పదేళ్ల తెలుగుదేశం పాలన, తర్వాత పదేళ్ల కాంగ్రెస్ పాలన మిగిల్చిన పాప ఫలమే ఇప్పటి విద్యుత్ కష్టాలు. సింగరేణి బొగ్గు తెలంగాణలో ఉంది. కానీ పవర్ ప్లాంట్లు ఆంధ్ర, రాయలసీమల్లో పెట్టుకున్నారు. 80శాతం గ్యారంటీగా జనరేషన్ కెపాసిటీ ఉండే థర్మల్ కేంద్రాల ద్వారా సీమాంధ్రలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కావడం వారి పక్షపాతానికి నిదర్శనం కాదా?

ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మంచిపేరు సంపాదిస్తున్న కేసీఆర్ గారిని చూసి ఓర్వలేక చంద్రబాబు నిప్పులు కక్కుతున్నడు. కేసీఆర్ అంతమంచి పేరు సంపాదిస్తాంటె మీరేం చేస్తాండ్లని తెలంగాణ టీడీపీ నేతలను ఎగదోస్తాండు. ఎట్లనన్న చేసి కేసీఆర్‌ను బద్నాం చేయండని రెచ్చగొట్టిండు. కేసీఆర్ చేస్తున్న మంచి పనులు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరెందుకు ఇలా చేస్తలేరని నన్ను నిలదీస్తున్నరు. తలెత్తుకోలేక చస్తున్నా అని చంద్రబాబు మొత్తుకుంటున్నడు. చంద్రబాబు అనంతపురం నుంచి ఆగమాగం ఉరికొచ్చిఉస్కోఅనంగనే యాజమాని రుణం తీర్చుకోవడానికి సిద్ధపడుతున్నరు. బస్సు యాత్ర పేరుతో టీడీపీ చేసే హంగామా తుస్సుమనడం ఖాయం. సీమాంధ్ర నాయకుడు ఎగదోస్తే రావడానికి మీకు ముఖం ఎట్ల చెల్లుతది? ఊళ్లల్ల కుపోయి ఏం చెప్తరు?
రైతు సమస్యలపై, కరెంటు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తరట. కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తర ట. ఇవే అంశాలమీద ప్రజలు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పండి. రైతుల గురించి, రైతు సమస్యల గురించి చంద్రబాబు, టీడీపీ మాట్లాడితే జనం ఏమనుకుంటరో అనే సోయి కూడా లేదా? వ్యవసా యం దండుగ అన్న చంద్రబాబు మీకు గొప్పోడిగా కనిపించిండా? వ్యవసాయాన్ని పండుగ చేస్తా అన్న కేసీఆర్ దోషిలా కనిపించిండా!
కరెంటు చార్జీలు తగ్గించమని అడిగిన రైతులను బషీర్‌బాగ్ చౌరస్తాలో పిట్టల్లా కాల్చి చంపిన రాబం దు చంద్రబాబు మీకు రైతుబంధుగా కనిపిస్తున్నడా! బ్యాంకు అప్పులు తీర్చని రైతులపై క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లల్ల పెట్టించిన బాబు, రైతుల ఇండ్లకు తాళాలు వేసిన చంద్రబాబు మీకు రైతు నాయకుడి గా కనిపిస్తున్నడా? 17వేల కోట్ల రుణాలను రద్దు చేసి రైతుల జీవితాల్లో ఆనందం నింపిన కేసీఆర్ నిర్ణ యం మీకు కనిపించడం లేదా! 480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం రైతులకు చేసిన ద్రోహం అని చెప్తరా?
కృష్ణా, గోదావరి నదుల్లోంచి 265 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు తెలంగాణకున్నా మన నీళ్ల ను మనకు కాకుండా చేసిన చంద్రబాబు మోచే తి నీళ్లు తాగుతూ, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రయత్నిస్తు న్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారా? అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పాఖాల-జూరాల, పాలమూరు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమని చెపుతారా?
ఆత్మహత్య చేసుకున్న రైతుల పట్ల కనీస సానుభూతి లేకుండా, రైతులకు హిస్టీరియా రోగమొచ్చిందని ప్రచారం చేసిన మీరా ఇప్పుడు రైతు ఆత్మహత్య ల గురించి మాట్లాడేది! చనిపోయిన రైతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వమని అడిగితే, ఎక్స్‌గ్రేషియా ఇస్తే మరికొంత మంది రైతులు చనిపోతరని రైతులను అవమానించిన పార్టీ కాదా మీది?
తెలంగాణలో చెరువులన్నింటిని కుట్రపూరితంగా ధ్వంసం చేసి వ్యవసాయాన్ని దెబ్బతీసింది చంద్రబాబు కాదా? తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి చెరువుల పునరుద్ధరణకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించని బాబుకు పాద సేవ చేస్తున్న మీకు, 45 వేల చెరువుల పునరుద్ధరణ కోసం 22 వేల ఐదొందల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన టీఆర్‌ఎస్ పై తప్పుడు ప్రచారం చేద్దామనుకుంటున్నారా!
చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ నాగార్జున సాగర్ ఎడమ కాల్వను ఎండబెట్టి, కుడి కాల్వ నుంచి కృష్షా నీళ్లను మలుపుకుపోయిండ్లు. వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేదు. కనీసం ఫ్లోరైడ్ బారిన పడిన నల్గొం డ జిల్లాకు మంచినీళ్లు తాపమంటే కూడా నీళ్లు ఇవ్వ ని చంద్రబాబు చరిత్ర తెలియనిదెవరికి.
నేను సూటిగా అడుగుతున్న. కిలో బొగ్గు కూడా లేని సీమాంధ్రలో సరిపడా కరెంటు ఎందుకుంటన్న ది? లక్షల టన్నుల బొగ్గున్న తెలంగాణలో కరెం టు కోతలెందుకుంటున్నయ్? ఇది చంద్రబాబు చేసిన ద్రోహం కాదా? తెలంగాణలో విద్యుత్ కొరత ఉంద ని తెలిసి కూడా పీపీఏలను రద్దు చేయాలని నిర్ణయించుకున్న చంద్రబాబు ఇంటి ముందుకు పోయి ధర్నా చేయండి. కేటీపీపీ, వీటీపీఎస్‌ల నుంచి మనకు రావాల్సిన 710 మెగావాట్ల కరెంటును రాకుండా చేసినందుకు చంద్రబాబును నిలదీయండి. 460 మెగావాట్ల సీలేరు కరెంటును లాక్కున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పోరాడండి. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల విద్యుత్తులో 400 మెగావాట్లకు పైగా మనకు రావాలి. కానీ ఆ కరెంటును ఇవ్వడం లేదు. ఆర్టీపీపీలో బొగ్గు కొరత అని కుంటి సాకు చెప్పి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు. ఆర్టీపీపీ1050 మెగావాట్ల విద్యుత్‌లో మనకు 54 శాతం రావాలి. కానీ ఆ కరెంటు ఇవ్వడం, సిద్ధంగా ప్లాంటును కూడా ప్రారంభించకుండా వాయిదా వేసింది చంద్రబాబు కాదా? ఇన్ని చేసిన చంద్రబాబు నంగనాచి మాటలు మాట్లాడుతున్నడు. తెలంగాణలో కరెంటు కష్టాలకు కారకుడు ముమ్మాటికీ చంద్రబాబే కాదా?
రైతులను కరెంటు కష్టాల నుంచి గట్టెక్కించడానికి పవర్ ఎక్చేంజ్ నుంచి ఎనిమిదన్నరకు యూనిట్ చొప్పున ప్రతీ రోజు 14 మిలియన్ యూనిట్ల కరెం టు కొంటున్నాం. ఎక్కడ మిగులు విద్యుత్ ఉంటే అక్కడి నుంచి కరెంటు కొంటున్నాం. మీరు చూడట్లే దా? చూసి కూడా కళ్లు మూసుకున్నారా?
అసలే లోటు విద్యుత్‌తో అవస్థలు పడుతుంటే, వర్షాలు కురవకపోవడం,జలవిద్యుత్ అందుబాటులోకి రాకపోవడం, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పెడుతున్న ఇబ్బందులు, ఉత్తరాది గ్రిడ్ నుంచి కరెం టు తెచ్చుకునే అవకాశాలను చేజేతులా జారవిడుచుకోవడం.. ఇవన్నీ గోరుచుట్టుకు రోకలిపోటు అన్న చందంగా మారాయి. కనీస అవసరాలు తీరాలంటేనే(వ్యవసాయానికి ఏడు గంటలు, ఇతర అవసరాలకు 24 గంటలు సరఫరా చేయాలంటే) తెలంగాణకు సగటున రోజుకు 6200 మెగావాట్ల విద్యుత్ కావాలి. కానీ మన దగ్గర సగటున రోజుకు కేవలం 4417మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటు లో ఉంది.కానీ అవసరం మాత్రం 6,200 మెగావా ట్లు. నికరలోటు 1783 మెగావాట్లు. ఈ లోటు ను అధిగమించడానికి ప్రభుత్వం బహిరంగం మార్కె ట్లో విద్యుత్‌ను కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చింది. అయినా సరే ఇంకా తెలంగాణకు విద్యుత్ లోటు ఉంది. ఈ లోటును పూడ్చడానికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోం ది. ఈ సందర్భంలో గత పాలకులు చేసిన పాపం మనకిప్పుడు శాపంగా మారింది.
