభా సుమారు 63 లక్షలు. అరకోటి జనాభా ఉన్న మెల్‌బోర్న్‌ ప్రజల అవసరాల కోసం ఏర్పాటుచేసిన డీశాలినేషన్‌ ప్లాంట్‌ వ్యయాన్ని, సుమారుగా నాలుగు కోట్ల ప్రజల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజె క్టుతో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన, చేయబోతున్న ఖర్చు అత్యల్పమని భావించవచ్చు.

దక్షిణ విక్టోరియా బాస్‌ తీరంలోని డాలీస్టన్‌లో విక్టోరియన్‌ డీశాలినేషన్‌ ప్లాంట్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్టును జూన్‌ 2007లో ప్రకటించిన స్థానిక ప్రభుత్వం 2012లో పూర్తిచేసింది. వర్షాలు లేక మెల్‌బోర్న్‌ నీటి నిల్వలు 2005 జనవరిలో 57.1 శాతం సామర్థ్యం నుంచి 2007 జూన్‌లో 28.7 శాతానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు నీటి నిల్వలు పెంచడానికి, కరువును ఎదుర్కోవడానికి శాశ్వత పరిష్కారంగా ఈ ప్లాంట్‌ను సంకల్పించారు. ప్రాథమిక అధ్యయనంలో ఈ ప్రాజెక్టు మూలధన వ్యయం మొదట 2.9 బిలియన్‌ డాలర్లుగా (290 కోట్ల డాలర్లుగా) అంచనా వేశారు. తర్వాత 3.1 బిలియనకు మళ్లీ 3.5 బిలియన్లకు ఆ తర్వాత 400 కోట్ల డాలర్లకు సవరించారు. అంటే వ్యయం అంచనా వేసిన కొన్ని నెలల్లోనే డిజైన్‌లో ఎలాంటి మార్పు లేనప్పటికీ సుమారుగా 35 శాతం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే డీశాలినేషన్‌ ప్లాంట్‌ చాలా చిన్నది కానీ వ్యయం, నిర్మాణ ఖర్చులు కాళేశ్వరంతో పోల్చితే చాలా అధికం. ఇదొక్క ఆస్ట్రేలియాలోని ఒక రాష్ర్టానికి చెందిన ప్లాంట్‌ మాత్రమే. ఇలాంటివే ప్రపంచంలో చాలా ప్లాంట్లు అత్యధిక వ్యయంతో నిర్మించి, నిర్వహిస్తున్నారు. ఎందుకంటే తమ దేశ ఆర్థికాభివృద్ధి నీటితో ముడిపడినదిగా భావిస్తారు. ఈ ఖర్చుకు ఆదాయ వ్యయాల లెక్కలు ఆలోచించకుండా నీటి ప్రాజెక్టులను సిరులు కురిపించే వనరుగా ప్రభుత్వాలు పరిగణిస్తాయి.

రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును 2016లో ప్రారంభించి 2019లో రికార్డు సమయంలో పూర్తి చేయడమనేది దేశ ప్రజలను, జాతీయ నాయకులకు విస్మయానికి గురిచేసింది. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతటి నిబద్ధతతో కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారం లేకుండా కొత్త రాష్ట్రం ఈ ప్రాజెక్టును పూర్తిచేయడమనేదే అద్భుతం. 75 ఏండ్లలో ఏ చిన్న ప్రాజెక్టు కూడా ఇలా పూర్తిచేసిన దాఖలాల్లేవు. దీనికి ప్రధాని నరేంద్రమోదీ కూడా అతీతుడు కాదు. ఎందుకంటే ఉత్తర మధ్య భారతదేశంలో కర్ణావతి నదిపై ఒక ఆనకట్ట నిర్మించి 227 కిలోమీటర్ల మేర కాలువతో కర్ణావతి నదిని బేత్వా నదితో అనుసంధానం చేయాలనుకున్నారు. యమునా నదికి ఉపనదులైన ఈ రెండు నదుల అనుసంధాన ప్రాజెక్టు లాంటి బృహత్తర ప్రణాళికలు మోదీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నదుల అనుసంధానం ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నది. ఆ రోజుల్లో రాజీవ్‌గాంధీ రూ.462 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన గంగానదీ జలశుద్ధి ప్రాజెక్టు సంగతీ అంతే. మోదీ 2014 ఫిబ్రవరి నాటికే రూ.939 కోట్ల నిధులు ఖర్చు చేసినప్పటికీ గంగానదీ ప్రక్షాళన ప్రాజెక్టు లక్ష్యానికి చేరుకోకపోవడం కనిపిస్తున్నదే.

ఇది రాజకీయనేతల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతున్నది. ఇలాంటి నాయకులు, పార్టీల మధ్య ప్రపంచంలోకెల్లా గొప్ప ప్రాజెక్టును కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రికార్డు సమయంలో పూర్తిచేయ డమే సంచలనం. ఎంత మంచివాళ్లకైనా బాధలు తప్పవన్నట్టుగా పనిచేసే వారిపైనే నిందలు వేయడం సహజం. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్‌ ముందున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఎప్పటికప్పుడు నూతన పంథాలో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. భారతదేశాన్ని కేసీఆర్‌ లాంటి నాయకుడు పాలించే అవకాశం వస్తే దేశ ప్రజల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. రానున్నరోజుల్లో కేసీఆర్‌ నాయకత్వంలో వెలుగులను విరజిమ్మే భారతదేశాన్ని చూడాలని దేశ ప్రజలందరూ కోరుకునే రోజు దగ్గరలోనే ఉన్నదనడానికి కాళేశ్వరం ప్రాజెక్టును ఉదాహరణగా చెప్పవచ్చు.

-నాగేందర్ రెడ్డి కాసర్ల

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.