‘తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చారివూతాత్మక ఘట్టాలు చూశాం. ఉద్యమమం సిద్దిపేట. సిద్దిపేటలో 1531వ రోజులపాటు కొనసాగిన రిలేనిరాహార దీక్షలు జరిగి చరిత్రపుటల్లో నిలిచిపోతాయి. భావితరాలకు పోరాట పటిమను తెలియజేసేందుకే సిద్దిపేటలో పైలాన్ నిర్మిస్తున్నాం’అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీక్షలకు గుర్తుగా సిద్దిపేట పాత బస్టాండ్ దీక్షాస్థలి వద్ద పైలాన్ నిర్మాణానికి గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌డ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌డ్డితో కలిసి భూమిపూజలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్న సమయంలో సిద్దిపేట ప్రజలంతా అండగా నిలిచి ఉద్యమానికి ఊతమిచ్చారన్నారు.

-తెలంగాణ వచ్చేవరకు కొనసాగి స్ఫూర్తినింపాయి -భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు -సిద్దిపేట దీక్షా స్థలిలో పైలాన్‌కు భూమిపూజ కేసీఆర్ 11 రోజుల ఆమరణ దీక్ష తర్వాతే కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేసిందని గుర్తుచేశారు. దీన్ని జీర్ణించుకోలేని సీమాంవూధులు కుట్రలుపన్ని రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడంతో సిద్దిపేటలో మొదలైన రిలే నిరాహార దీక్షలు తెలంగాణ వచ్చే వరకు 1531వ రోజులపాటు నిర్విరామంగా కొనసాగి చరివూతలో నిలిచాయన్నారు. పండుగలు, పబ్బాలు లెక్కచేయకుండా దీక్షలో కూర్చున్న వారిలో సింహాభాగం మహిళలే ఉన్నారని అభినందించారు. కార్యక్రమంలో నంది అవార్డు గ్రహీత నందిని సిధాడ్డి, సీఎంవో ఓఎస్డీ, దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
1-20 అడుగుల ఎత్తులో పైలాన్ నిర్మాణం: పైలాన్‌ను 1-20 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. కొండపాకకు రమణాడ్డి రూపకల్పన చేశారు. దీన్ని పూర్తిగా రాళ్లు, మొజాయిక్, రస్ట్‌ఫ్రీ, స్టెయిన్‌పూస్, స్టీల్‌తో నిర్మించనున్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి హరీశ్‌రావు
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చిన్నకోడూర్ మండలం అనంతసాగర్ పరిధిలోని శ్రీ సరస్వతీదేవస్థాన సమీపంలో కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లి శివారులో శ్రీ సరస్వతీ వాసవి నిత్యాన్నదానసత్ర భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ దేవస్థానాన్ని బాసరలా తీర్చిదిద్దే చర్యలు చేపడుతానన్నారు.