నిజానికి కొద్ది నెలలుగా జెన్ కో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని బాగా పెంచుకోబట్టి ఈ మాత్రమైనా కరెంటుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 13 శాతం ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ప్లాంట్ల సంఖ్య పెరగకున్నా అధికారులు, సిబ్బంది సంస్థాగత సామర్థ్యం పెంచుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. దాదాపు వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను అధికంగా ఉత్పత్తి చేశారు. దీని విలువ బహిరంగమార్కెట్లో రేటు ప్రకారం700కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం, ఉద్యోగులు, సిబ్బంది ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకుంటున్నాయి. పదేళ్ల తెలుగుదేశం పాలన, తర్వాత పదేళ్ల కాంగ్రె స్ పాలన మిగిల్చిన పాప ఫలమే ఇప్పటి విద్యుత్ కష్టాలు. సింగరేణి బొగ్గు తెలంగాణలో ఉంది.
కానీ పవర్ ప్లాంట్లు ఆంధ్ర, రాయలసీమల్లో పెట్టుకున్నా రు. 80శాతం గ్యారంటీగా జనరేషన్ కెపాసిటీ ఉండే థర్మల్ కేంద్రాల ద్వారా సీమాంధ్రలో ఎక్కువ విద్యు త్ ఉత్పత్తి కావడం వారి పక్షపాతానికి నిదర్శనం కాదా? తెలంగాణలో బొగ్గుంటే విద్యుత్ ఉత్పత్తి మాత్రం సీమాంధ్రలో ఎందుకు ఎక్కువవుతోంది. సీమాంధ్ర పాలకులు తెలంగాణలో 2,28 2.5 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పెట్టారు. కొత్తగూడెంలో 1720, భూపాలపల్లిలో 500, రామగుండంలో 62.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. అదే సీమాంధ్ర లో 4410 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన ప్లాంట్లున్నాయి. కడప ఆర్టీపీపీ 1050, విజయవాడ వీటీపీఎస్ 1760, నెల్లూరు కృష్ణపట్నం ప్లాంటు 1600 సామర్థ్యం కలిగిన ప్లాంట్లు. ఈ లెక్కల్లో తెలియడం లేదా వివక్ష. ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఎందుకు ఎక్కువుంది? తెలంగాణలో ఎందుకు తక్కువుందో అర్థం కావడం లేదా? సీమాంధ్ర ముఖ్యమంత్రులు చూపిన పక్షపాతం ఇది.
మేము తెలంగాణ ఉద్యమం ప్రారంభమయిన నాటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు తెలంగాణలో పెట్టాలని పోరాటాలు చేశాము. అప్పుడే ఈ కాంగ్రెస్, టీడీపీ సహకరిస్తే ఇవాళ ఈ కష్టం ఉండేది కాదు, గత పాలకులే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయాల్సినంత నష్టం చేయడం లేదా? పీపీఏల రద్దు, ఆర్టీపీపీ, వీటీపీఎస్‌లలో కరెంటు ఉత్పత్తి ఆపడం, సీలేరు నుంచి కరెంటు రాకుండా చేయడం…ఇవన్నీ కుట్ర లు కాదా? తెలంగాణ తెలుగుదేశం నాయకులకు ఇది కనిపించడం లేదా?
ఎవరిపైనా ఆధారపడవద్దనే ఉధ్దేశ్యంతో తెలంగాణ రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నాం. విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక కార్యక్రమాలు కూడా తీసుకుంది. ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ర్టాల నుంచి 2000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నాం.
అయితే అక్కడి నుంచి లైన్లు నిర్మించడానికి కనీసం 18 నెలలు పడుతుంది. 2015 నుంచి మాత్రమే ఆ విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. కేంద్ర వాటా కింద ఎన్టీపీసీ ద్వారా కూడా మనకు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ రావాలి. దానికి కూడా కనీసం రెండే ళ్లు పడుతుంది. మన జెన్‌కో ఆధ్వర్యంలో కూడా దాదాపు ఆరువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశాం. అన్నిదిక్కుల నుంచి కరెంటు రావడం మూడో ఏడాది నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడున్న దాదాపు ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు తోడు మరో మూడేళ్లలో మరో పన్నెండు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు 24 గంటలూ కరెంటు ఇవ్వ డం సాధ్యమవుతుంది. ఇప్పుడు రైతులు, ప్రజలను కరెంటు కష్టాల నుంచి కాపాడడానికి ప్రభుత్వం చేయాల్సినంత చేస్తోంది. ఉన్న సమస్యను చెబుతాం. మా రైతులు, ప్రజలు సహకరించాలని కోరతాం. ఈ ప్రభుత్వం సమస్యల నుంచి పారిపోదు. ధైర్యంగా ఎదుర్కోంటుంది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతుంది.
కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లే. ఎంగిళి మెతుకులకు ఆశపడి టీ-టీడీపీ నాయకులు తెలంగాణను ఇబ్బంది పెట్టడానికి ముందుకొస్తున్నరు. ప్రజలే అన్నీ నిర్ణయిస్తరు.