Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

News

ఉద్యమనేతకు అశ్రునివాళి అర్పించిన సీఎం కేసీఆర్

విద్యార్థి దశలోనే అభ్యుదయాన్ని కాంక్షించిన విప్లవకారుడు ఇక లేడు. సమాజ మార్పుకోసం అక్షరాలను ఆయుధాలు చేసిన పాత్రికేయుడు.. సెలవన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి.. తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టి.. అవిశ్రాంతంగా నినదించిన నిఖార్సయిన ఉద్యమకారుడు.. విశ్రమించాడు.


స్థానికులకే ఉద్యోగాలు

రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది.


సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు

సీఎం కేసీఆర్ గారి అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం ప్రారంభమయ్యింది. సుమారు 9 గంటలపాటు సాగిన ఈ సమావేశం.. రాత్రి 11 గంటలకు ముగిసింది. ప్రధానంగా 14 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.


ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడు, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.


సర్కారు దవాఖానల్లో విలువైన వైద్యం ఉచితంగా

ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ చికిత్స కోసం ఖరీదైన మందులను వినియోగిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఈ మందులు కార్పొరేట్‌ హాస్పిటళ్లలో సైతం అందుబాటులో లేవని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లు లేవని ప్రైవేటు దవాఖానలు చేతులెత్తేస్తున్నాయని, అయితే తాము ఆ మందులను సమకూర్చుకొని అవసరమైన ప్రతి రోగికి విలువైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.


కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటం

ఉద్యమనేత కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించిన ముహూర్తం చాలా మంచిదని, ముహూర్త బలం, కార్యకర్తల అండతో వందేండ్లయినా చెక్కు చెదరకుండా ఉంటుందని పార్టీవర్కింగ్‌ ప్రెసిడెంట్‌,మంత్రి కేటీఆర్ అన్నారు. కార్యకర్తల త్యాగం, కష్టంతోనే ఈ స్థాయికి చేరుకున్నామని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. కార్యకర్తల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తామని పేర్కొన్నారు.


దశదిశలా పీవీ ఔన్నత్యం

ఆధ్యాత్మికత, జ్ఞాన సమున్నత, విధాన నిర్ణయాలు, ప్రజాసంక్షేమ పాలన, రాజనీతి, సాహితీ సాంస్కృతిక విషయాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆయనకు ఆయనే సాటిఅని ఐటీ, పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు అన్నారు. ఆ మహనీయుడి ఔన్నత్యాన్ని దశదిశాలా చాటుదామని పిలుపునిచ్చారు.


ఒక్కచుక్కనూ వదులుకోం

జల వివాదాల పరిష్కారంలో కేంద్రం నిష్క్రియాపరత్వం దుర్మార్గం. ఈ వైఖరిని ఇకనైనా విడనాడాలి. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ర్టాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఇరు రాష్ర్టాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్‌ వివాదాలు న్యాయబద్ధంగా పరిష్కారం కావాలి. నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదు.


సచివాలయంలో సర్వ హంగులు

నూతన సచివాలయంలో అందరికీ అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలుండేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయ భవనం నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.


యూరియాపై ఆందోళనవద్దు

రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైన మేర ముందస్తుగానే అందుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతాంగంలో ఆందోళన కలిగించేలా కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.


చందన్‌వెల్లి టు సిలికాన్‌ వ్యాలీ

రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లికి అనతికాలంలోనే అనేక పరిశ్రమలు రానున్నాయని, తద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం చందన్‌వెల్లి పారిశ్రామికవాడలో ప్రపంచప్రసిద్ధి చెందిన వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్‌ పరిశ్రమ టైల్స్‌ విభాగాన్ని మంత్రి కేటీఆర్‌.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.


ఒక్క పిలుపుతో 100 అంబులెన్స్‌లు

ఒక్క పిలుపు.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఒక్క సందర్భం.. ఓ గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టేలా చేసింది. ఆ నిర్ణయమే.. లక్షలమంది ప్రాణాలకు అండ అయ్యింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు జన్మదినం ఓ ఆదర్శవంతమైన కార్యక్రమానికి నాంది పలికింది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.