Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అట్టహాసంగా బతుకమ్మ చీరెల పంపిణీ

ఆడపడుచులకు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్‌తో కలిసి చీరెలు పంపిణీ చేసి మాట్లాడారు. ఆడపడుచుల కండ్లల్లో ఆనందం నింపేందుకే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. 1.04కోట్ల మందికి రూ.250 కోట్లు ఖర్చుచేసి 500 రకాల డిజైన్లతో నాణ్యమైన చీరెలను తయా రు చేయించామన్నారు. మహిళలందరికీ సీఎం కేసీఆర్ పెద్దన్నగా వ్యవహరిస్తూ సంక్షేమపథకాలను అమలుచేస్తున్నారని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న చెప్పారు. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో మహిళలకు చీరెలను పంపిణీ చేశారు. ప్రజలంతా తన కుటుంబంలో సభ్యులన్న అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఉంటారని, చీరెల పంపిణీ ప్రతిష్ఠాత్మకమైనదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. నిర్మల్, ఎల్లాపెల్లి, నిర్మల్, సారంగపూర్‌లో చీరెలను ఆయన పంపిణీ చేశారు. వికారాబాద్ జిల్లాలో తొలిరోజు లక్ష చీరెలను పంపిణీ చేసినట్టు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. మరో 76 వేల చీరలను పంపిణీ చేస్తామన్నారు. మోమిన్‌పేట్‌లో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులోనూ చీరెల పంపిణీలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో ఎమ్మెల్యే టీ ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ చీరెలు పంపిణీ చేశారు.

మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. హైదరాబాద్‌లోని బేగంపేట, అమీర్‌పేట్, సనత్‌నగర్‌లో చీరెల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఆడపడుచులు బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకొనేందుకే సీఎం కేసీఆర్ చీరెలు పంపిణీ చేస్తున్నట్టు ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. సికింద్రాబాద్‌లోని లాలాపేట్‌లో బతుకమ్మ చీరెలను ఆయన పంపిణీ చేశారు. ఆడపడుచులకు బతుకమ్మచీర పెట్టడమనేది తెలంగాణ సంస్కృతిలో భాగమని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి, వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లిలో చీరెల పంపిణీని ఆయన ప్రారంభించారు. సద్దుల బతుకమ్మను మహిళలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని మద్దులపల్లి, కూసుమంచి మండలం మల్లేపల్లి, నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో చీరెల పంపిణీని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లతోపాటు బాలానగర్, రాజాపూర్‌లో బతుకమ్మ చీరెలను ఆయన పంపిణీ చేశారు.

మంచిర్యాలలోని జెడ్పీ బాలుర పాఠశాలలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి చీరెలు పంపిణీచేశారు. ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా సీఎం కేసీఆర్ చీరెలను అందజేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లిల్లో చీరెలను పంపిణీచేశారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి, అన్నయ్యాడని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తిలో చీరెలను పంపిణీ చేశారు. అన్ని మతాలకు సర్కారు ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. మెదక్ జిల్లా కేంద్రం,పాపన్నపేట, చిన్నశంకరంపేట,రామాయంపేట మండలాల్లో బతుకమ్మ చీరెలను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పంపిణీచేశారు. సద్దుల బతుకమ్మ పండుగరోజు ఈ చీరలను కట్టుకోవాలని కోరారు. నల్లగొండలో మహిళలకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బతుకమ్మ చీరలు అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండల కేంద్రంతో పాటు తంగడపల్లి, సంస్థాన్‌నారాయణపురంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మం డల కేంద్రాల్లో బతుకమ్మ చీరలను శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి పంపిణీ చేశారు.

