Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర సానుకూలం

– త్వరలోనే రెండు రాష్ర్టాల స్టాండింగ్ కమిటీ సమావేశం – రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి

Harish-Rao-1 మహారాష్ట్ర- తెలంగాణ రాష్ర్టాల మధ్య నిర్మించనున్న లెండి, లోయర్ పెన్‌గంగ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చర్చలు జరిపారు. లెండి ప్రాజెక్టు నిర్మాణంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడానికి మహా ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలకు నష్ట పరిహారం చెల్లించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

ఈ మేరకు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్‌తో బుధవారం ముంబైలో మంత్రి హరీశ్‌రావు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. 2015 జూలై నాటికి లెండి ప్రాజెక్టును పూర్తి చేస్తే.. ప్రాజెక్టు నిర్మాణంలో పెరిగిన నిర్మాణ ఖర్చును భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు తెలిపారు. లెండి ప్రాజెక్టు పూర్తయితే నిజామాబాద్ జిల్లాలోని బిచ్‌కుంద, మద్నూరు మండలాల్లో 22 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరింది. కొంత ఎత్తును తగ్గించి ప్రాజెక్టును నిర్మిస్తే తమ అభ్యంతరం లేదని మహారాష్ట్ర తెలిపింది. ఈ ప్రాజెక్టుతో ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగా పరీవాహక మండలాలైన తాంసి, జైనథ్, బేల మండలాల్లోని 49వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముంది.

తాంసి మండలం సరిహద్దులోగల మహారాష్ట్రలోని రూఢ గ్రామ పంచాయతీ వద్ద ఈ పెన్‌గంగా బ్యారేజీ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఇరురాష్ర్టాల మధ్య వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు రెండు రాష్ర్టాల స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఆగస్టులో ఏర్పాటుచేసేందుకు మహారాష్ట్ర అంగీకరించింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున హరీశ్‌రావు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, కోనేరు కోనప్ప, వేణుగోపాలాచారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అరవిందరెడ్డి, ఈఎన్‌సీ మురళీధ్‌ర్ రావు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.