Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బడ్జెట్ కేటాయింపుల కోసం పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటిఆర్

కేంద్రం బడ్జెట్ లో పలు పథకాలకి నిధులకేటాయింపుని అపిన నేపథ్యంలో సమీక్ష రాష్ర్టాని పన్నుల వాటా పెంచినందున ఆ మేరకి పలు పథకాలకి అర్ధిక శాక సాయం కోరాలని అధికారులకి అధేశం కేంద్ర బడ్జెట్ లోంచి అగిపోయే నిధుల కేటాయింపు, నిధులు పొందేందుకున్న అవకాశాల మీద చర్చ తెలంగాణ తాగునీటి ప్రాజెక్టు, పించన్లు, పంచాయితీ రోడ్లకి నిధులు వస్తాయని అశాభావం పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది మరియు అర డబ్య్ల్యుయస్ శాఖాధికారులతో పథకాలు, కార్యక్రమాల వారీగా సుదీర్ఘ సమీక్ష

KTR review on Panchayath Raj department

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది మరియు అర్ డబ్య్ల్యు యస్ శాఖాధికారులతో మంత్రి కె.తారక రామా రావు సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో జరిగిన పరిణామాల మీద మంత్రి తన శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి నిధులు కేటాయింపుల పై చర్చించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకి పన్నుల్లో వాటాని పెంచిన నేపథ్యంలో పలు పథకాలను పూర్తిగా నిలిపివేస్తూ బడ్జెట్లో తెలిపింది.దీంతో ఏ ఏ పథకాలకి కేంద్రం నిధులు రాకపోవచ్చో మంత్రి అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తో తెలంగాణకి రావాల్సినన్ని నిదులు రాలేవని, ఆయితే ఏ ఏ విభాగాల్లో కేంద్రం నుంచి నిధుల సహకారం ఉంటుందో చూడాలని అధికారులను అదేశించారు. తెలంగాణ బడ్జెట్ కేటాయింపులపై అర్ధిక శాఖ సూత్ర ప్రాయంగా తెలిపిన సమాచారం పైన సైతం మంత్రి అధికారులతో చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ స్టేట్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, పంచాయితీ రాజ్ రోడ్ల కార్యక్రమాలకి నిధుల కోరత ఉండదని, అమేరకి ముఖ్యమంత్రి ఇప్పటిక పలు సార్లు తెలిపారని గుర్తు చేశారు. తెలంగాణ అర్ధిక శాఖ బడ్జెట్ తుది కసరత్తుల్లో ఉన్నందున, పంచాయతీ రాజ్ శాఖకి రావాల్సిన  నిధులు, వాటి ప్రాముఖ్యతను మరోసారి అర్ధిక శాఖకి వివరించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం, బీఆర్‌జీఎస్, పియంజియస్ వై తోపాటు పలు పంచాయితీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖల తాలు పథకాలకి ముగింపు పలికిన నేపథ్యంలో, మరోపైపు పన్నుల్లో రాష్ర్టం వాటా పెంపులో చూపిస్తున్నందున, ఈ రాష్ర్ట బడ్జెట్ లో కొంత మేర అధిక నిధుల్ని కోరాలని అధికారులని అధేశించారు. కేంద్రం తీసుకున్న ఈ కోతల వల్ల గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్ కి కార్యక్రమాలకి కొంత నష్టం జరిగిందని అభిప్రాయపడ్డ మంత్రి… అమేరకి రాష్ర్ట ప్రభుత్వం సాయం కోరాలన్నారు.

మరో పైపు కేంద్ర ప్రభుత్వం మౌళిక సదుపాయల కల్పన, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలకి పెద్దఏత్తున ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో పంచాయీతీరాజ్ రోడ్డుకి నిధులు పొందే వీలుంటే ప్రయత్నం చేయాలన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో చేపట్టబోయే ఈ పంచాయత్ లకి నిధుల సేకరించేందుకు ప్రయత్నించాలని అధికారులని అధేశించారు. జాతీయా స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమం కింద నిధులు పొందేలా కేంద్రాన్ని సంప్రదించాలని మంత్రి అధికారులని అధేశించారు. కేంద్రం స్వచ్చ్ భారత్ కార్యక్రమాన్ని భారీగా చేపడుతున్నందున అ మేరకి నిధులు పొందాలని, తెలంగాణలో మరుగుదోడ్లు, పారిశుద్ద్య కార్యక్రమాలకి నిధులను స్వచ్చ్ భారత్ ద్వారా పొందాలని కోరారు.

పంచాయితీరాజ్ శాఖ కార్యక్రమాల కింద గ్రామ పంచాయితీ బిల్డింగ్ ల నిర్మాణం, ఏక్రగ్రీ ఏన్నికలు జరిగిన గ్రామపంచాయితీలకి పారితోషికం, అదర్శ గ్రామపంచాయితీలకి రివార్డులు, అపార్డు, శ్రీరామనందా తీర్ధ గ్రామీణ శిక్షణ సంస్ధ వంటి వాటి అధిక నిధులు కేటయించేలా అర్ధిక శాఖని సంప్రదించాలన్నారు. ఇక పెన్షన్లకి సరిపోయినన్ని నిధులు వస్తాయని అశాభావం వ్యక్తం చేసిన మంత్రి…సెర్ప్ వంటి సంస్ధలకి నిధులు కావాలన్నారు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.