Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బండిది సిగ్గులేని దీక్ష!

-ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ మళ్లీ దీక్షలా?
-మోదీ చెప్పిన ఏటా రెండు కోట్ల కొలువులేవి?
-ప్రభుత్వ సంస్థలను అమ్మి బడుగులకు అన్యాయం
-బీజేపీ రాష్ర్టాల్లో ఉద్యోగాలపై శ్వేతపత్రం తెప్పిస్తరా?
-రికార్డుస్థాయిలో పేదరికం, నిరుద్యోగం పెంచారు
-శాఖలవారీగా వివరాలిచ్చిన ఘనత కేసీఆర్‌ పాలనది
-పకోడీలు అమ్ముకోవడమూ ఉద్యోగమేనన్నది మీరే
-బహిరంగ లేఖలో మంత్రి కేటీఆర్‌ ధ్వజం


ప్రభుత్వరంగంలో 1.33 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా? విప్లవాత్మక టీఎస్‌-ఐపాస్‌ విధానంతో రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేటురంగంలో సుమారు 16 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించింది మేము కాదా? తెలంగాణ అకాడమీ ఆఫ్‌ సిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)ను ఏర్పాటుచేసి మూడు లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చింది మేము కాదా? టీ-ఐడియా, టీ-ప్రైడ్‌ వంటి విధానాలతో స్వయంగా పారిశ్రామిక యూనిట్లు పెట్టుకోవటాన్ని ప్రోత్సహిస్తున్నది మేము కాదా? కోట్ల మందికి జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసింది మేము కాదా?

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టింది నిరుద్యోగ దీక్ష కాదని, సిగ్గులేని దీక్ష అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. రాజకీయ అవకాశవాదంతోనే దీక్ష తలపెట్టారని మండిపడ్డారు. బండి దీక్ష చేసేముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏడేండ్లలో యువతకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ప్రధాని మోదీ ఏ గంగలో కలిపారని ప్రశ్నించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్‌ ఆదివారం బహిరంగ లేఖను విడుదల చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో, అందులో తెలంగాణ యువతకు దకిన ఉద్యోగాలెన్నో లెక చెప్పే దమ్ముందా? అని సంజయ్‌ని నిలదీశారు. కొలువుల కల్పవల్లిగా వర్ధిల్లుతున్న హైదరాబాద్‌కు ఉన్న అద్భుత అవకాశమైన ఐటీఐఅర్‌ ప్రాజెక్టును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. లక్షల ఐటీ ఉద్యోగాలకు గండికొట్టి, యువత నోట్లో మట్టికొట్టింది చాలక మళ్లీ సిగ్గూఎగ్గూ లేకుండా దీక్షలకు దిగుతారా? అంటూ మండిపడ్డారు. బండి దీక్షలను, కపట ప్రేమను చూసి అవకాశావాదమే సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. యువతను నమ్మించి నట్టేట ముంచిన ద్రోహ చరిత్ర బీజేపీదని, కేంద్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగిత
రేటు గత 40 ఏండ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగిపోయిందని, ఇదే మీరు సాధించిన ఘనత అని ఎద్దేవాచేశారు. డీమానిటైజేషన్‌, జీఎస్టీ నిర్ణయాలతో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా? అని ప్రశ్నించారు.

రూ.20 లక్షల కోట్లలో ఒక్క రూపాయీ ఇవ్వలేదు
కరోనా సంక్షోభ సమయంలో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని గొప్పలు చెప్పి, ఒక రూపాయి సాయం కూడా చేయని భారతీయ జుమ్లా పార్టీ మీది అని కేటీఆర్‌ విమర్శించారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోగానీ కల్పించిన ఉద్యోగాలు, ఇచ్చిన నోటిఫికేషన్లు, ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? అని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కంటే ఎకువ ఉద్యోగాలిచ్చారా? అని నిలదీశారు. యువతను రెచ్చగొట్టి, ఉద్యోగ ప్రయత్నాల నుంచి వారి దృష్టి మళ్లించే కుట్రలో భాగమే సంజయ్‌ దొంగ దీక్ష అని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో దీక్ష చేయాలని సవాల్‌ విసిరారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పిడికెడు ఉద్యోగాల కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకొనేందుకు వస్తే వారిపై లాఠీచార్జి చేసిన దుర్మార్గం కనిపించలేదా? అని నిలదీశారు.