అన్నలా ఆదరిస్తున్న సీఎం కేసీఆర్: ఎంపీ కవిత బతుకమ్మ పం డుగ అంటేనే ఆడపిల్లలను అన్నదమ్ములు తల్లిగారింటికి పిలిచి సారెచీరె పెట్టే సంప్రదాయమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. సద్దుల బతుకమ్మకు అన్నపెట్టిన చీరె కట్టుకుంటే ఆడబిడ్డలకు ఆనందం ఉం టుందన్నారు. సోమవారం నిజామాబాద్ రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బతుకమ్మ చీరెల పంపిణీలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్నలా ఆలోచించి ఆడబిడ్డలందరికీ చీరెలు పంపించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు కేసీఆర్‌ను ఆశీర్వదించి అం డగా నిలిచారని, బంగారుతెలంగాణ నిర్మాణంలోనూ కలిసి రావాలని కోరారు. సీఎం బోళాశంకరుడని, అడిగిందే తడువుగా అన్నీ ఇస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడగానే తొలుత బతుకమ్మకు, తర్వాత బోనాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించారని చెప్పారు. బతుకమ్మ పం డుగకు ఏటా రూ.10 కోట్ల కేటాయించి గ్రామగ్రామాన వైభవంగా నిర్వహించేలా చేశారన్నారు. బోనాల పండుగకు ప్రతిగుడికి డెకరేషన్, లైట్లు, ప్రభుత్వం నుంచి అమ్మవారికి బట్టల పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమం లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, భూపతిరెడ్డి, ఆకుల లలిత, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ , జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నెడ్‌క్యాప్ చైర్మన్ ఎస్‌ఏ అలీం, జడ్పీచైర్మన్ దఫేదార్ రాజు, మేయర్ ఆకుల సుజాత, కలెక్టర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ పాట పాడిన ఎంపీ కవిత నిజామాబాద్ రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో చీరెల పంపిణీ సందర్భంగా ఎంపీ కవిత బతుకమ్మ పాటలు పాడి అలరించారు. రామ రామ ఉయ్యాలో.. రామనీ శ్రీరామ ఉయ్యాలో..ఇద్దరక్కజెల్లెండ్లు ఉయ్యా లో.. ఒక్కూరికిచ్చిండ్రు ఉయ్యాలో..అని పాడడంతో మహిళలంతా చప్పట్లుకొడుతూ గొంతు కలిపారు.

మహిళా సంక్షేమానికి పెద్దపీట: కడియం మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి పేద మహిళ ను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో మహిళా సంఘాలద్వారా కోట్ల రూపాయల రుణాలను స్వల్పవడ్డీకే మంజూరు చేస్తున్నామన్నారు. ప్రతి సంక్షేమపథకంలో మహిళలనే భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు.

సబ్బండ వర్ణాల సంతోషమే ధ్యేయం:ఈటల సబ్బండవర్ణాల సంతోషమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సోమవారం కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్, హుజూరాబాద్, జమ్మికుంటలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేసి సమావేశాల్లో మాట్లాడారు. పండుగపూట ఆడబిడ్డలు సంతోషంగా ఉం డాలనే సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగకు చీరెలు ఇచ్చే కార్యక్రమం చేపట్టారన్నారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద గొప్ప పండుగ మరెక్కడా జరుగదని పేర్కొన్నారు. పండుగలు, పబ్బాలకు ఆడబిడ్డలను పిలిచి ఉన్నంతలో సారెపెట్టి సాగనంపే సంప్రదాయం తెలంగాణలో తప్పితే ప్రపంచంలో ఎక్కడా చూడబోమన్నారు.

వచ్చే ఏడాది అందరికీ మన రాష్ట్రచీరెలు: హరీశ్ ఉపాధి లేక ఆకలితో సతమతమవుతున్న చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు రాష్ట్రంలోని ప్రతి మహిళ పండుగకు కొత్త బట్టలు కట్టుకోవాలన్న ఉద్దేశంతోనే బతుకమ్మ చీరెలు అందిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్‌లో కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, హుస్నాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి మంత్రి హరీశ్ బతుకమ్మ చీరెలను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో బతుకాలని ప్రభుత్వం తరఫు న ముస్లిం, క్రిస్టియన్ల పండుగలకు కొత్త బట్టలు పంపిణీ చేశామని, ఇవ్వాళ తెలంగాణ అడపడుచులకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి అవసరమయ్యే కోటి చీరెలకుగాను చేనేత కార్మికులనుంచి 50 లక్షలు, సూరత్‌నుంచి 50 లక్షలు తెప్పించామన్నారు. వచ్చేఏడాది నుంచి ఇక్కడి నేతన్నలు నేసిన చీరెలనే అందిస్తామని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి చీరెల పంపిణీ చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.