Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆయకట్టు నిండుగ.. సాగు పండుగ

-ఆగిన వలసలు.. సొంతపొలాల్లో మళ్లీ నాగలి పడుతున్న రైతన్నలు -అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణ సాగునీటి రంగం -ఈ ఏడాది జలసిరులు కురిపించనున్న రీడిజైనింగ్ ప్రాజెక్టులు -నాలుగేండ్లలో సాగుకు మళ్లీ ప్రాణం పోసిన సర్కారు -కనీవినీ ఎరుగనిరీతిలో సాగునీటిరంగం పరుగులు -దేశానికే మార్గదర్శనం చేస్తున్న పనితీరు -అబ్బురపడిన జలసంఘం, నీతి ఆయోగ్ -ఏయేటికాయేడు పెరుగుతున్న ఆయకట్టు రూపకల్పన

నాలుగేండ్ల పసికూన తెలంగాణ సాగునీటిరంగంలో అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నది. ఆరు దశాబ్దాలపాటు వివక్షకు గురైన రంగం ఇప్పుడు దేశానికే తలమానికంగా నిలిచింది. పల్ల్లమెరిగే నీటిని ఒడిసి పట్టి పైనున్న బీడు భూములకు మళ్లిస్తున్నది. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న ఉమ్మడి రాష్ట్ర కడపటి ముఖ్యమంత్రి నిష్ఠూరాలతో కలత చెందిన తెలంగాణ సమాజం.. దేశంలోనే సాగునీటి రంగానికి అగ్రతాంబూలం ఇస్తున్నవైనంతో పొంగిపోతున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణాలకోసం నాలుగేండ్లుగా రేయింబవళ్లు జరుగుతున్న పనులు తెలంగాణ రైతాంగంలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. రాష్ట్ర ఆవిర్భావం.. సాగునీటిరంగంలో ప్రారంభమైన స్వర్ణయుగం తెలంగాణ భూములకు పట్టిన పడావు చీడను వదిలించింది. నిన్నటిదాకా దేశాలు పట్టుకు తిరిగిన రైతన్న ఆరుగాలం శ్రమిస్తూ సొంత ఊర్లోనే కంటినిండా నిద్రపోతున్నాడు. -1956 నాటికి తెలంగాణలో భారీ, మధ్యతరహా, చెరువుల కింద సాగవుతున్న ఆయకట్టు – 16.03 లక్షల ఎకరాలు -1956-2004 వరకు సాగునీటి కల్పన జరిగింది – 36.17 లక్షల ఎకరాలు -2004-2014 వరకు అదనంగా సాగునీటి కల్పన జరిగింది – 5.70 లక్షల ఎకరాలు (అదనంగా 92వేల ఎకరాల స్థిరీకరణ) -టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఆయకట్టుకు సాగునీటి కల్పన ప్రాజెక్టులవారీగా.. -భారీ ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టుకు సాగునీటి కల్పన – 8,60,563 ఎకరాలు (2,04,405 ఎకరాల స్థిరీకరణ) -మధ్యతరహా ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టుకు సాగునీటి కల్పన – 51,736 ఎకరాలు -కొత్త చెరువుల ఏర్పాటు ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీటి కల్పన – 60 వేల ఎకరాలు -లిఫ్టు స్కీంల ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీటి కల్పన – 1,23,146 ఎకరాలు, స్థిరీకరణ లక్ష ఎకరాలు -మొత్తం కొత్త ఆయకట్టుకు సాగునీటి కల్పన – 10,94,882 ఎకరాలు -మిషన్ కాకతీయ ద్వారా చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరణ – సుమారు 11.61 లక్షల ఎకరాలు -2018-19 లో కొత్త ఆయకట్టు లక్ష్యం – 9.43 లక్షల ఎకరాలు

