Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బలవర్ధకమైన ఆహారాన్ని ఇచ్చే పంటలు పండించాలి

-అమ్మగలిగేవే పండించాలి.. అప్పుడే లాభసాటిగా సాగు
-రాష్ర్టానికి అవసరమైన ఆలుగడ్డ, ఉల్లి సాగు చేయాలి
-దిగుమతయ్యే పండ్లు, కూరగాయలు ఇక్కడే పండాలి
-వ్యవసాయ అధికారులు, నిపుణులతో సీఎం కేసీఆర్‌
-నిపుణులు, నిష్ణాతులతో అగ్రికల్చర్‌ ప్రొడక్ట్స్‌ కమిటీ
-సాగులో మార్పులపై సూచనకు అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ కమిటీ
-పత్తి రైతులకు కాటన్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌
-ఆహార భద్రత సాధించాం పోషకాహార భద్రత లేదు

‘రాష్ట్రంలో ప్రజలు నిత్యం తినే పండ్లు, కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నాం. ఏయే రకాల పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నామో వాటిని మన రాష్ట్రంలోనే పండించాలి. పండ్లు, కూరగాయల విషయంలో స్వయంసమృద్ధి సాధించే ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలి’‘ఉల్లిగడ్డల లభ్యత, ధరల విషయంలో ప్రతి ఏడాది అనిశ్చితి, అస్పష్టత నెలకొంటున్నది. తెలంగాణ అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు ఇక్కడే జరుగాలి. ఎప్పుడూ కొరత లేకుండా చూసే వ్యూహం అవలంబించాలి’

రాష్ట్ర రైతాంగం మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే సాగుచేసే అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని సీఎం చెప్పారు. దీనికోసం వ్యవసాయశాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతంచేయాలని కోరారు.

