ఆరేండ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి పథంలో నిలిపిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మత తత్వాన్ని, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కేంద్ర మంత్రులంతా ప్రశంసించి.. ఎన్నికల వేళ ఛార్జీషీట్ అంటూ బీజేపీ కేంద్ర మంత్రి జవడేకర్ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ఎందుకు మాపై ఛార్జీషీటు.. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎందుకు ఛార్జీషీటు వేసిందో ఆ పార్టీ నాయకులకే తెలియదని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం నెంబర్ వన్‌గా గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కోటిన్నర ఎకరాలకు నీరందించాం. ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నాం. రైతు భీమా పథకంతో రైతుల్లో భరోసా నింపాం. వృద్ధులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నాం. యేటా రూ. 50 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం. కేసీఆర్ కిట్టుతో మతా శిశు మరణాలు తగ్గించాం. పవన్ హాలిడేస్‌ను ఎత్తివేశాం. పరిశ్రమలకు బాగు చేశాం. రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. లక్షలాది మంది యువతకు ఉపాధి, విద్యా అవకాశాలు కల్పిస్తున్నాం. ఇందుకు ఛార్జీషీటు వేస్తారా అని బీజేపీని మంత్రి కేటీఆర్ నిలదీశారు.
హైదరాబాద్‌కు ఏం చేశారు.. హైదరాబాద్‌కు కేంద్రం ఏ చేసిందో సూటిగా సుత్తి లేకుండా చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఏం చేశామో చెప్పే ఓటర్లను ఓటు అడుగుతున్నామని బీజేపీకి ఆ దమ్ముందా అన్ని ప్రశ్నించారు. బీజేపీకి అధికారమిస్తే హైదరాబాద్‌ను గుండు గుత్తాగా అమ్మేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేసి ప్రైవేట్‌పరం చేస్తుందని మండిపడ్డారు. అసమర్థ, అన్యాయ, అసత్యాల భారతీయ జనతా పార్టీకి 50 సూటి ప్రశ్నలు వేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అసమర్ధత, అన్యాయాలు, అసత్యాలు – భారతీయ జనతా పార్టీకి 50 ప్రశ్నలు జాతీయాంశాలు: 1. వేలకోట్ల ఆదాయన్ని సమకూర్చే ప్రభుత్వరంగ సంస్థలను అడ్డికి పావు సేరుకి తెగనమ్ముతున్నది మీరేకదా? 2. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ అయిన ఇండియన్ రైల్వేను ప్రైవేటుపరం చేస్తోంది మీరు కాదా? 3. 40 కోట్ల పాలసీదారులను కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద బీమా కంపెనీని తెగనమ్మేందుకు చేస్తున్న కుటిల ప్రయత్నాలు మీవి కావా? 4. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని అరేళ్లుగా దేశ యువతను దగా చేస్తున్నది మీరు కాదా? 5. హమీ ఇచ్చిన ఉద్యోగాలను ఇవ్వక…నోట్లరద్దు, డిమానటైజేషన్, అయోమయ లాక్ డౌన్ వంటి అసమర్ధ చర్యలతో లక్షలాది మంది ఉద్యోగాలను ఊడగొట్టింది మీరు కాదా, ఉపాది పొగోట్టి వారి జీవితాలను ఆగం చేసింది మీరు కాదా? 6. పరుగులు పెడుతున్న ఆర్థిక వ్యవస్థను తమ ఆసమర్ధ విధానాలతో అర్ధిక వ్యవస్థ నడ్డి విరగొట్టింది మీరు కాదా? 7. కరోనా సంక్షోభానికి ముందే 8 క్వార్టర్స్ పాటు అర్థిక రంగాన్ని దెబ్బతీసింది మీరు కాదా? 8. మతిలేని విధానాలతో అర్ధిక వ్యసర్దను కుదేలు చేసి 24శాతం దేశ జిడిపిని పడగొట్టి అల్ టైం లో(low) కి తీసుకుపోయింది మీ పాలన కాదా? 9. లాడ్ డౌన్ సమయంలో మానవత్వం సైతం చూపకుండా కఠినాతి కఠినంగా లక్షలాది మంది వలస కార్మికులను సలసల మండే ఎండల్లో వేలాది కీలోమీటర్లు నడిపించి, వారి ఉసురు పోసుకుంది మీరు కాదా? 10. నయాపైస లేకుండా రోడ్డున్నపడ్డ కూలీల నుంచి నిర్దయగా రైల్వే టిక్కట్ల పేరుతో పైసలు పిండుకుంది మీరే కదా? 11. లాక్ డౌన్ తర్వతా 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ కనీసం 20 మందికైనా ప్రయోజనం ఇవ్వకుండా ఉత్త మాటలు చెప్పింది మీరు కాదా? 12. జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని కోట్లాది మంది పేద ప్రజలను మోసం చేసింది మీరు కాదా? 13. విదేశాల నుంచి నల్లధనం తెస్తామనమన్న హమీకి మసిపూసి మారేడుకాయ చేస్తున్నదది మీరు కాదా? 14. జీఎస్టీతో వ్యాపారుల వెన్ను విరిచింది వాస్తవం కాదా? 15. పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోని విధంగా దెబ్బతీసింది మీరు కాదా? 16. పక్కనున్న చిన్న దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంకల కన్న తక్కువ వృద్ధికి అర్ధిక వ్యవస్థను దిగజార్చింది మీ ప్రభుత్వం కాదా? 17. అనాలోచిత నిర్ణయాలతో ఎంఎస్ఎంఈ సెక్టార్ ని కోలుకోని విధంగా దెబ్బతీసింది మీరు కాదా? 18. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థను భ్రష్టు పట్టించింది మీరు కాదా? 19. బ్యాంకులను నట్టేట ముంచిన వారిని దేశం దాటించింది మీరు కాదా? 20. లక్షలాది మంది ఖాతాదారులు, ఉద్యోగులను ఆగం చేసింది మీరు కాదా? 21. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ పెట్టాలని సూచిస్తే… బీసీల సంక్షేమాన్ని కనీసం పట్టించుకోనిది మీరు కాదా? 22. పన్నుల వాటా అడిగితే అడిగితే మాది వేర్పాటువాదం అంటున్న మీరు… వేర్పాటువాద పార్టీలతో పదవులు పంచుకున్నది మీ పార్టీ కాదా ? 23. రైతుల నడ్డి విరిచే నల్లా చట్టాలు తెచ్చింది మీరు కాదా? 24. దేశ ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టి కార్పొరేట్ వ్యవసాయానికి ద్వారాలు తెరుస్తోంది మీరు కాదా? 25. హధ్రాస్ లో ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే కనీసం అంతిమ సంస్కారం కూడా దక్కకుండా… దేశంలో మహిళల రక్షణను ప్రశ్నార్థకం చేసింది మీరు కాదా? 26. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినా మీపాలనలో పెట్రోల్ రేటు దాదాపు రెట్టింపు అయింది మీ హాయంలోనే కాదా?