స్వీయ పాలనలో నాలుగేండ్ల తెలంగాణ ప్రస్థానం కోటి ఎకరాల మాగాణం మజిలీవైపు దూసుకుపోతున్నది. అవకాశం ఉన్న ప్రతిచోటా జలాలను బీడు భూముల్లోకి మళ్లించేందుకు ప్రభుత్వం చేపడుతున్న భారీ, మధ్యతరహా, చిన్ననీటి తరహా ప్రాజెక్టులతో యావత్ తెలంగాణ పులకరించిపోతున్నది. దశాబ్దాలపాటు రూపుదిద్దుకోని ఆధునిక దేవాలయాల్ని రెండుమూడేండ్లలోనే కండ్లముందు ఆవిష్కరించడానికి జరుగుతున్న భగీరథయత్నానికి.. ఇరవై ఏండ్లపాటు గత ప్రభుత్వాలు వెచ్చించిన దానికంటే ఎక్కువ నిధులు నాలుగేండ్లలోనే ఖర్చయిపోయాయంటే తెలంగాణ సాగునీటిరంగ ముఖచిత్రం ఎంతగా మారిపోయిందో ఊహించవచ్చు. ఈ నేపథ్యంలో గత నాలుగేండ్లలో సాగునీటిరంగ పురోగతిపై ప్రత్యేక కథనం

ఐదేండ్లకు 22 లక్షల ఎకరాలు తెలంగాణ సాగునీటిరంగ ప్రస్థానాన్ని 1956 నుంచి పరిశీలిస్తే.. ఇన్ని దశాబ్దాలు ఒక ఎత్తయితే, గడిచిన నాలుగేండ్లు ఒక ఎత్తుగా కనిపిస్తుంది. సమైక్యపాలనలో తెలంగాణ సాగునీటిరంగం తీవ్ర అన్యాయానికి గురైందనేది చారిత్రక సత్యం. 1956 నాటికి భారీ, మధ్యతరహా, చెరువుల కింద 16.03 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేది. అప్పటి నుంచి 2004 వరకు కొత్తగా 36.17 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించింది.. ఆతర్వాత మరో దశాబ్దంపాటు అదనంగా సాధించిన కొత్త ఆయకట్టు కేవలం 5.70 లక్షల ఎకరాలు. 2014-2019 వరకు ఐదు సంవత్సరాల్లో ప్రతిపాదిత కొత్త ఆయకట్టుతో కలుపుకొని.. 21 లక్షల ఎకరాలకు పైగా సాగునీటి వసతి కల్పించడమనేది తెలంగాణ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం. అందుకే 2016లో వచ్చిన అసోచామ్ సర్వే మొదలు ఈ ఏడాది వచ్చిన పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చి అధ్యయనంలోనూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేయడాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు.

మలుపు తిప్పిన రీడిజైనింగ్ తెలంగాణ సాగునీటిరంగ చరిత్రలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ అనేది కీలక మలుపు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తక్కువ ముంపు, ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలవంటి బహుముఖ వ్యూహంతో సీఎం కేసీఆర్ రూపుదిద్దిన రీడిజైనింగ్‌తోనే కోటి ఎకరాల మాగాణం లక్ష్యంపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. రికార్డు సమయంలో భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తిచేయడం తెలంగాణ సర్కారు సాధించిన మరో ఘనత. పాత పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా పథకాల్ని పూర్తిచేసి ఇప్పటికే 6లక్షల ఎకరాలను కొత్తగా సాగులోకి తెచ్చారు. ఈ వానకాలంలో 8 లక్షల ఎకరాలకు సాగునీర్విడానికి ఏర్పాట్లుచేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు వరం ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ప్ర జాపనుల శాఖల్లో రూ.కోటి వరకు పనుల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు ఆరు శాతం కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇందుకోసం 200 మందిని ఎంపిక చేసి వారికి న్యాక్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని కూడా సంకల్పించింది.

నీటిపారుదల శాఖలోకి యువరక్తం ప్రాజెక్టుల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 984 మంది కొత్త ఇంజినీర్లను నియమించడంతో నీటిపారుదలశాఖలో యువరక్తం ప్రవేశించింది. 114 మంది ఎలక్ట్రికల్ ఇంజినీర్లను కూడా నియమించారు. -ఆగిన వలసలు.. -సొంతపొలాల్లో మళ్లీ నాగలి పడుతున్న రైతన్నలు -అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణ సాగునీటి రంగం -ఈ ఏడాది జలసిరులు కురిపించనున్న రీడిజైనింగ్ ప్రాజెక్టులు -నాలుగేండ్లలో సాగుకు కొత్త ఊపిరులు ఊదిన సర్కారు -కనీవినీ ఎరుగనిరీతిలో సాగునీటిరంగం పరుగులు -దేశానికే మార్గదర్శనం చేస్తున్న పనితీరు -అబ్బురపడిన జలసంఘం..నీతి ఆయోగ్ -ఏయేటికాయేడు పెరుగుతున్న ఆయకట్టు

