Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బల్దియాలో గెలుపు మాదే..

రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోకపోవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ టీఆర్‌ఎస్ అలాంటి పార్టీ కాదు. హిందువులకు భగవద్గీత, క్రిస్టియన్లకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎంత పవిత్రమో.. టీఆర్‌ఎస్‌కు ఎన్నికల మ్యానిఫెస్టో అలాంటిదని ప్రకటించిన ఘనత మా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టని అంశాలను కూడా అమలు చేస్తున్నది. హాస్టల్ పిల్లలకు సన్నబియ్యం, బోనాలు, బతుకమ్మ, రంజాన్, క్రిస్మన్ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. దేవాలయాలు, మసీదులు, చర్చిల మరమ్మతులకు నిధులిస్తున్నది. గతంలో పాలించిన ఏ పార్టీలైనా ఇట్లా చేశాయా? కేసీఆర్ నాయకత్వంలో మేము జనరంజకమైన పాలన అందిస్తున్నాం.

Jogu-Ramanna-interview-with-Namasthe-Telangana -అడుగాల్సిన అవసరం లేదు.. కేసీఆర్‌ను చూసే ప్రజలు ఓట్లేస్తరు.. -బీసీల సంక్షేమానికి కూడా ఎన్నో చర్యలు చేపట్టాం -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి జోగు రామన్న

కాబట్టి గ్రేటర్ ఎన్నికల్లో ప్రత్యేకించి మేం ఓట్లడుగాల్సిన అవసరం లేదు. సీఎం కేసీఆర్‌ను చూసే ఓట్లు పడుతయ్..ఆయన నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు స్వచ్ఛందంగానే ఓట్లువేసి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారు అని రాష్ట్ర పర్యావరణ, అటవీ, బీసీ శాఖల మంత్రి జోగు రామన్న ధీమా వ్యక్తం చేశారు. బల్దియా ఎన్నికల సందర్భంగా సనత్‌నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్‌పేట డివిజన్ టీఆర్‌ఎస్ పరిశీలకులుగా వ్యవహరిస్తున్న ఆయన నమస్తే తెలంగాణకు ఇంటర్వ్యూ ఇస్తూ, గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని అన్నారు. తన అభిప్రాయాలను ఈ విధంగా వెల్లడించారు.

మా పార్టీ మేయరే ఉంటారు.. సీఎం, మంత్రులంతా హైదరాబాద్‌లో ఉంటారు. పరిపాలన యంత్రాంగమంతా ఇక్కడ్నే ఉంటది. ఇటువంటి చోట టీఆర్‌ఎస్ మేయర్ ఉండొద్దా? కచ్చితంగా మా పార్టీ అభ్యర్థే నగర మేయర్‌గా ఉండాలని కోరుకుంటాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుంది. ఎవరి సహకారం, పొత్తు లేకుండానే గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురవేస్తాం.

ఎన్నికలను ఎన్నికలుగానే చూడాలి.. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకోసం కష్టపడ్డవారిని, తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టామన్నది అవాస్తవం. ఎన్నికలను ఎన్నికలుగానే చూడాలి. ఎన్నికల్లో గెలువగల అభ్యర్థులనే నిలబెడుతున్నాం. ఒక్కో డివిజన్‌కు 20 మంది అభ్యర్థులు టికెట్ కోసం పోటీపడ్డరు. కానీ అందరికి టికెట్ ఇవ్వలేం కదా. గెలుస్తారని సర్వేల్లో తేలిన వారికే టికెట్లిచ్చాం.

మాకు కాక ఇంకెవ్వరికి ఓట్లేస్తరు.. హైదరాబాద్‌ సహా యావత్ తెలంగాణ అభివృద్ధి కోసం కృషిచేస్తున్న టీఆర్‌ఎస్‌కు కాక ప్రజలు ఇంకెవ్వరికి ఓట్లేస్తరు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే మాకు గెలుపునకు తోడ్పడుతాయి. పించన్లు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఇలా ఎన్నో పథకాలు చెప్పొచ్చు. బీసీ కార్పొరేషన్ రుణాల్లో రాయితీని పెంచాం. నాయిబ్రాహ్మణులకు విద్యుత్ బిల్లులు మాఫీ చేశాం, 1200 కోట్ల భారాన్ని భరిస్తున్నాం. దోభీఘాట్లు కట్టిస్తున్నాం.