తెలంగాణ: 27. పురిట్లోనే ఏడు మండలాలను లాక్కుని తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది మీరు కాదా? 28. కరెంట్ కష్టాల్లో ఉన్న తెలంగాణను దొంగ దెబ్బతీసి లోయర్ సీలేర్ విద్యుత్ ప్రాజెక్టును మాకు దక్కకుండా చేసింది మీరు కాదా? 29. విభజన చట్టం హామీలను తుంగలో తొక్కింది మీరు కాదా? 30. ప్రత్యేక పన్ను రాయితీలు ఇవ్వాలన్న హామీలను మరిచిపోయింది మీరు కాదా? 31. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఊపిరి పోయకుండా… ఉసురు తీస్తున్నది మీరు కాదా? 32. కరువు నేలల్లో నీళ్లు పారిస్తున్న కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా అన్యాయం చేసింది మీరు కాదా? 33. మీ నీతి ఆయోగ్ సిఫారసు చేసినా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ఒక్క పైసా ఇవ్వనిది మీరు కాదా? 34. తెలంగాణకు ఐఐఎం, ఐసర్ వంటి సంస్థలు కేటాయించకుండా ఆపుతున్నది మీరు కాదా? 35. కరీంనగర్ కు ట్రిపుల్ ఐటీ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపింది మీరు కాదా? 36. గిరిజన బిడ్డల కోసం ప్రతిపాదించిన ట్రైబల్ యూనివర్సిటీకి మొండిచెయ్యి చూపింది మీరు కాదా? 37. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కొర్రీలు పెట్టింది మీరు కాదా? 38. విద్యార్థుల భవిష్యత్తుకు ఉద్దేశించిన నవోదయలను కూడా ఇవ్వని దయలేని ప్రభుత్వం మీది కాదా? 39. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రూ.735 కోట్ల TAX Devolution నష్టాల మేరకు ఇవ్వాలన్న ప్రత్యేక గ్రాంటును ఎగొట్టింది మీరు కాదా? 40. నూతన విద్యుత చట్టంతో తెలంగాణ రైతన్నల బోర్ బావులకు మీటర్లు పెట్టేందుకు సిద్ధం అవుతున్నది మీరు కాదా? 41. తెలంగాణ రైతులు పండిస్తున్న సన్నాలకు అదనపు మద్దతు ధర రాకుండా పరిమితులు పెడుతున్న పాపపు ప్రభుత్వం మీది కాదా? 42. రాష్ట్రానికి రావాల్సిన జియస్టీ పన్ను బకాయిలను ఏగొడుతన్న దివాళా ప్రభుత్వం ఏవరిది?
హైదరాబాద్: 43. ఇప్పటిదాకా అరేళ్లలో ఒక్కపైసా అదనంగా హైదరాబాద్ కు ఇవ్వనిది మీరు కాదా? 44. లక్షలాది యువత ఉపాధి అవకాశాల ఆశల్ని వమ్ము చేస్తూ ఐటీఐఆర్ ని రద్దు చేసింది మీరుకాదా? 45. వరద సాయం కోసం లేఖ రాస్తే నేటికీ అణా పైసా ఇవ్వనిది మీరు కాదా? 46. అదే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటలకు ఆగమేఘాల మీద వందల కోట్లు ఇచ్చింది మీరు కాదా? 47. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్సిట్టూట్ ఆఫ్ డిజైన్ ను తన్నుకుపోయింది మీరు కాదా? 48. నమామి గంగేకు వేలకోట్లిచ్చి హైదరాబాద్ మూసీకి మొండిచేయి చూపింది మీరు కాదా? 49. హైదరాబాద్ లోని బీహెచ్ ఈఎల్, మిధాని వంటి రక్షణ వంటి సంస్థలు ప్రైవేటుపరం చేస్తున్నది మీరు కాదా? 50. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు స్కైవేలు కడతామంటే.. కంటోన్మెంట్ రోడ్లను కట్టా చేసి గుప్పిట్లో పెట్టుకున్నది మీరు కాదా?