ద్విముఖ వ్యూహం భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులలేమి లేకుండాచూసేందుకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నది. ఇందులో భాగంగా ఒకవైపు ఏటా బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లను కేటాయించడంతోపాటు వివిధ ఆర్థికసంస్థల నుంచి సాధ్యమైనంత మేర రుణాలు పొంది త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలోనే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులకోసం కార్పొరేషన్లను నెలకొల్పింది. ఈ కారణంగా నిధుల సమీకరణ వేగంగా జరుగుతుండటంతో నిమిషంపాటు కూడా పనులు నిలిచిపోకుండా ఏజెన్సీలు ముందుకు వెళుతున్నాయి.

పర్యాటక, విజ్ఞాన కేంద్రంగా కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో కాళేశ్వరం ప్రత్యేకం. రాష్ట్రంలో సామాన్యుడు మొదలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పలురంగాల ప్రముఖులు సైతం కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు పోటెత్తడంతో గత ఏడాది కాలంగా అదో పర్యాటక విజ్ఞాన కేంద్రంగా మారింది. ఏకంగా కేంద్ర జలసంఘం చైర్మన్‌తోపాటు సభ్యులు కూడా ఈ ప్రాజెక్టును సందర్శించి అబ్బురపడ్డారంటే దీని ప్రత్యేకత ఏమిటో అర్థంచేసుకోవచ్చు.

సాంకేతికంలో ఆకాశమే హద్దు వాట్సాప్ గ్రూపులతో నిరంతర సమాచార మార్పిడితోపాటు జియోట్యాగింగ్ ద్వారా రాష్ట్రంలోని 46వేలకు పైగా చెరువుల సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇస్రోతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతి సాగునీటి ప్రాజెక్టు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో, శాటిలైట్ చిత్రాల ద్వారా వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సాగునీటి సరఫరా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని లెక్కించే అశాస్త్రీయ విధానం నుంచి భూగర్భజలాలతోనూ పండించే పంటల వివరాల్ని సైతం శాటిలైట్ చిత్రాల ఆధారంగా సేకరిస్తున్నారు.

రాచకొండలో కృష్ణమ్మ పరవళ్లు భారీ ప్రాజెక్టు పనులను చేపట్టి చేతులు దులుపుకోవడం కాకుండా సాగునీటికి నోచుకోని ప్రాంతాలను అన్వేషించి, ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లతో సాగు విస్తీర్ణాన్ని పెంచడంపైనా తెలంగాణ సర్కారు దృష్టిసారిస్తున్నది. ఇందులో భాగంగానే అసలు కాల్వల ద్వారా సాగునీరు అసాధ్యం అనుకున్న రాచకొండ ప్రాంతానికి డిండి ఎత్తిపోతల పథకం విస్తరణలో భాగంగా కృష్ణాజలాల్ని తరలించేందుకు రాచకొండ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మునుగోడు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం పరిధుల్లోని చెరువులు వర్షంతో సంబంధం లేకుండా జలకళను సంతరించుకోనున్నాయి.

మిడ్ మానేరు ఓ మైలురాయి ఉమ్మడి ఆదిలాబాద్‌కు జలతోరణంఅపార సహజ వనరులు ఉన్నా… సమైక్య పాలనలో వివక్షకు గురైన ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు జల తోరణాన్ని సంతరించుకుంటున్నది. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులను దాదాపుగా పూర్తి చేసిన సర్కారు,ప్రాణహిత ప్రాజెక్టును జిల్లాకే పరిమితం చేసి2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నది. కడెం పూర్తిస్థాయి ఆయకట్టుకు శాశ్వత పరిష్కారం చూపింది. రూ.870 కోట్లతోకుప్టి ప్రాజెక్టును చేపడుతున్నది. చనాక-కొరాటలో అదనంగా మరో రెండు రిజర్వాయర్లనూ నిర్మించనున్నారు.

