Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

Articles

సోలిపేట ఒక పోరుబాట

ఆప్తమిత్రుడు, నిగర్వి, నిరాడంబరుడు, నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూసాడనే వార్త వినటంతోనే నిలువెల్లా ఒక అంతులేని ఆవేదన ఆవరించింది. దుఃఖంతో కండ్లు చెమ్మగిల్లుతుంటే నిగ్రహించుకోవటం కోసం నిల్చున్న వాడినల్లా కొద్దిసేపు అట్లా కూర్చుండిపోయాను. ఆత్మవిశ్వాసం నిండిన ముఖం, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా మాట్లాడే లింగన్న రూపం కండ్లల్ల ఆడుతున్నది. పాత్రికేయునిగా మొదలైన వారి అక్షర ప్రస్థానం.. తెలంగాణ సాధనతో లక్ష్యాన్నిచేరుకుంది. ఆంతలోనే 58 ఏళ్లకే… వారు దూరం కావడం మహావిషాదం.


వ్యయం కాదు, వ్యవసాయం

నియంత్రిత వ్వవసాయ విధానంలో ఏ పంట రకాలు ఎక్కడ సాగుచేయాలో ప్రభుత్వమే చెబుతుంది. దాని ప్రకారమే రైతులు పంటలు వేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఎక్కడ ఏ పంటలు వేయాలన్నది ప్రభుత్వమే మ్యాపింగ్‌ చేసి, సమగ్ర వ్యవసాయ విధానాన్ని రాష్ట్రమంతా అమలయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని రైతులు గుండెలకద్దుకొని స్వీకరిస్తున్నారు.


నాటి నినాదం.. నేడు వాస్తవం

ఆరేండ్ల నా తెలంగాణ ఓ పసి మొగ్గ. దేశ పటంలో ఒక కొత్త రాష్ట్రం. నాటి ఉద్యమ నాయకుడే నేటి తెలంగాణ ప్రభుత్వ అధినేత. బంగారు తెలంగాణ ప్రదాత, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి నాయకత్వంలో తెలంగాణ నేడు దేశానికే దిక్సూచి. ఏ రంగంలో ఐనా తెలంగాణ ఓ రోల్‌ మోడల్‌. మెట్ట పంటలతో నెట్టుకొచ్చిన భూములు నేడు హరిత సింగారాల మాగాణాలై మెరిసిపోతున్నాయి.


ఉత్తమ జర్నలిస్టు, అత్యుత్తమ నాయకుడు

నేను విద్యార్థిగా ఉన్న రోజులనుంచి, జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించే కాలానికి ఆయన మాలాంటి యువతరం జర్నలిస్టులందరికీ ఓ రోల్‌మోడల్‌. నిజాయితీతో కూడిన సాదాసీదా జీవన విధానం, ప్రజలతో కలిసిమెలిసి ఉండటం, ప్రజల సమస్యలను వెలుగులోకి తేవటంలో కొత్త తరం జర్నలిస్టులందరికీ ఆయన ఆదర్శం.


ఎందుకీ అపశకునం మాటలు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొన్ని పెద్దపిట్ట కూతలు, నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. అప్పట్లో పెద్దపిట్ట లాంటి కూతల వలె, ఇప్పుటి ప్రతిపక్ష నేతలు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, బండి సంజయ్‌ మాటలు కీడునే కోరుతున్నాయి. తెలంగాణ గడ్డ ఉన్నపళంగా పీనుగల దిబ్బగా మారితే శవ రాజకీయం చేయాలని కాటి కాడి నక్కల్లా కాచుకుని కూర్చున్నట్లు వారి మాటలు చెబుతున్నాయి.


వైఫల్యాల బీజేపీ కుయత్నాలు

బీజేపీ వైఫల్యాల జాబితా పెద్దదే. మొదటిది అంతర్జాతీయ ప్రయాణాలను అరికట్టే విషయంలో విఫలం, రెండవది ఢిల్లీ నడిబొడ్టున వేల మందితో తబ్లిగీ జమాత్‌ సమావేశం జరుగుతుంటే సమాచారం ఉండి కూడా నిర్లక్ష్యం చేయడం, మూడవది దేశవ్యాప్తంగా వలస కార్మికుల విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం. తద్వారా కేంద్రం దేశాన్ని గందరగోళంలో పడేసింది.


పొలాలు పిలుస్తున్నాయి కలలు ఫలిస్తున్నాయి

శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఉండటంతో సమాజాన్ని చాలా దగ్గరగా నిశితంగా పరిశీలిస్తుంటాను. భిన్నవర్గాల ప్రజలతో నిత్యం సంభాషిస్తుంటాను. గ్రామీణ సమాజంలో వస్తున్న మార్పులను ఆసక్తిగా గమనిస్తుంటాను. నా పరిశీలన, అధ్యయనం, అనుభవం ఆధారంగా గ్రహించిన విషయాలను నేను మీతో పంచుకుంటున్నాను.


పచ్చపచ్చని పల్లె ప్రగతి

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకొని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించింది. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయి వరకు పంచాయతీరాజ్‌ శాఖలో ఖాళీలు భర్తీచేసింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతి నెలా రూ.308 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది.


సూర్యాపేట మురిసె సూడు

తుంగతుర్తి గడ్డది దశాబ్దాల నీటిగోస. ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల నిర్మాణం కోసం సాగిన నీటి పోరాటాల గోస చెప్పనలవి కానిది. కేసీఆర్‌ వచ్చేంత వరకు ఏ పాలకుడూ వీరి గోసను పట్టించుకోలేదు.


ఒర్రె రాళ్లను ఒరుసుకుంటూ వచ్చిన నీళ్లు

ఒర్రె రాళ్లను ఒరుసుకుంటూ వచ్చిన నీళ్లు బాల్యమంతా రాళ్లు రప్పలు వాగులతోటే సోపతి. రామేశ్వరంపల్లి కూడవెల్లి వాగు ఒడ్డు నా …


పచ్చని రాష్ట్రంలో ప్రాణికోటి

‘జంగిల్‌ బచావో- జంగిల్‌ బడావో’ నినాదంతో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనే ద్విముఖ లక్ష్యాలతో పనిచేస్తున్నది. హరితహారం ఇప్పటికే ఐదు విడతలు పూర్తికాగా, ఆరో విడత కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టనున్నారు.


KCR creating win-win situation for farmers of Telangana

He has made it clear that those who failed to adhere to crop recommendations will not get the benefits of Rythu Bandhu.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.