Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

భయం వద్దు.. నిర్లక్ష్యం వద్దు

-అధిక ఖర్చు పెట్టుకుని ప్రైవేటు దవాఖానలకు పోవద్దు
-ఎంతమందికైనా చికిత్స అందించేందుకు సర్కారు సిద్ధం
-ఆరోగ్యశాఖకు అదనంగా రూ.100 కోట్లు కేటాయింపు
-దవాఖానల్లో ఉన్న కరోనా రోగులు 3,692 మందే
-200 మంది తప్ప మిగిలినవారంతా కోలుకుంటున్నారు
-వైద్యకాలేజీల్లో అధ్యాపకులకు యూజీసీ స్కేల్ వర్తింపు
-కొత్త నర్సులకు పాతవారితో సమానంగా వేతనాలు
-వైద్యారోగ్యశాఖలో అందరికీ 10% ఇన్సెంటివ్
-పీజీ చేసిన 1200 మంది వైద్యులు ప్రభుత్వ సర్వీసులోకి
-పీహెచ్ ఖాళీగా ఉన్న 200 డాక్టర్ పోస్టుల భర్తీ
-సీఎం కేసీఆర్ ప్రకటన

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ అన్నారు. కరోనా వైరస్ సోకినవారు అధికవ్యయం చేస్తూ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్యసిబ్బంది సంసిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణలో, చికిత్సలో ఎంతో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

జాతీయ సగటుతో చూసుకుంటే రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉన్నది. మనవద్ద రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నది. గురువారం నాటికి దవాఖానల్లో ఉండి చికిత్స పొందుతున్నవారు 3,692 మంది ఉన్నారు. వారిలో తీవ్రమైన ఇతర జబ్బులున్న 200 మంది తప్ప మిగతా వారంతా కోలుకుంటున్నారు.

– ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్

వేగంగా కోలుకుంటున్నారు

కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఉన్నది. కేవలం తెలంగాణలోనే లేదు.. తెలంగాణలోనేపుట్టలేదు. జాతీయ సగటుతో చూసుకుంటే రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉన్నది. రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నది. రాష్ట్రం లో గురువారం నాటికి దవాఖానల్లో ఉండి చికిత్స పొం దుతున్నవారు 3,692 మంది ఉన్నారు. వారిలో తీవ్రమైన ఇతర జబ్బులున్న 200 మంది తప్ప మిగతావా రంతా కోలుకుంటున్నారు. రాష్ట్రంలో గురువారం నాటికి 41,018 మందికి వైరస్ సోకింది. అందులో 27,295 మంది (67%) కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. మిగతావారిలో ఎలాంటి లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారెంటైన్ ఉన్నారు. మిగతావారు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. వారంతా వేగంగా కోలుకుంటున్నారు. లక్షణాలు లేనప్పటికీ కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం.. వైరస్ సోకిన వారందరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన గైడెన్స్ చికిత్స అందిస్తున్నాం.

కరోనాతో సహజీవనం తప్పదు

దేశంలో అన్ ప్రక్రియ నడుస్తున్నది. ప్రజలు పనులకోసం బయటకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలు కూడా నడపాలని నిర్ణయించింది. కరోనాతో సహజీవనం చేయక తప్పని స్థితి వచ్చింది. అయితే కరోనా విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరీ అంత భయంకరమైన పరిస్థితి లేదు. అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాలి.

ఎంతమందికైనా వైద్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధం

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభు త్వం సర్వన్నద్ధంగా ఉన్నది. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వమే మొదట గందరగోళంలో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కావాల్సినవన్నీ చాలా వేగంగా సమకూర్చుకున్నాం. ఇప్పుడు వేటికీ కొరతలేదు. హైదరాబాద్ గాంధీ, టిమ్స్ దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లను సిద్ధంచేశాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లలో కలిపి 10 వేల బెడ్లను కేవలం కరోనా చికిత్సకోసమే ప్రత్యేకంగా కేటాయించి పెట్టాం. ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1500 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు ఉన్నాయి. మందులు, ఇతర పరికరాల కొరత లేదు. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మైస్థెర్యంతో ముందుకు పోవా లి. ప్రజలకు మెరుగైన వైద్యం సమర్ధంగా అందించే విషయంపైనే వైద్య సిబ్బంది ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి.

హైరానాపడి ప్రైవేట్ దవాఖానలకు వెళ్లకండి

ప్రజలు హైరానా పడి, అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు దవాఖానలకు పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఐసీఎమ్మార్ మార్గదర్శకాల ప్రకారం మంచి చికిత్స అందుతున్నది. ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని దవాఖానలకు వెళ్లి, వైద్యుల సలహా తీసుకోవాలి. చికిత్స పొందాలి. తెలంగాణ రాష్ట్రంలో పీహెచ్ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కరోనా విషయంలో కావాల్సిన వైద్యం అందించడానికి ఏర్పాట్లున్నాయి. కాబట్టి వీటిని ప్రజలు వినియోగించుకోవాలి. కరోనా వ్యాప్తి నివారణకు, వైరస్ సోకినవారికి మంచి వైద్యం అందించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నది.

జనరల్ బడ్జెట్ అదనంగా రూ.100 కోట్లు

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అత్యవసర పనులు నిర్వహించుకోవడానికి వీలుగా జనరల్ బడ్జెట్ అదనంగా రూ.100 కోట్లు కేటాయించారు. ఆరోగ్య మంత్రి, సీఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి వీలుగా ఈ నిధులను అందుబాటులో పెడతారు.

మరికొన్ని నిర్ణయాలు, ఆదేశాలు

*వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేల్ అమలు చేయాలని నిర్ణయించారు.

*కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాతవారితో సమానంగా వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు.

*ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏండ్లకు పెంచాలని నిర్ణయించారు.

*ఔట్ ఉద్యోగులతోపాటు వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరినీ మినహాయించకుండా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందించే 10% అదనపు వేతనం (కొవిడ్ ఇన్సెంటివ్) కొనసాగించాలని ఆదేశించారు. పోలీసుశాఖ సిబ్బం ది, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి ఇన్సెంటివ్ కొనసాగించాలని నిర్ణయించారు.

*రాష్ట్రంలో పీజీ పూర్తిచేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

*పీహెచ్ ఖాళీగా ఉన్న 200 డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.

*కరోనా సోకినవారికి అందించే వైద్యంలో భాగంగా వేసే రెయ్ టో సిలిజుమాబ్ ఇంజెక్షన్లు, ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను పెద్ద మెత్తంలో సిద్ధంగా పెట్టుకోవాలి. కావాల్సినవారికి ఉచితంగానే అందివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కొరత రానీయవద్దు.

*ప్రైవేటు హాస్పిటళ్లు బెడ్ల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రతి దవాఖాన తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి? అనే విషయాలను బహిరంగ పరచాలి. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలియచేయాలి. ఈ సమీక్షాసమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ ముర్తజారిజ్వీ, ఆరోగ్యశాఖలో వివిధ విభాగాధిపతులు కరుణాకర్ రమేశ్ శ్రీనివాస్, గంగాధర్, చంద్రశేఖర్ సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.