అత్యాధునికంగా వాషింగ్ మిషన్లను రాయితీపై అందిస్తున్నాం. రుణాలకు ఒక్కో యూనిట్ కాస్ట్ గతంలో రూ. 5 లక్షలుంటే దానిని రూ.10 లక్షలకు పెంచాం. యువతకు ఉద్యోగాల కోసం ఎన్నోచర్యలు తీసుకొంటున్నాం. బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి వాటికి పక్కా భవనాలు నిర్మిస్తున్నాం. నోటిఫికేషన్లు జారీ అయినప్పుడే గాకుండా అవి నిరంతరంగా పనిచేసే ఏర్పాట్లు చేస్తున్నాం. వాటిని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం. లక్ష ఉద్యోగావకాశాలు కల్పించేలా పలు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నాం.

కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి కాలుష్యం, చెట్ల నరికివేతతో రాజధాని నగరంలో స్వచ్ఛమైన గాలి దొరికే పరిస్థితి లేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. పర్యావరణ, అటవీశాఖల మంత్రిగా నేనూ నగరవాసులకు స్వచ్ఛమైన గాలి అందాలని, ప్రజలంతా ఆరోగ్యంగా జీవించాలని కోరుకొంటూ అందుకు కృషి చేస్తున్నా. లంగ్‌స్పేస్ కోసం గ్రేటర్‌లో 60 ఫారెస్ట్ బ్లాక్‌లను గుర్తించాం. ఈ బ్లాక్‌ల్లో స్వచ్ఛమైన గాలి లభించేలా మొక్కలను పెంచుతున్నాం. సైక్లింగ్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నాం. నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నాం. కాలుష్య నియంత్రణ మండలి పనితీరును మెరుగుపరుస్తున్నాం.

పాతబస్తీలోనూ గట్టిపోటీనిస్తాం.. పాతబస్తీని గతంలో పాలించిన వారు వదిలేశారేమో కానీ మేం అట్లా చేయదలుచుకోలేదు. అక్కడ కూడా మా పార్టీకి మంచి ఆదరణ ఉన్నట్లు సర్వేల్లో తేలింది. కాబట్టి అక్కడ కూడా పోటీ చేస్తున్నాం. బలమైన అభ్యర్థులనే నిలబెడుతున్నాం. పాతబస్తీలో కూడా గట్టిపోటీ ఇచ్చి మంచి ఫలితాలను సాధిస్తాం.

టీడీపీ, బీజేపీ ఏమని ఓట్లడుగుతయ్.. తెలంగాణను అడ్డుకున్నామనా.. సెక్షన్ 8 పెట్టమన్నామనా.. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను తన్నుకుపోయామనా.. న్యాయంగా ఇవ్వాల్సిన కరెంట్‌ను ఇవ్వలేదనా.. టీడీపీ ఏ లెక్కన ఓట్లడుగుతది. ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న బీజేపీ కూడా ఏమని ఓట్లడుగుతది. ఏమని ప్రజల వద్దకు పోతయ్. రాష్ర్టానికి కేంద్రం ఏమిచ్చిందని బీజేపీకి ఓటేయాలి. ఎంత చెప్పినా రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ గల్లంతే. బీజేపీ ఉనికి ప్రశ్నార్థకమే.

ప్రతిపక్షాలకు అభ్యర్థులే దొరుకడం లేదు.. ఈమధ్య ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులే దొరుకడం లేదు. గ్రేటర్‌లో కూడా పరిస్థితి అంతే ఉన్నది. ఇటువంటిది నేనెప్పుడు చూడలేదు. ఎంఎల్‌సీ ఎన్నికల్లో ఆరింటిని ఏకగ్రీవంగా గెలుచుకున్నం. జీహెచ్‌ఎంసీలో మా విజయం ఖరారైంది. భారీ మెజార్టీతో 100 కు పైగా డివిజన్లను గెలుచుకోబోతున్నం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.