Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బ్రాండ్ తెలంగాణ

-దేశవిదేశాలకు మన రాష్ట్ర ఉత్పత్తులు
-ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రాథమిక ప్రతిపాదనలు రెడీ
-ప్రధాన పంటలు, ప్రతిపాదిత పరిశ్రమలపై జిల్లాలవారీ నివేదికలు
-20లోగా మరోసారి ఉన్నతస్థాయి భేటీ

రాష్ట్రంలో ఆహార శుద్ధికేంద్రాల (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల) ఏర్పాటుకు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ర్టాలకు, విదేశాలకు సైతం బ్రాండ్ తెలంగాణ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేవిధంగా ప్రణాళిక సిద్ధంచేస్తున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న పంట దిగుబడులకు స్థానికంగానే మార్కెటింగ్, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖతోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే రెండుసార్లు సమావేశమై ప్రాథమిక నివేదిక సిద్ధంచేశారు. ఆయా జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్న పంటల వివరాలతో జాబితాను ప్రభుత్వానికి అందించారు. జిల్లాల్లో సాగుచేసే పంటలు, అక్కడ నెలకొల్పేందుకు అవకాశం ఉన్న పరిశ్రమల జాబితాను ప్రాథమికంగా సిద్ధంచేశారు. ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల జాబితాను తయారుచేశారు. వీటితోపాటు మార్కెటింగ్ సౌకర్యాలు, సాంకేతిక అంశాలపై జిల్లాలవారీగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

బ్రాండ్ తెలంగాణ
రాష్ట్రంలో తయారుచేసి, ఎగుమతి చేసే ఆహార ఉత్పత్తులకు బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ రానుంది. దీనికి సంబంధించిన పలు ఉదాహరణలు సైతం గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడిస్తున్నది. బత్తాయి పంటలకు మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు ప్రసిద్ధి. అయితే వాటికి పరిశ్రమలు, మార్కెటింగ్ సరిగా లేదు. మహారాష్ట్రకు ఎక్కువగా మన బత్తాయిలు ఎగుమతి చేస్తున్నట్లు తేలింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బత్తాయి నుంచి రసం, గుజ్జు, విత్తనాలు వేరుచేసే ప్యాక్టరీలున్నాయి. మన దగ్గర వాటిని ఏర్పాటుచేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్న అధికారులు.. తొలుత అక్కడి నుంచే కొన్నిరోజులు బ్రాండ్ తెలంగాణ పేరిట బత్తాయిరసం, శీతలపానీయాలు, గుజ్జు, విత్తనాలను తయారు చేయించనున్నారు. దీని మార్కెటింగ్‌పై గ్రామీణాభివృద్ధిశాఖ అంచనాలు తయారుచేస్తున్నది. రైతుల నుంచి కొనుగోలు చేయడం, మార్కెటింగ్ చేయడం, ఆ తర్వాత వాటిని బ్రాండ్ తెలంగాణ పేరుతో ఇక్కడ మహిళా సంఘాల ఆధ్వర్యంలో విక్రయించే ఏర్పాట్లను పరిశీలిస్తున్నది. అంతేకాకుండా స్థానికంగా ఏర్పాటుచేసే ఆహార శుద్ధికేంద్రాల నుంచి కూడా ఉత్పత్తులను బ్రాండ్ తెలంగాణ పేరుతోనే మార్కెటింగ్ చేయనున్నారు.

జిల్లాల వారీగా నివేదికలు రెడీ..
జిల్లాలవారీగా ప్రధానంగా పండుతున్న పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలపై ప్రాథమిక నివేదికను జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు సిద్ధంచేశారు. కొన్ని ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఏ పరిశ్రమ పెడితే బాగుంటుందో ఆ నివేదికల్లో పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..

మిర్చి : ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్ రూరల్.
వేశరుశనగ: జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు.
జొన్నలు: కుమ్రంభీం ఆసిఫాబాద్
సీతాఫలం : మహబూబ్‌నగర్
ఎండు అల్లం (డ్రై జింజర్) : సంగారెడ్డి
బత్తాయి : నల్లగొండ.
చింతపండు : వికారాబాద్
కాటన్ సీడ్ ఆయిల్ : రాజన్న సిరిసిల్ల
పప్పు దినుసులు : ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి.
మామిడి : జగిత్యాల, మంచిర్యాల, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, పెద్దపల్లి.
మామిడి పచ్చళ్లు: నాగర్‌కర్నూలు, జగిత్యాల.
వివిధ రకాల పచ్చళ్లు: మేడ్చల్ మల్కాజ్‌గిరి
మామిడి పౌడర్ (ఆమ్‌చూర్) : వికారాబాద్.
చిరు ధాన్యాల పరిశ్రమలు : మహబూబ్‌నగర్, వికారాబాద్, ఆదిలాబాద్.
మొక్కజొన్న ఆధారితం : వరంగల్ అర్బన్, నిర్మల్, రంగారెడ్డి, సిద్దిపేట.
స్వీట్ కార్న్, బేబీ కార్న్: కరీంనగర్.
పసుపు ఆధారిత పరిశ్రమలు : నిజామాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్ రూరల్.
కూరగాయల ఆధారితం : ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి.
టమాటా ఆధారితం : కరీంనగర్
టమాటా సాస్: యాదాద్రి భువనగిరి
సోయాబీన్ ఆధారితం : నిర్మల్, కామారెడ్డి.
గోధుమ ఆధారితం: ఆదిలాబాద్
గోధుమ పిండి : జనగామ.
బియ్యం : యాదాద్రి భువనగిరి
ముడి బియ్యం : మెదక్ ముడిబియ్యం ఆయిల్ (రైస్ బ్రాన్ ఆయిల్)
పరిశ్రమలు : కరీంనగర్, మెదక్.

పంటల వారీగా..
రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో సాగుచేస్తున్న పంటలు, దిగుబడి అంశాలను ప్రధానంగా గుర్తించారు. ఇప్పటివరకు సాగుచేసిన పంటలు, వచ్చిన దిగుబడిని అంచనా వేసి, ఈ ప్రాథమిక ప్రతిపాదనలు చేశారు. దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో కసరత్తు చేయాల్సి ఉంది. ప్రస్తుతం పండుతున్న పంటలు, దిగుబడి, ఆయా జిల్లాల్లో వాటి నిల్వ, గోదాముల సామర్థ్యం, వచ్చిన పంటకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ అంశాలపై పరిశీలన చేస్తున్నారు. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో సాగుచేస్తున్న వ్యవసాయ ఉత్పత్తులపై అంచనాకు వచ్చిన ఆయా శాఖల ఉన్నతాధికారులు.. ఆ ప్రాంతాల్లో సంబంధిత ఆహారశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.