Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అంతటా కేసీఆర్ ప్రభంజనం

-అన్ని నియోజకవర్గాల్లో సానుకూలత
-ఎక్కడ సభ పెట్టినా జనప్రభంజనమే
-గ్రామాల్లో టీఆర్‌ఎస్ పాలనపై చర్చ
-సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి
-నాలుగున్నరేండ్ల అభివృద్ధివైపే మొగ్గు
-మళ్లీ టీఆర్‌ఎస్‌కే ఓటెయ్యాలని నిర్ణయం
-అంతర్మథనంలో కాంగ్రెస్ నాయకులు
-దశాబ్దాలపాటు ఏం చేయలేకపోయాం
-24 గంటల కరంట్, ప్రాజెక్టులు, భగీరథ, రైతు పథకాలు,పెన్షన్లు ఇవ్వలేకపోయాం
-ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలేదు
-ఓటమి తప్పదని అందరిలోనూ భయం
-బాబుతో పొత్తు ముంచుతుందని గుబులు

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు సానుకూల వాతావర ణమే! పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా కేసీఆర్ పాలనపైనే చర్చ జరుగుతున్నది! ఎన్నికల వేళ ఏ ఊరిలో నలుగురు ఒకచోట కూడినా టీఆర్‌ఎస్ పథకాలపైనే మాట్లాడుకుంటున్నారు! ప్రతీ ఇంటికి రెండు, మూడు పథకాలతో లబ్ధి కలుగుతున్నదని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ వల్లే 24 గంటల కరంటు, ప్రాజెక్టులు పూర్తి, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు, నిండుకుండలా చెరువులు, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు సాధ్యమ య్యాయని అభిప్రాయపడుతున్నారు. 60 ఏండ్ల సమైక్యపాలనలో ప్రజల కోసం ఇన్ని పథకాలు అమలుచేసిన నాయకుడే లేడని కేసీఆర్‌ను వేనోళ్ల పొగుడుతున్నారు. ఇంటి పార్టీకి పట్టం కడితేనే భవిష్యత్ ఉంటుందని తోటివాళ్లను జాగృతం చేస్తున్నారు. కూటమి అగ్రనేతల నియోజకవర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతున్నది. స్థానికంగా పోటీ చేస్తున్నది ఎవరనేది ముఖ్యంకాదని, తిరిగి టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలి.. కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ బహిరంగసభలకు తండోపతండాలుగా హాజరవుతున్న జనప్రభంజనమే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.

మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, రైతులు, చేతివృత్తిదారులు.. సబ్బండ వర్ణాలు సభలకు స్వచ్ఛందంగా పోటెత్తుతున్నారు. ప్రతీ ఇంటిలో కనీసం ఒకరికి లబ్ధి కలిగించిన కేసీఆర్‌ను మనసారా ఆశీర్వదిస్తున్నారు. సభల్లో మళ్లీ ఆంధ్రోళ్ల పాలన కావాలా అని కేసీఆర్ ప్రశ్నిస్తే, వద్దే వద్దంటూ చేతులూపి తమ మనోగతాన్ని స్పష్టం చేస్తున్నారు. నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలన కావాలా? అరవై ఏండ్ల కూటమి పాలన కావాలని అని ప్రశిస్తే.. టీఆర్‌ఎస్సే కావాలి, కేసీఆరే సీఎం కావాలని నినదిస్తున్నారు. తెలంగాణపై చంద్రబాబు పెత్తనం అవసరమా అని ప్రశిస్తే, వద్దని తేల్చిచెప్తున్నారు.

మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సభలు జనం లేక వెలవెలపోతున్నాయి. ఏ సభలో చూసినా కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నా యి. కూటమికి జనామోదం లేకపోవడంతో అగ్రనేతలైన పీ సీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, టీ జీవన్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, షబ్బీర్‌అలీ, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు తదితరులకు ఓటమి భయం పట్టుకున్నది.