కేంద్రాన్ని గల్లా పట్టుకొని నిలదీయాలి
తమ ప్రభుత్వం హామీ ఇచ్చినదానికన్నా ఎక్కువ ఉద్యోగాలిచ్చిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బండి సంజయ్‌ ప్రశ్నించాల్సింది తమ ప్రభుత్వాన్ని కాదని, లక్షల ఉద్యోగాలను పెండింగ్‌లో పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకొని నిలదీయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 15 లక్షల ఖాళీలను ఇంతకాలం ఎందుకు భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలని డిమాండ్‌చేశారు. హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని చేతకానితనంపై ఇందిరాపారు సాక్షిగా సంజయ్‌ ముకునేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రశ్నించే నైతిక హకు బీజేపీకి లేదని స్పష్టంచేశారు. తెలంగాణ యువతతో తమకున్నది పేగు బంధమని, అతి తకువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేటులోనూ ఉద్యోగాలిచ్చాం
రాష్ట్రంలో ఏటా లక్షల మంది కాలేజీల నుంచి డిగ్రీలతో బయటికి వస్తున్నారని, వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అలాగని కేంద్రంలా తాము బాధ్యత నుంచి తప్పించుకోలేదని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం ప్రభుత్వరంగంతోపాటు ప్రైవేటు రంగంలో లక్షలమందికి ఉపాధి కల్పించిందని తెలిపారు. ‘ప్రభుత్వరంగంలో 1.33 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా? విప్లవాత్మక టీఎస్‌-ఐపాస్‌ విధానంతో రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేటురంగంలో సుమారు 16 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించింది మేము కాదా? తెలంగాణ యువతకు అత్యధిక ఉద్యోగాలు దకేలా తెలంగాణ అకాడమీ ఆఫ్‌ సిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)ను ఏర్పాటుచేసి మూడు లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చింది మేము కాదా? టీ-ఐడియా, టీ-ప్రైడ్‌ వంటి విధానాలతో స్వయంగా పారిశ్రామిక యూనిట్లు పెట్టుకోవటాన్ని ప్రోత్సహిస్తున్నది మేము కాదా? కోట్ల మందికి జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసింది మేము కాదా? గ్రామీణ ప్రాంతాల్లోని తకువ చదువుకున్న నిరుద్యోగ యువతతోపాటు, కులవృత్తులపై ఆధారపడిన లక్షలమంది తమ కాళ్లపై తాము నిలబడేలా చేయూతనందించే కార్యక్రమాలు చేపట్టింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

పెట్టుబడులకు హైదరాబాద్‌ను స్వర్గంగా మార్చిందెవరు?
ఎర్ర బస్సు నుంచి ఎయిర్‌ బస్‌ దాకా, ట్రాక్టర్‌ నుంచి హెలికాప్టర్‌ దాకా, యాప్స్‌ నుంచి యాపిల్‌ మ్యాప్స్‌ దాకా హైదరాబాద్‌ను పెట్టుబడిదారుల డెస్టినేషన్‌గా మలుస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘హైదరాబాద్‌ నగరాన్ని పెట్టుబడుల స్వర్గంగా, ఉద్యోగ ఉపాధి దుర్గంగా నిలబెట్టింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమైతే, ఇకడి యువత కోసం చేపట్టిన భారీ పారిశ్రామిక పారులకు, ఉద్యోగ ఉపాధి ప్రయత్నాలకు ఒకపైసా అదనపు సాయం చేయని దుర్మార్గపు సరారు మీది. 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే దకేలా నూతన జోనల్‌ విధానాన్ని తీసుకొచ్చిన భూమి పుత్రుల ప్రభుత్వం మాదైతే, కొత్త జోనల్‌ విధానాన్ని ఆమోదించకుండా నెలలకు నెలలు ముప్పుతిప్పలు పెట్టిన కపట నీతి కేంద్ర ప్రభుత్వానిది’ అని మండిపడ్డారు.

ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతున్నది మీరు కాదా?
మోదీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను అడ్డికి పావుశేరు లెకన తెగనమ్ముతున్నదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ‘కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు, ఉన్న ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌/ సీఆర్‌ఎస్‌ ఇచ్చి ఇంటికి పంపుతున్న పాపపు పాలన మీది కాదా? ఇన్నాళ్లు ఉద్యోగాలిచ్చిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డల రిజర్వ్‌డ్‌ ఉద్యోగాలను ఎగురగొట్టిన పాపం మీకు కాక ఇంకెవరికి తగులుతుంది? ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలాగా పాలనచేస్తూ ఉన్నవాటిని అమ్ముకొంటున్న మీరెకడ? ప్రైవేటీకరణ చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తున్నా ఆర్టీసీ, విద్యుత్తు, సింగరేణి లాంటి సంస్థలను కాపాడుకొంటున్న తెలంగాణ ప్రభుత్వం ఎకడ?’ అని పేర్కొన్నారు. బీజేపీ పాలిత ఉత్తరాది రాష్ట్రాల్లో ఉపాధి లేక లక్షల మంది బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వస్తున్నది నిజం కాదా? అని బండి సంజయ్‌ని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణకు రివర్స్‌ మైగ్రేషన్‌ నిజం కాదా? అని నిలదీశారు.

