Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బతుకమ్మ చీరెతో భరోసా

-నేతన్నల జీవితాల్లో ధీమా పెంచిన చీరెలు
-వంద వెరైటీల్లో చీరెల తయారీ
-జిల్లాలకు చేరిన 50 లక్షల చీరెలు
-త్వరలోనే ఆడబిడ్డలకు పంపిణీ

TRS Government striving hard to give brand image to Bathukamma sarees

బతుకమ్మ చీరెలు బతుకును మార్చాయి. బతుకమ్మ చీరె కొంగు బంగారంగా మారింది. సీఎం కేసీఆర్ ఆడబిడ్డకు అందిస్తున్న కానుక.. నేతన్నల జీవితాల్లో భరోసాను కల్పించాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. సరికొత్త జీవితాన్ని అందించాయి. వారి కండ్లల్లో నిజమైన ఆనందం తొణికిసలాడుతున్నది. తెలంగాణ ఆడపడుచుల జీవితాలకు వెలుగులు నింపుతున్న రంగుల పూల బతుకమ్మ చీరెలపై ప్రత్యేక కథనం.

తెలంగాణలో ప్రతిఇంటా ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరెలను కానుకగా అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెండేండ్లుగా అమలుచేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సిరిసిల్లలో చీరెల తయారీ చురుగ్గా సాగుతున్నది. మొత్తం 1.02 కోట్ల చీరెలు అవసరం ఉండగా ఇప్పటికే 50 లక్షల చీరెలు జిల్లాలకు చేరాయి. ఈ నెలలో వీటిని పంపిణీ చేయనున్నారు. బతుకమ్మ చీరెల పంపిణీకి గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, గ్రామ మహిళా సంఘం ఆఫీస్ బేరర్, రేషన్‌షాపు డీలర్లతో కమిటీ ఉన్నది. పట్టణాల్లో వార్డుస్థాయిలో కమిటీలో భాగంగా బిల్ కలెక్టర్, వార్డు మహిళాసంఘం ఆఫీసు బేరర్, రేషన్ షాపు డీలర్లు సభ్యులుగా ఉంటారు. 2017లో 95.48 లక్షల చీరెలు పంపిణీచేయగా, 2018లో 99.02 లక్షలు పంపిణీచేశారు.

వినూత్నంగా డిజైన్‌ల ఎంపిక
చీరెలు అందరు మెచ్చేవిధంగా ఉండటానికి చేనేత, జౌళి శాఖ అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. మెప్మా, సెర్ప్ పరిధిలోని స్వయం సహయక సంఘాల మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించి.. ఆ మేరకు డిజైన్లను ఖరారుచేశారు. ఈ సారి జరీ అంచుతో పదిరకాల డిజైన్లలో పది రంగుల్లో మొత్తం వందరకాల చీరెలను తయారుచేశారు.

పెరిగిన ఆదాయం
పెరిగిన ఆదాయంతో నేత కార్మికుల జీవన ప్రమాణాలు పెరిగాయి. నేత కార్మికులతోపాటు వార్పిన్, ఆసాములు, వైపని కార్మికులు, కండెలు చుట్టేవారు, ఆటో ట్రాలీలవారు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరెల కోసం రూ.313 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సిరిసిల్లలో రూ.1600కోట్ల విలువైన 40.50 కోట్ల మీటర్ల వస్త్రాలను ఆర్డర్లు సిరిసిల్లకు ఇచ్చారు. ఈ పరిణామాలతో గతంలో ఈ వృత్తిని వదిలి వెళ్లి ఇతర పనులు, వృత్తులు, వ్యాపారాలు చేసుకున్న వారు కూడా తిరిగి మరమగ్గ వృత్తి వైపు మళ్లుతున్నారు. సిరిసిల్ల నుంచి ఇతర మహరాష్ట్ర, గుజరాత్‌లకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి వస్తున్నారు. గత రెండేండ్లుగా మూడు వేలకు పైగా కొత్త మరమగ్గాలను కొనుగోలు చేశారు. కొత్త షెడ్‌లను నిర్మించుకున్నారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున బతుకమ్మ చీరెల తయారీలో నిమగ్నమయ్యారు. రెండేండ్లుగా మరమగ్గాలపై పనిచేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది.

నాణ్యతలో రాజీ లేదు
చీరెల నాణ్యత విషయంలో రాజీపడకుండా చేనేత , జౌళి శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నాణ్యతను తనిఖీ చేయడానికి టెక్నికల్ అధికారులతో 15 బృందాలను ఏర్పాటుచేశారు. వీరు ఎప్పటికప్పుడు తనిఖీచేస్తూ నాణ్యత లేని వాటిని తిరస్కరిస్తున్నారు.

Bathukamma-Sarees1

సీఎం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం
గతంలో పనిదొరుకక సిరిసిల్లలో ఆత్మహత్య లు జరిగేవి కానీ ఇప్పుడు ప్రభుత్వం చేతినిండా పని కల్పిస్తున్నది. నేత కార్మికుల ఆదాయం పెరిగే విధంగా సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. అన్ని రకాల ప్రభుత్వ ఆర్డర్లను ఇక్కడ తయారు చేయిస్తున్నాం. ఈనెల 15-20 వరకు అన్ని చీరెలను జిల్లాలకు తరలిస్తాం. చీరెలను వరంగల్, కరీంనగర్‌లో నూ తయారుచేసే ఆలోచన చేస్తున్నాం. – శైలజా రామయ్యర్, డైరెక్టర్, చేనేత, జౌళి శాఖ

గతంలో పని దొరుకలేదు
గతంలో ఈ వృత్తిలో ఖర్చులకు వెళ్లకపోవడంతో కిరాణషాపు పెట్టుకున్నాం. కానీ గత రెండుమూడేండ్లుగా మంచిగా పనిదొరుకుతున్నది. నెలకు రూ.23-25 వేల దాంకా దొరుకుతున్నాయి. – మంగళవారపు రాజు, సిరిసిల్ల

ఇద్దరం ఇదే పనిచేస్తున్నాం
మా కుటుంబంలో ఇద్దరం ఇదే పనిచేస్తున్నాం. నేను పని నేర్చుకున్న. మా ఆయన రాత్రి పనిచేస్తడు. నేను పొద్దగాల పనిచేస్తా. చీరెల డిజైన్లు మార్చిన్రు. కొత్త పనికూడా నేర్చుకుంటున్నం. – బూర నిర్మల, సిరిసిల్ల

ఇన్ని డబ్బులు చూడలేదు
గతంలో నేను మ రమగ్గం మీద పనిచేస్తే మా అవిడ బీ డీలు చేసేది. గతం లో ఎన్నడు కూడా ఈ పని మీద ఇంతగనం డబ్బులు రాంగ చూడలేదు. – శేర్ల రూప, రవీందర్, భార్యభర్తలు

పైసలు వస్తున్నాయి..
తెలంగాణ ప్రభుత్వం వచ్చే వరకు నెలకు రూ.ఏడెనిమిది వేలు దొరకడమే కష్టంగా ఉండేది. ఇప్పుడు నెలకు రూ.32-35 వేలకు పైగానే సంపాదిస్తున్నం. – వేముల నర్సయ్య, వార్పర్, సిరిసిల్ల

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.