Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అప్పుడు మీకు నోరులేదా..?

మిడిమిడి జ్ఙానం, తెలివి తక్కువతనం, తెలంగాణ ప్రభుత్వానికి మంచిపేరు రావద్దనే దుగ్ధతో కాంగ్రెస్,టీడీపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. తెలంగాణభవన్‌లో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. అందుకే ప్రజల చేత ఎన్నుకున్న ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని తాను వాస్తవాలు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కతోపాటు టీడీపీ నాయకుడు నర్సిరెడ్డి గతంలో తెలంగాణకు అన్యాయం జరిగినపుడు ఏనాడూ పెదవి విప్పలేదన్నారు.

Harish-Rao-press-meet

-సీమాంధ్ర పాలకులు తెలంగాణ నోళ్లు కొట్టినపుడు మాట్లాడలేదేం? -సమైక్యపాలనలో జరిగిన అన్యాయంపై ఎప్పుడైనా ప్రశ్నించారా? -మమ్మల్ని అడిగే నైతిక హక్కు మీకెక్కడిది? -కాంగ్రెస్, టీడీపీ నాయకులపై ధ్వజమెత్తిన మంత్రి హరీశ్‌రావు సమైక్య పాలకులు కృష్ణాజలాల్ని బేసిన్‌లో లేని ప్రాజెక్టులకు తరలించుకుపోయినా నోరు ఎందుకు మెదపలేదని హరీశ్‌రావు వారిని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు, వెలుగొండ ప్రాజెక్టుల ద్వారా వైఎస్ నీళ్లు తీసుకుపోతుంటే ప్రశ్నించలేని ఈ నాయకులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అడిగే నైతికత ఎక్కడిదన్నారు. ఆ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తాము అప్పట్లో అసెంబ్లీని 30 రోజులపాటు స్తంభింపజేశామని గుర్తు చేశారు. గతంలో సమైక్య పాలకులు కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించారే తప్ప ఏనాడూ తెలంగాణకు నీళ్లియ్యాలనే ఆలోచన చేయలేదని చెప్పారు.

-కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వాస్తవాలివి… ప్రాణహిత-చేవెళ్ల పథకంలో డిజైన్ మార్చి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారంటూ మరికొందరు కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అందుకే ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తున్నామంటూ ఆ అంశాలను వివరించారు. ప్రాణహిత చేవెళ్ల కింద గత ప్రభుత్వం తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో 56వేల ఎకరాల ఆయకట్టును పొందుపరిచింది. తుమ్మిడిహట్టి దగ్గర ఎలాంటి ముంపు లేకుండా బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించాం. దీని వల్ల గతంలో కంటే అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు.

బ్యారేజీని మార్చడం వల్ల నీటి లభ్యత ఉండదనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం ద్వారా 120 రోజుల పాటు 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర ఐదు టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకోవచ్చు. మేడిగడ్డ వద్ద పది టీఎంసీలు అంటే రెట్టింపు నీటిని నిల్వ చేసుకోవచ్చు అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, గణేశ్‌గుప్తా, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

-మొక్కలను చంటి పిల్లల్లా పెంచండి.. మార్కెటింగ్ శాఖాధికారులకు సూచన రాష్ట్రంలోని 150 మార్కెట్ యార్డులలో జరుగుతున్న హరితహారం కార్యక్రమంపై మంత్రి హరీశ్‌రావు బుధవారం వాట్సప్‌ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మొక్కలను చంటి పిల్లల కంటే జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.