ఎందుకు విశ్వసించడంలేదని మథనం
రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌పై సానుకూలత ఏర్పడటానికి కారణాలు ఏమిటి? కేసీఆరే సీఎం కావాలని ప్రజలు బలంగా ఎందుకు ఆకాంక్షిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విశ్లేషించుకుంటున్నట్టు తెలిసింది. సోనియా నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసినప్పటికీ ప్రజలు ఎందుకు విశ్వసించడంలేదని నేతలు మథనపడుతున్నారు. తెలంగాణ ఏర్పడటానికి ముందు పదేండ్లు అధికారంలో ఉండి సాగుకు కనీసం ఎనిమిది గంటల కరంట్‌ను నిరంతరాయంగా ఇవ్వలేకపోయామని, కోతలు తప్పక గృహ వినియోగదారులకు ఇబ్బందిపడ్డారని గుర్తుచేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కేసీఆర్ గృహ, పారిశ్రామిక అవసరాలకు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వడం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని కాంగ్రెస్ నేతలు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. రుణమాఫీ, రైతు బంధు, రైతుబీమాతో రైతులంతా కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉన్నారని విశ్లేషిస్తున్నారు. పెన్షన్లు, గురుకులాల ఏర్పాటు, కంటి వెలుగు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు జనరంజకంగా ఉన్నాయని, దీంతో కొత్తగా ఏమి హామీలిచ్చినా ప్రజలు వినేపరిస్థి తి లేదని భావిస్తున్నారు. ఇంటింటికి నల్లాలతో భగీరథ నీళ్లు వస్తున్నాయని చెప్తున్నారు. ప్రజల దైనందిన జీవనంలో ప్రభుత్వ పథకాలు స్ఫురణకు వస్తున్నాయని, అందుకే కేసీఆర్‌కు సానుకూలత ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.

చంద్రబాబుతో కలువడమే తప్పు
చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటే కలిసి వస్తుందని భావిం చాం, కానీ ఎదురుతన్నేటట్టు ఉన్నదని సీనియర్ కాంగ్రెస్ నేత అభిప్రాయపడ్డారు. మా నేతలు తలతిక్క పనిచేసి చంద్రబాబుతో పొత్తుపెట్టుకొని కొంపముంచారని కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులు అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వెలువడగానే పార్టీలకతీతంగా ఆంధ్రా ప్రజాప్రతినిధులతో రాజీనామా డ్రామాకు తెరలేపింది చంద్రబాబేనని, అందువల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైందని కాంగ్రెస్ నాయకులు గుర్తుచేస్తున్నారు. తెలంగాణను అడ్డుకొని వంద ల మంది యువకుల ఆత్మబలిదానానికి కారణమైన చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు స్వాగతించడంలేదని విశ్లేషిస్తున్నారు.

పోయిపోయి ఆంధ్రోన్ని ఎందుకు తోలుకొచ్చిండ్రని ప్రజలు ప్రశ్నిస్తున్నారని గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబుతో పొత్తు తప్పేనని, ఎమ్మెల్యే టికెట్లు సైతం చంద్రబాబు సూచించినవారికి ఇచ్చే పరిస్థితి రావటం మైనస్ అయినట్లేనని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై అనేక విషయాల్లో సానుకూలత ఉండగా, కాంగ్రెస్‌కు ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తున్నదని సొంత పార్టీ నాయకులే చెప్తున్నారు. ప్రజలు ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలనే విషయంలో నిర్ణయానికి వచ్చారని, ప్రచారానికి వెళ్లిన ప్రతీచోటా కేసీఆర్‌వైపు ఉన్నారని స్పష్టమవుతున్నదని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.

కాంగ్రెస్ పెండింగ్.. టీఆర్‌ఎస్ కంప్లీట్
నాలుగున్నరేండ్లే కేసీఆర్ అధికారంలో ఉండి ఇన్ని పథకాలు చేపట్టి అమలుచేస్తున్నారని, ఇదివరకటి కాంగ్రెస్‌పాలనలో పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులతోపాటు కొత్తవి కూడా శరవేగంగా పూర్తిచేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సమైక్యరాష్ట్రంలో దశాబ్దాలపాటు అధికారంలో ఉండి ఏ ప్రాజెక్టూ పూర్తిచేయలేకపోయామని, అలాంటప్పుడు ప్రజలు ఏవిధంగా నమ్ముతారని ఓ కాంగ్రెస్ నాయకుడు అభిప్రాయపడ్డారు. కరంటు ఇవ్వలేకపోయాం, అట్టహాసంగా పనులు ప్రారంభించిన ప్రాణహిత- చేవెళ్లను పూర్తిచేయలేక ఫెయిలయ్యామని.. దీంతో ప్రజల్లో ఇప్పటికీ తమపై నమ్మకం రావడంలేదని మరో నేత విశ్లేషించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.