Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

-వైద్యరంగంపై గత పాలకుల నిర్లక్ష్యం -చికిత్స చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ -40 డయాలిసిస్ కేంద్రాలు దేశానికే ఆదర్శం -పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ -కేసీఆర్ కిట్లతో సర్కారు దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు : మంత్రి లక్ష్మారెడ్డి -సిరిసిల్లకు జనఔషధి కేంద్రం, నర్సింగ్ కళాశాలలో పీజీ కోర్సులకు హామీ

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కీలకమైన వైద్యరంగాన్ని బలోపేతంచేస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని అన్నారు. సీఎం కేసీఆర్ ఆశయం మేరకు కంకణం కట్టుకుని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలన్నీ తిరిగొచ్చి దవాఖానల ఆధునీకరణకు అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో 40 డయాలిసిస్ కేంద్రాల ఏర్పాటుతో రికార్డు సృష్టించి రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్‌లో మంగళవారం డయాలిసిస్, ఇంటెన్సివ్ కేర్ యూనిబ ట్, బ్లడ్ బ్యాంకులను ప్రారంభించడంతోపాటు మాతాశిశు సంరక్షణ కేంద్రం, నర్సింగ్ కళాశాలలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ శంకుస్థాపనచేశారు. అనంతరం స్థానిక పద్మనాయక కళ్యాణ మంటపంలో జరిగిన సభలో మాట్లాడారు.

గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన వైద్యరంగానికి సీఎం కేసీఆర్ చికిత్స చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందించడానికి డయాలిసిస్ కేంద్రాలు, ఐసీయూ ఏర్పాటుచేయాలన్న సోయి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలకు లేకపోయిందని విమర్శించారు. ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెంచేలా అత్యాధునిక వసతులు కల్పిస్తున్నామన్నారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ కిట్ల పేరిట 13 వస్తువులు ఇవ్వడంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 50 శాతం పెరిగిందని వివరించారు. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే 800 కేసీఆర్ కిట్లను పంపిణీ చేసినట్టు చెప్పారు. పేద ప్రజలకు మందుల ధరలు అందుబాటులో ఉండేలా సిరిసిల్ల జిల్లా కేంద్రానికి జనఔషధి కేంద్రం ఏర్పాటుతోపాటు, డయాగ్నస్టిక్ సెంటర్, నర్సింగ్ కళాశాలలో పీజీ కోర్సులను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని మంత్రి కేటీఆర్ కోరారు.

ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి: లక్ష్మారెడ్డి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ కోరిక మేరకు జిల్లాకు జనఔషధి కేంద్రం, పీజీ డిప్లొమో కళాశాలను మంజూరుచేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ దవాఖానలో డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల మందికి మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ వేయనున్నామన్నారు.15 ఏండ్లలోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ తప్పకుండా వేయించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో దవాఖానల ఆధునీకరణ వేగంగా జరుగుతున్నదని మంత్రి తెలిపారు. ప్రైవేటు దవాఖానల్లో అనవసరంగా అపరేషన్లు చేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్‌లో ఇబ్బందులుంటాయని లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ పథకంలో శుద్ధజలాలను అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ గుగులోతు రేణ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.