Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

News

కరోనా పరీక్షలు 50,000 మందికి

రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్‌ వచ్చినా.. చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


కొడంగల్‌ రూపురేఖలు మారుస్తాం

కొడంగల్‌ నియోజక వర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ, మిషన్‌ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


రాష్ట్రంలో జల విప్లవం

‘యాభైఏండ్ల చరిత్రలో ఎన్నడూ చూడని జలదృశ్యం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆవిష్కృతమైంది. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి. ఏ తెలంగాణ అయితే కరువు నేల అన్నారో.. అన్నం తినే సంస్కారం కూడా లేదంటూ వెక్కిరించిండ్రో.. ఆ తెలంగాణే నేడు దేశానికి బువ్వ పెట్టే స్థాయికి ఎదిగింది’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.


చెరువుల నిండుగా.. చేపలు పండగ!

‘పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు’ అన్న నానుడిని నిజంచేస్తూ గ్రామీణప్రాంతాల్లో చేపలను దిగుమతిచేసుకునే స్థితినుంచి ఎగుమతిచేసే స్థాయికి ఎదుగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మత్స్యకారుల కోసం అమలుచేస్తున్న పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి.


వైద్యశాఖపై కుట్రపూరితమైన ప్రచారం

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికోసం వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వం చేస్తున్న కృషిపై కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు కుట్రపూరితంగా ప్రచారంచేస్తున్నాయని వైద్యశాఖ అధికారులు, నిపుణులు ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని తెలిపారు.


రేవంత్‌ బ్లాక్‌మెయిలర్‌

ఎంపీ రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. వట్టినాగులపల్లిలో 111జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫాంహౌస్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


కాళేశ్వరం డ్యాష్‌బోర్డు

అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును శాస్త్రీయ ప్రాతిపదికన నిర్వహించేలా (ఆపరేషన్‌) సాంకేతిక తెరకు రూపకల్పన జరుగుతున్నది. ఒక భారీప్రాజెక్టుపై‘డ్యాష్‌బోర్డు’ను రూపొందించడం దేశంలో ఇదే ప్రథమం.


24 నెలల్లో సీతమ్మ బరాజ్‌

గోదావరిపై దుమ్ముగూడెం దిగువన తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన సీతమ్మబరాజ్‌ నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తిచేస్తామని పనులు దక్కించుకున్న ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదలచేసింది.


బలవర్ధకమైన ఆహారాన్ని ఇచ్చే పంటలు పండించాలి

రాష్ట్ర రైతాంగం మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే సాగుచేసే అలవాటు చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని సీఎం చెప్పారు.


దేశానికే తెలంగాణ తలమానికం

గత ఆరేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్వితీయ విజయాలను సాధిస్తూ దేశానికే తలమానికంగా నిలిచిందని పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.


విద్యుత్తు బిల్లును కేంద్ర సర్కారు ఉపసంహరించుకోవాలి

విద్యుత్‌ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రతిపాదిత బిల్లు రైతులకు, పేదలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, విద్యుత్‌ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టంచేశారు.


ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్ కాన్ బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ నగరాల్లో ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.