ఈ సారి వానకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇది ఏటా.. ప్రతి సీజన్‌లో కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు. దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించగలిగినప్పటికీ, పోషకాహార భద్రత మాత్రం సాధించలేదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏది పడితే అది తింటున్నారు తప్ప, బలవర్ధకమైన ఆహారం తినడంలేదన్నారు. బలవర్ధకమైన ఆహారాన్ని ఇచ్చే పంటలు పండించాలని సీఎం చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలతోపాటు, రోగ నిరోధకశక్తి పెరుగాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలో ఓ పద్ధతి ప్రకారం పంటలను సాగుచేయడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారుచేసేందుకు సీఎం కేసీఆర్‌ మూడురోజులపాటు వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పత్తి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. పత్తి నాణ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లులపై అధ్యయనం చేయాలని చెప్పారు. సమావేశాల్లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, ఆగ్రో బిజినెస్‌ కన్సల్టెంట్‌ గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయశాఖ అధికారులకు సీఎం కేసీఆర్‌ చేసిన సూచనలు..
-రాష్ట్రంలో, దేశంలో ప్రజల ఆహార అలవాట్లపై అధికారులు కచ్చితమైన అంచనాలు రూపొందించాలి. ఏ ప్రాంతంలో ఏ ఆహార పదార్థాల అవసరం ఉన్నదో గమనించాలి. ప్రపంచంలో ఏ పంటకు డిమాండ్‌ ఉన్నదో తెలుసుకోవాలి. ఆ మేరకు రాష్ట్రంలో పంటలు సాగవ్వాలి. ఇది నిరంతరం కొనసాగాలి. ఇందుకు ప్రభుత్వం..
–నిపుణులతో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీని నియమిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్‌ మార్కెటింగ్‌ ధరలు వంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఏ పంటలు వేయడం వల్ల లాభమో సూచిస్తుంది. దాని ప్రకారం పంటల సాగు చేపట్టాలి.
-వ్యవసాయంలో ఉత్పాదకత పెరుగడం చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆధునిక సాగుపద్ధతులను అవలంబించాలి. ఎరువు లు, పురుగుమందుల వాడకంలోనూ శాస్త్రీయత ఉండాలి. మేలురకం విత్తనాలు వేయా లి. సాగులో యాంత్రీకరణ పెరుగాలి. అందు కు అనుగుణంగా సాగుజరుగాలి. ఈ విషయాలపై ఎప్పటికప్పుడు అధ్యయనంచేస్తూ, తగు సూచనలు ఇవ్వడానికి ప్రభు త్వం అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ కమిటీని నియమిస్తుంది.
-తెలంగాణలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలున్నాయి. ఏ నేలలు ఏ పంట సాగుకు అనువైనవో తేల్చాలి. దానికి అనుగుణంగా పంట ల సాగు చేపట్టాలి. పంటల కాలనీల ఏర్పాటుకోసం నేలల విభజన చేయాలి. ఈ వివరాలను రైతులకు తెలుపాలి.
-రాష్ట్రంలో ప్రజలు నిత్యం తినే పండ్లు, కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నాం. ఏయే రకాల పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నామో లెక్కలు తీయాలి. వాటిని మన రాష్ట్రంలోనే పండించాలి. పండ్లు, కూరగాయల విషయంలో స్వయంసమృద్ధి సాధిం చే ప్రణాళిక రూపొందించి అమలుచేయాలి.
-రాష్ట్రంలో కొత్తగా అనేక ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయి. మిషన్‌ కాకతీయతో చెరువుల నీటి సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. 24 గంటల ఉచిత విద్యుత్‌ వల్ల బోర్ల ద్వారా సాగు పెరిగింది. దీంతో ప్రతి ఏటా కొత్తగా ఆయకట్టు పెరుగుతూ వస్తున్నది. పెరిగిన/పెరిగే విస్తీర్ణాన్ని సరిగ్గా అంచనా వేస్తూ, పంటల సాగు ప్రణాళికలు తయారుచేయాలి.
-ఉద్యానశాఖను మారిన పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దాలి.
-సరైన పంటల లెక్కల నమోదుకు ప్రత్యేకంగా స్టాటిస్టికల్‌ విభాగం ఏర్పాటు చేయాలి.
-తెలంగాణలో పత్తి పంట ఎక్కువ పండిస్తున్నారు. పత్తిలో ఉత్పాదకత పెంచడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? ఏ రకమైన పత్తికి మార్కెట్‌ ఉన్నది? అలాంటి పత్తి సాగుచేయాలంటే ఏంచేయాలి? తదితర విషయాలను అధ్యయనంచేసి, తగు సూచనలు ఇవ్వడానికి, పత్తి రైతులకు చేదోడు వాదోడుగా ఉండడానికి ప్రభుత్వం కాటన్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నది.
-తెలంగాణలో పండే పత్తికి మంచి డిమాండ్‌ ఉన్నది. నూలు పొడవు ఎక్కువ ఉండటం వల్ల మంచి ధర వస్తుంది. పత్తిలో మట్టి, పుల్లలు, ఇతర చెత్త కలువడం వల్ల సరుకులో నాణ్యత (ఫెయిర్‌ యావరేజ్‌ క్వాలిటీ – ఎఫ్‌ఏక్యూ) శాతం పడిపోయి ధర తగ్గుతున్నది. కష్టపడి పంట పండించే రైతులు పత్తి ఏరిన తర్వాత అందులో చెత్త కలువకుండా జాగ్రత్తపడాలి. ఈ విషయంలో వారికి అవగాహన కల్పించాలి.
-రాష్ట్రంలో జిన్నింగ్‌ మిల్లులు, స్పి న్నింగ్‌ మిల్లుల సామర్థ్యంపై కచ్చితమైన అంచనాలు వేయాలి. అవి సరిపోను ఉన్నాయా? ఇంకా నెలకొల్పాలా? అన్నదానిపై శాస్త్రీయమైన అంచనా ఉండాలి. పత్తి పం డే ప్రాంతాల్లోనే ఇవి నెలకొల్పడం వల్ల రవాణా, ఇతర వ్యయప్రయాసలు కూడా తప్పుతాయి.
-పట్టణ ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల అవసరం ఎక్కువగా ఉం టుంది. అందుకే పట్టణ ప్రాంతాల పరిసరాల్లోని భూముల్లో పండ్లు, కూరగాయల సాగుకు అనువైన నేలలను గుర్తించి, రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుంది.
-ఉల్లిగడ్డల లభ్యత, ధరల విషయంలో ప్రతి ఏడాది అనిశ్చితి, అస్పష్టత నెలకొంటున్నది. ఇలా ఎందుకుండాలి? ప్రజల అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు ఇక్కడే జరుగాలి. ఎప్పుడూ కొరత లేకుండా వ్యూహం అవలంబించాలి.
-చిక్కుడు, మునగలో పోషకాలు ఉన్నాయి. ఎక్కువగా తినేలా ప్రజలను చైతన్యపరచాలి. వాటి సాగు పెంచాలి.
-ఆలుగడ్డలు, అల్లం, ఎల్లిపాయలను ప్రజలు ఎక్కువగా వాడుతారు. వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలోనే వాటిని పండించాలి. ఎక్కడ పండించాలి? మేలైన సాగు పద్ధతులేంటి? తదితర విషయాలపై రైతులకు మార్గదర్శనం చేయాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.