-టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -ప్రమాదాల్లో చనిపోయిన పార్టీ కార్యకర్తలకుటుంబీకులకు బీమా చెక్కుల అందజేత -తెలంగాణభవన్‌లో లైబ్రరీని ప్రారంభించిన కేటీఆర్

పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు. వివిధ ప్రమాదాల్లో చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున చెక్కులను గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ అందించారు. మొత్తం 30 మంది చెక్కులను అందుకున్నారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన కేటీఆర్.. వారి కుటంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా పార్టీ నేతలకు వివరిస్తే తప్పకుండా సాయమందస్తామని చెప్పారు. ఏ పార్టీ కి అయినా కార్యకర్తలే అండ అని, వారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే బీమా సదుపాయాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని తెలిపారు.

గ్రంథాలయం ప్రారంభం తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని స్వయంగా పరిశీలించారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ సాహిత్యం, తెలంగాణలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన పూర్తి సాహిత్యం అందుబాటులో ఉంటుందని ఆయనకు పార్టీ నాయకులు వివరించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు, పార్టీ బీమా విభాగం బాధ్యు లు కావేటి లక్ష్మీనారాయణ, టీవీఆర్ శాస్త్రి, బేవరేజెస్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, ఉన్నత విద్యామండలి కమిటీ సభ్యులు నర్సింహారెడ్డి, ఆగ య్య తదితరులు పాల్గొన్నారు.