రివర్స్ వలసలతో కిటకిటలాడుతున్న గ్రామాలు గత రెండు సంవత్సరాలుగా వచ్చిన మార్పులతో పడావు పడిన భూముల్లో ఆకుపచ్చ తోరణాలు కనిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూలీలు ఇక్కడికి వలసలు వచ్చేలా తెలంగాణ గ్రామాలు ఆర్థిక పరిపుష్టిని సాధించాయి. కల్వకుర్తి ప్రాజెక్టు కింద వేలాది చెరువులను నింపారు. వనపర్తి జిల్లా గణప సముద్రానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఘనపురం బ్రాంచి కెనాల్ ద్వారా నీటిని విడుదలచేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలో చేపడుతున్నారు. రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) 55, 600 ఎకరాల ఆయకట్టుకు జీవం పోసే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి.

మొదలుకానున్న కాళేశ్వర అధ్యాయం తెలంగాణ సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టుది సరికొత్త అధ్యాయం. 14 జిల్లాల ముఖచిత్రాన్ని మార్చే ఈ పథకం పనుల వేగంలో రికార్డులను సృష్టిస్తున్నది. కేంద్రం నుంచి అనుమతులు రాబట్టడంలోనూ సరికొత్త రికార్డును లిఖించిన కాళేశ్వరం, ఈ ఏడాదిలోనే గోదావరిజలాలను ఎత్తిపోసేందుకు సిద్ధమవుతున్నది. రోజుకు 40 వేల కార్మికులు, ఆధునిక యంత్రాలతో సాగుతున్న పనులు దేశ నిర్మాణ రంగంలో రికార్డును లిఖించగా, ప్రపంచ రికార్డు దిశగా పరుగులు తీస్తున్నాయి. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు ఈ వానకాలంలోనే గోదావరిజలాలను తరలించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు ఎస్సారెస్పీ వరదకాల్వ నుంచి ఎగువకు నీటిని తరలించి శ్రీరాంసాగర్‌కు కూడా జలకళను సంతరింపజేసేందుకు ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని చేపట్టింది. ఈ ఏడాదిలోనే రెండు పథకాలూ అందుబాటులోకి రానుండటంతో కాళేశ్వర నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సంవత్సరంగా 2018.. చరిత్రలో నిలిచిపోనున్నది.

నీటి నిర్వహణలో మిషన్ విప్లవం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న మిషన్ కాకతీయ.. నీటి నిర్వహణలోనే ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఈ కార్యక్రమం గొప్పతనం, ఫలితాల్ని ఇటీవల నీతి ఆయోగ్ తన నివేదికలో అక్షరరూపంలో వెల్లడించడం విశేషం. సాగునీరు అందని 63 శాతం గ్యాప్ ఆయకట్టుకు చెరువుల ద్వారా నీటి లభ్యత పెరిగిందని ఆయోగ్ స్పష్టంచేసింది. దీని ఫలితంగానే సాగువిస్తీర్ణం, పంట దిగుబడులు సైతం పెరిగాయని చెప్పింది. పూడికతీత కారణంగా చెరువుల నిల్వ సామర్థ్యంతోపాటు సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపింది. చారిత్రక చెరువుల పునరుద్ధరణతోపాటు కొత్త చెరువుల నిర్మాణానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

పెరిగిన ఆయకట్టు.. అధికమైన దిగుబడి ఒకవైపు కొత్త, ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టించడమే కాదు.. పాత ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న సాగునీటిని మెరుగ్గా సరఫరా చేసి, ఎక్కువ ఆయకట్టును సాగులోకి తీసుకురావడమనేది ముఖ్యం. తెలంగాణ నీటిపారుదలశాఖ ఈ నాలుగేండ్లలో ఆ కోణంలో పరుగులు తీసింది. సాగర్ ఎడమ కాల్వ కింద నీటి వినియోగ సామర్థ్యం గణనీయంగా పెరుగడమే సజీవసాక్ష్యం. అంతేకాదు దిగుబడిలోనూ ఇక్కడ ఎకరాకు వరి 35 బస్తాల నుంచి 50 బస్తాలకు పెరుగడమనేది కూడా ఒక రికార్డు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.