తెలంగాణ నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్లో అయినా తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. గత ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు దర్యాప్తును రాష్ట్ర హైకోర్టు సీబీఐకి బదిలీ చేస్తే బీజేపీ ఎందుకు సంబురాలు చేసుకొంటున్నదని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు
దేశంలో పెద్ద మార్పు రావాల్సి ఉన్నదని, ఆ మార్పు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్ చడూనీ పేర్కొన్నారు.
రైతుల కోసం ధాన్యం కల్లాల నిర్మాణానికి వినియోగించిన ఉపాధి హామీ పథకం నిధులను వెనక్కి ఇవ్వాలంటూ కేంద్రం ఇచ్చిన తాఖీదులపై ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఇదేం పద్ధతి? అంటూ నిలదీశాడు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానిది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే, ప్రతిపక్షాలవి పార్టిషన్ పాలిటిక్స్ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పెట్టుబడిసాయాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కేంద్రంలో ఉన్నది కామన్‌మ్యాన్ ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ప్రజలపై భారాలు మోపుతూ, కార్పొరేట్ కంపెనీలను మేపుతున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బీజేపీ నయవంచక స్వరూపాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే బయటపెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో సొంతరాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో బొక్కబొర్లా పడిన నడ్డా.. తెలంగాణకు వచ్చి సినిమా డైలాగులు చెప్తే ఎవరూ నమ్మరని అన్నారు.
దేశ రాజకీయాల్లో సరికొత్త మలుపునకు పునాది పడింది. ఓట్లు, సీట్లు అంటూ దశాబ్దాలుగా తిరోగమన రాజకీయాలు చేస్తున్న పార్టీలు అదిరి చూసేలా ప్రగతిపథ రాజకీయాలకు హస్తినలో నాంది ప్రస్తావన జరిగింది.
ఒకప్పుడు సర్కార్ దవాఖానలకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడేవారు. ఉన్నతవర్గాలవారు ఆ వైపే చూసేవారే కాదు. కానీ, తెలంగాణలో పరిస్థితి మారుతున్నది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో సర్కార్ దవాఖానల్లో వైద్యసేవలు మెరుగుపడుతున్నాయి.
Please contribute generously to the TRS Party.