Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి

-ఇంటిపార్టీ టీఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించండి -కాంగ్రెస్, టీడీపీల డిపాజిట్లు గల్లంతు కావాలి -గట్‌లింగంపల్లి పూర్తిచేసి జన్మధన్యం చేసుకుంటా -భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు -వరంగల్, హైదరాబాద్ దెబ్బరుచి చూపాలి -అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపు -నారాయణఖేడ్‌లో ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం

Harish-Rao-election-campaign-in-Narayankhed

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నారాయణఖేడ్‌లో ఒక మంచి దవాఖాన, మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయలేదు. కనీసం ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించకుండా కాంగ్రెస్ నేతలు ఖేడ్ పరువు తీశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 16నెలలు గా నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఉప ఎన్నిక ద్వారా ఈ ప్రాంత ఆత్మగౌర వం నిలబెట్టే అవకాశం వచ్చింది. ఇంటిపార్టీకి అవకాశం కల్పించండి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా ఖేడ్ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం కల్హేర్ మండలం ఖాజాపూర్, ఫత్తేపూర్, మనూరు మండలం శెల్గిరా, పెద్దశంకరంపేటలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఖేడ్‌లో దవాఖాన, మార్కెట్‌యార్డు, పీజీ కళాశాల లేక చెట్టుకొకరు, పుట్టకొకరు వెళ్లే పరిస్థితి తెచ్చి ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపింది కాంగ్రెస్ నేత లు కాదా అని ప్రశ్నించారు.

ఇన్నేళ్లు కాంగ్రెస్‌కు ఓటేస్తే ఒక్క మంచిపని కూడా చేయకపోగా ప్రజలను అణచివేతకు గురిచేసి ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచిపోషించారని ధ్వజమెత్తా రు. తాగడానికి నీరు దొరకని పరిస్థితుల్లో ప్రజలుంటే, కాం గ్రెస్ నేతలు మాత్రం పదవులు పంచుకుని ఆస్తులు పెంచుకున్నారన్నారు. ఖేడ్‌ను అన్నింటా హైరాన్‌ఖేడ్ చేసి పెద్దపెద్ద నేత లు ఏముఖం పెట్టుకుని వస్తున్నారని నిలదీశారు. హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా గల్లీగల్లీ తిరిగి ఓట్లడిగినా దిష్టి తిప్పిసినట్లు ఒక స్థానంలో గెలిపించారని ఎద్దేవాచేశారు. చంచల్‌గూడా జైలు నుంచి వచ్చిన ఓ నేత ఓట్ల కోసం ఖేడ్‌లో తిరుగుతున్నాడని విమర్శించారు. టీడీపీని కాపాడలేక టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు సాక్షాత్తు ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటిస్తే ఇంకా సిగ్గులేకుండా ఆ పార్టీ జెండాలు పట్టుకుని గల్లీగల్లీ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలు ఖేడ్‌లో కనిపించవని, ఎవరి బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.

జిల్లా మంత్రిగా తాను, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌లు అండగా ఉంటామన్నారు. 16నెలల్లో ఖేడ్‌కు రెండు జాతీయరహదారులను మంజూరు చేయించిన ఘనత ఎంపీ బీబీ పాటిల్‌దేనన్నారు. నిజాంపేట్-బీదర్, సంగారెడ్డి-నాందేడ్ రహదారులకు జాతీయహోదా కల్పించడం ద్వారా త్వరలో నాలుగు లేన్ల రోడ్డుగా అభివృద్ధి చెందుతుందన్నారు. గట్‌లింగంపల్లి ప్రాజెక్టును నిర్మించి గోదావరి జలా లను తరలించి వేల ఎకరాలకు సాగునీటిని అందించి జన్మధన్యం చేసుకుంటానన్నారు. బుధవారం ఖేడ్‌లో నిర్వహించిన సీఎం బహిరంగసభకు వచ్చిన జనంతోనే భూపాల్‌రెడ్డి భారీమెజార్టీతో గెలవనున్నారనేది తేలిపోయిందని, కాంగ్రెస్, టీడీపీలు కేవలం డిపాజిట్లు దక్కించుకోవడమే మిగిలిందన్నారు.

Election-Campaign-in-Narayankhed

ఆడబిడ్డల ఉసురు ఊరికే పోదు: డిప్యూటీ స్పీకర్ ఇన్నేళ్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్, టీడీపీలు కనీసం మంచినీళ్ల గోస తీర్చలేదని, ఇక్క డి ఆడబిడ్డల ఉసురు ఊరికేపోదని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి శాపనార్థాలు పెట్టారు. ఆడపడుచుల కష్టాలు తీర్చేందుకే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికీ నల్లాల ద్వారా నీరందించే కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు.

వచ్చే ఎన్నికల్లోగా మహిళలు బిందె పట్టుకుని రోడ్డుమీదకు వస్తే ఓట్లు అడబోనని శపథం చేసిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఖేడ్‌లో కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని పట్టించుకోకుండా ప్రజల మధ్య గొడవలు సృష్టించి తన్నుకు చావండి.. తమాషా చూస్తాం అన్నట్లుగా వ్యవహరించారన్నారు. ఖేడ్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మంత్రి హరీశ్‌రావు ప్రకటించడం ద్వారా ఇక్కడి సమస్యలన్నీ తీరినట్లేనన్నారు. వరంగల్, హైదరాబాద్‌లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు దెబ్బకొడితే కోలుకోలేని షాక్ తగిలిందని, అదే దెబ్బను ఖేడ్ ప్రజలు మరోసారి రుచి చూపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్యెల్యేలు బాబూమోహన్, మదన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర గీత పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్ విగ్రాం రామాగౌడ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, పుష్పానగేశ్‌యాదవ్, విగ్రాం శ్రీనివాస్‌గౌడ్, మల్‌శెట్టియాదవ్, విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రచార పర్వానికి తెర ఖేడ్ ఉప ఎన్నిక నేపథ్యంలో శనివారం పోలింగ్ నిర్వహించనుండగా గురువారంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 20 రోజులుగా టీఆర్‌ఎస్‌తో పాటు ఆయా పార్టీ లు ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు గురువారం సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీలు ప్రచారాన్ని ముగించాయి. చివరి రోజున పెద్దశంకరంపేటలో అన్ని పార్టీలు ప్రచారం చేశాయి.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.