ఇందిరాపారు సాక్షిగా ముకునేలకు రాయి
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ కల్పన కోసం హైదరాబాద్‌ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పారు, మెడికల్‌ డివైసెస్‌ పారు, మెగా పవర్‌లూమ్‌ పార్‌, వీవింగ్‌ పార్‌ వంటి మరెన్నో పారిశ్రామిక పారులను చేపట్టినా, ఒకదానికీ అదనపు సహాయం తీసుకురాలేని చేతకాని బండి సంజయ్‌ అని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ‘ఐటీఐఆర్‌, బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వంటి హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని మీ చేతకానితనంపై ఇందిరాపారు సాక్షిగా ముకునేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పండి. పారిశ్రామిక ప్రగతి కోసం తెలంగాణకు ఇచ్చిన ఒకటంటే ఒక ప్రోత్సాహం ఏమైనా ఉన్నదా? నిరుద్యోగులకు, రాష్ట్ర యువతకు ఏ సాయమూ చేయలేని మీ చేతగానితనానికి, నిస్సహాయతకు క్షమాపణ కోరండి. లేకుంటే ‘ఉల్టా.. చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అని జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు’ అని హితవు పలికారు.

పేదరికాన్ని పెంచిన ఘనత బీజేపీదే
నిజం నిప్పులాంటిదని, దాన్ని దాచాలని ప్రయత్నిస్తే చేతులు కాలిపోతాయని బండి సంజయ్‌ని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చటానికి, అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ యువతను రెచ్చగొట్టడానికే దీక్ష చేపట్టారని విమర్శించారు. కేంద్రం తన అస్తవ్యస్త విధానాలతో దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని రికార్డు గరిష్ఠస్థాయికి తీసుకెళ్లిందని ఆరోపించారు. కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి, మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఉపాధి కల్పనకు నెలవుగా మారిన తెలంగాణలో మీకు చేయడానికి రాజకీయ ఉద్యోగం లేక చేపట్టిందే నిరుద్యోగ దీక్ష’ అని విమర్శించారు.

అచ్చే దిన్‌ ఆశ చూపి ఏం చేశారు?
దేశానికి, యువతకు ‘అచ్చే దిన్‌’ అంటూ అశ చూపి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ, నిరుద్యోగ యువతకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌చేశారు. ఏ వివరాలు అడిగినా ‘డాటా లేదు.. తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయాం..’ అని తప్పించుకొని తిరిగే నో డాటా ఎవైలబుల్‌ (ఎన్‌డీఏ) సర్కారు మీది కాదా? అని బండి సంజయ్‌ని సూటిగా ప్రశ్నించారు. ‘లెకా పత్రం లేని, జవాబుదారీతనం లేని దికుమాలిన పాలన చేసే మీరు మమ్మల్ని ప్రశ్నించడమా? ఉద్యోగాల కల్పనపై శాఖలవారీగా వివరాలన్నీ ప్రజల ముందు పెట్టిన తమ నిబద్ధత ముందు పకోడీలు వేసే పనిని కూడా ఉద్యోగంగా చూపిన మీ మోదీ పాలన సాటి వస్తుందా? అని కేటీఆర్‌ నిలదీశారు. కేంద్రంలో ఏడేండ్లుగా అధికారంలో ఉన్న మీ ప్రభుత్వం వల్ల తెలంగాణ యువతకు అందిన పిసరంత సాయమేదైనా ఉన్నదా?’ అని సూటిగా ప్రశించారు.

ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి
తెలంగాణ యువత అకాంక్షలను సంపూర్ణంగా అర్థం చేసుకున్న ప్రభుత్వం తమదని, ఉపాధి కల్పనలో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించే చర్యలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టంచేశారు. ఈ విషయంలో రాజకీయ లబ్ధి కోసం చేసే అసత్య ప్రచార ప్రభావానికి లోనుకాకుండా విజ్ఞతతో అలోచించాలని రాష్ట్ర యువతకు పిలుపునిచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.