దేవుళ్లను, గ్రంథాలను అడ్డుపెట్టుకొని, కనీసం వాటిని చదువకనే, దేవుళ్ల బోధను ఆచరించకనే, వారి పేర నీచ రాజకీయాలు చేస్తుంటరు కొంతమంది. వీరు వర్తమానంలోని చరిత్రహీనులు. మరింత ప్రమాదమేమంటే.. బండరాయి లాంటి వీరు తాము మునుగుతూ దేశాన్ని కూడా ముంచుతరు.
మసీదులు తవ్వుతామంటూ బీజేపీ నేతలు రాష్ట్రంలో మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు మసీదులు తవ్వితే.. మేం అభివృద్ధి పనులకు పునాదులు తవ్వుతాం. ప్రార్థనాలయాలు కాదు.. చేతనైతే దేవరకద్రలోని బీడు భూములు తవ్వి నీరు పారిద్దాం. మేంగుడులు కడుతున్నాం. వాటితోపాటే ప్రాజెక్టులు కూడా కడుతున్నాం. యాదాద్రి లాంటి గొప్ప ఆలయం నిర్మించిన ఘనత మా ప్రభుత్వానిదే.
అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశా నిర్దేశనం చేసే కరదీపికగా మారింది.
Format C-2 of TRS candidates for biennial election to the council of states for the constituency – by the elected members of Telangana Legislative Assembly.
Format C-7 of TRS candidates for biennial election to the council of states for the constituency – by the elected members of Telangana Legislative Assembly.
దావోస్‌లో తెలంగాణ దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని పెట్టుబడి అనుకూల విధానాలకు పారిశ్రామికవేత్తలు ఫిదా అవుతున్నారు. తొలిరోజు లూలు కంపెనీ 500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకోగా.. కీమో ఫార్మా మరో వంద కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకొన్నది.
ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) సమావేశాల్లో తొలి రోజే తెలంగాణకు భారీగా పెట్టుబడులు దకాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుతో సోమవారం వివిధ కంపెనీల ప్రతినిధులు సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు.
రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రాన్నిసాధించి తన జాతి జనుల కలను సాకారం చేసిన ఉద్యమ నాయకుడు.. ఇప్పుడు భారత జనుల ఆకాంక్షల సాధన కోసం కదలబోతున్నారు. జాతీయ కార్యాచరణకు నడుం బిగించబోతున్నారు. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నెలాఖరు వరకు వివిధ రాజకీయ, సామాజిక కార్యక్రమాలతో పాటు పలువురు రాజకీయ, ఆర్థిక , పాత్రికేయ ప్రముఖులతో దేశ భవిష్యత్తు దశ, దిశ పై సమాలోచనలు చేయనున్నారు.
మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నది. ఇంగ్లండ్‌కు చెందిన ఫార్మా సంస్థ ‘సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్’ దేశంలో ఎకడాలేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది
Please contribute generously to the TRS Party.