Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బీజేపీ ఫేక్‌ వర్సిటీ

-వాట్సాప్‌లో అసత్యాల ప్రచారమే ఆ పార్టీ పని: కేటీఆర్‌
-కాంగ్రెస్‌కు మిగిలింది చరిత్రే.. భవిష్యత్తు లేదు
-ఆ పార్టీల దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి
-పనిచేసేవారికే టీఆర్‌ఎస్‌లో గుర్తింపు ఉంటుంది
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి గెలుద్దాం
-వాణీదేవి అభ్యర్థిత్వంతో విపక్షాలు బెంబేలు
-మరే అభ్యర్థికీ ఆమెలాంటి క్లీన్‌ ఇమేజ్‌ లేదు
-ప్రత్యర్థులు సైతం మనసులో మద్దతిస్తున్నారు
-ప్రభుత్వ విజయాలను బలంగా ప్రచారం చేయాలి
-ఉద్యోగాల కల్పనపై యువతకు వివరించాలి
-పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్‌ కర్తవ్య బోధ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ దూసుకుపోతున్నది. ఆరేండ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాలు, సంక్షేమాన్ని లెక్కలతో సహా వివరిస్తూ ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేస్తున్నది. తాము చెప్పేది అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తామన్న మంత్రుల సవాళ్లకు అటు నుంచి సమాధానమే కరువవుతున్నది.

శనివారం హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌, నల్లగొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని గులాబీ దండు హోరెత్తించింది. అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి పట్టభద్రుడిని కలిసి ఓటు అభ్యర్థించాలన్న అధిష్ఠానం ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు.

మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు పార్టీ నాయకులు నియోజకవర్గాల బాటపట్టారు. ప్రతి ఒక్కరూ తమకుతామే పార్టీ అభ్యర్థిగా భావించి ప్రచారం నిర్వహించాలని, పార్టీ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే ఒరిగేది శూన్యమని, ఆ ఓటు బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని అవగాహన కల్పించాలని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నది.. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికే ఓటు వేసి గెలిపిస్తే సమస్యల పరిష్కారం సులభమవుతుంది. ఇదే విషయాన్ని పట్టభద్ర ఓటర్లకు వివరించి ఓటు అభ్యర్థించాలని పిలుపునిచ్చారు. ఓటర్లు పోలింగ్‌కేంద్రానికి వెళ్లి ఓటువేసేలా చూడాలని సూచించారు. ఉద్యోగాలు కల్పించలేదంటున్న కాంగ్రెస్‌, బీజేపీ దమ్ముంటే రుజువుచేయాలని మంత్రులు సవాల్‌ విసిరారు.

రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కే లేదు. ఓట్లు అడిగేందుకు ఆ పార్టీ వద్ద ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదు. తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సినవి తప్ప అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పథకాలకు నిధులివ్వలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మెడికల్‌ కాలేజీల కేటాయింపులోనూ బీజేపీ సర్కారు మొండిచేయి చూపించింది. మండిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల గురించి ప్రతి ఒక్కరికీ విడమరచి చెప్పాలి.
-మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నిత్యం అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయటమే పనిగా పెట్టుకొన్నాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ముఖ్యంగా బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీదాకా అబద్ధాలతోనే పూట గడుపుతున్నదని మండిపడ్డారు. బీజేపీ ఓ ఫేక్‌ వాట్సాప్‌ యూనివర్సిటీ అని ఎద్దేవా చేశారు. విపక్షాల అసత్యాలను తిప్పికొట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించేలా ప్రతి కార్యకర్త, నాయకుడు కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. మంత్రులు గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు, ఇతర ముఖ్యనాయకులతో ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో సమావేశమై హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఏ పార్టీకైనా ప్రతి ఎన్నిక అత్యంత కీలకమైనది. ఎన్నికల్లో ఏమరుపాటు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలి. పార్టీ ఆదేశానుసారం నడుచుకోవాలి. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఒకప్పుడు హైదరాబాద్‌ నగరంలో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు నాయకులు లేరన్న పరిస్థితి నుంచి రెండుసార్లు జీహెచ్‌ఎంసీలో భారీ విజయాలు సాధించి మేయర్‌ పీఠం దక్కించుకునే స్థాయికి టీఆర్‌ఎస్‌ ఎదిగిందని గుర్తుంచుకోవాలి. ఈ ఎన్నికల్లో మళ్లీ మన సత్తా చాటాలి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సురభి వాణీదేవిని ప్రకటించినప్పటి నుంచి ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. వాణీదేవికి ఉన్న క్లీన్‌ ఇమేజ్‌ ఎన్నికల బరిలో ఉన్న ఏ అభ్యర్థికి లేదన్న విషయాన్ని పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రత్యర్థులు సైతం మనసులో ఆమెకు మద్దతు తెలియజేస్తున్నారు. పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేసి వాణీదేవిని గెలిపించుకోవాలి.

వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
ఇతర ఎన్నికల్లో మాదిరిగా సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహించటం వల్ల ఈ ఎన్నికల్లో ప్రయోజనం లేదని గుర్తించాలి. ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పనిచేయాలి. ప్రతి ఓటరును కలిసి విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. రాష్ట్రప్రభుత్వం గత ఆరేండ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, నిరుద్యోగ యువతకు కల్పించిన అవకాశాల గురించి చెప్పాలి. గతంలో ఏ ప్రభుత్వ చేయని విధంగా 1 లక్షా 32 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీచేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్న సత్యాన్ని ప్రచారం చేయాలి. పైరవీలు, అవినీతికి లేకుండా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేశామని బల్లగుద్ది గ్రాడ్యుయేట్లకు వివరించాలి. ప్రభుత్వం విప్లవాత్మకంగా తెచ్చిన టీఎస్‌ – ఐపాస్‌ ద్వారా రాష్ర్టానికి 14 వేల పరిశ్రమలు వచ్చాయి. ప్రైవేటు రంగంలో దాదాపు 14 లక్షల ఉద్యోగాలను సృష్టించిన విషయాన్ని పట్టభద్రులకు అర్థమయ్యేలా చెప్పాలి. ప్రత్యేకించి హైదరాబాద్‌ నగర గ్రాడ్యుయేట్లకు ఆరేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి. ఓటరుగా నమోదైన ప్రతి విద్యావంతుడిని కలిసి మద్దతు కోరాలి. నాకేం సంబంధంలేదు అన్న ధోరణితో ఎవరూ ఉండకూడదు. ఎవరేం పనిచేస్తున్నారో పార్టీ ఎప్పకప్పుడు గమనిస్తుంటుంది. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా పనిచేసిన వారికే భవిష్యత్‌ ఉంటుంది. పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం.. మనకు భవిష్యత్తు ఉంటుందన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

బీజేపీకి ఓటు అడిగే హక్కు ఎక్కడిది?
ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అసత్య ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నది. మిషన్‌ భగీరథ లాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఇంటింటికీ నల్లానీరు మన ప్రభుత్వం అందిస్తే.. బీజేపీ నేతలు దానిని వారి ఘనతగా చెప్పుకొంటున్నారు. బీజేపీ తన ఫేక్‌ వాట్సాప్‌ యూనివర్సిటీ ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్నది. రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కే లేదు. ఓట్లు అడిగేందుకు ఆ పార్టీ వద్ద ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదు. తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సినవి తప్ప అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పథకాలకు నిధులివ్వలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మెడికల్‌ కాలేజీల కేటాయింపులోనూ బీజేపీ సర్కారు మొండిచేయి చూపించడాన్ని ప్రతి ఒక్కరికీ విడమరచి చెప్పాలి. మండిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల గురించి గుర్తుచేయాలి. బీజేపీ అభ్యర్థి గత ఆరేండ్లలో గ్రాడ్యుయేట్లకుగానీ, రాష్ర్టానికిగానీ చేసింది ఏమీ లేదు. న్యాయవాదిగా ఉన్న ఆ పార్టీ అభ్యర్థి రామచంద్రరావు అసత్యాలే మాట్లాడుతున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీకి చెప్పుకోవటానికి చరిత్రే మిగిలింది. భవిష్యత్తు మాత్రం లేదు. కాంగ్రెస్‌, బీజేపీలకు టీఆర్‌ఎస్‌ పార్టీని, మన అభ్యర్థిని ప్రశ్నించే హక్కేలేదు.

ఉద్యోగులతో టీఆర్‌ఎస్‌ది పేగుబంధం
ప్రభుత్వ ఉద్యోగులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నది దుష్ప్రచారం మాత్రమే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వారంతా మనతో కలిసి పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో టీఆర్‌ఎస్‌ది పేగుబంధం. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ఏర్పాటు కాగానే భారీ పీఆర్సీని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.