ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సోమవా రం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మెదక్ మం డలం లింగ్సాన్‌పల్లి గ్రామ ఊరచెరువు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. చెరువు మట్టితో రసాయన ఎరువులకు అడ్డుకట్టవేయవచ్చని వివరించారు. చెరువు మట్టిని పొలాల్లో వేయడంతో 30 పుట్లు పండే పంటలు 40 పుట్లు పండుతాయన్నారు. చెరువులకు నీరు వచ్చేందుకు కట్టు కాల్వలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు. ఘణపూర్ ప్రాజెక్ట్ కెనాల్‌ల సిమెంట్ లైనింగ్, ప్రాజెక్ట్ ఎత్తు పెంపునకు రూ.70కోట్లు, తూములు మరమ్మతుకు రూ.22 కోట్లు, ఇతర పనులకు మరో రూ.30కోట్లు మంజూరు చేయ నున్నట్లు ప్రకటించారు.

-ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు: భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు -ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున నీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. శివ్వంపేట మండలంలో గ్లాండ్ ఫార్మా అధినేత రాజు దత్తత తీసుకున్న చెరువు పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. శివ్వంపేట, కౌడిపల్లి మండలాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, గజ్వేల్ మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సదాశివపేట మండలం కొల్గూరులో ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్, రాయికోడ్, రేగోడు మండలాల్లో ఎమ్మెల్యే బాబుమోహన్ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కూర్ చెరువు పనులను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే శోభతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పునరుద్ధరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ధర్మారం మండలంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ సుమన్ పనులను ప్రారంభించారు.
భవిష్యత్ తరాలకు మేలు: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెరువుల పునరుద్ధరణతో భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని గృహనిర్మాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూర్ తోరచెరువు పనులను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలోని చెరువులు ఆంధ్రులపాలనలో శిథిలావస్థకు చేరాయన్నారు. సీసీసీనస్పూర్ ఊర చెరువును రాచకొండ కుటుంబసభ్యులు దత్తత తీసుకోగా పనులను ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
చెరువులతోనే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం చవిటిచెరువులో పోలీసుశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పాల్గొని మాట్లాడారు. మరమ్మతులు పూర్తయితే వందేండ్లు చెరువులు నిండుకుండల్లా తలపిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌లాల్ తదితరు లు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పోచారం, దేశాయిపేట్ చెరువు పనులను మంత్రి పోచారం పరిశీలించారు.
ధర్పల్లి మండలం అన్సాన్‌పల్లిలో చెరువు పనులను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి మండలాల్లో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బాల్కొండ మండలంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల, భూత్పురు మండలాల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా రాజాపేట మండలం బొందుగులలో విప్ గొంగిడి సునీత, నోములలో ఎస్పీ దుగ్గల్, ఎమ్మెల్యే వీరేశం, మోత్కూరు, శాలి గౌరారం మండలాల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్, వరంగల్ జిల్లా నెల్లికుదు రు మండలం చిన్నముప్పారంలో డీఎస్పీ నాగరాజు ప్రారంభించారు.
జోరుగా మొగుల చెరువు పనులు హన్వాడ: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తపేట లోని మొగుల చెరువు పనులు జోరుగా సాగుతున్నాయి. 20 ఎకరా లకుపైగా ఆయకట్టు ఉన్న ఈ చెరువు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువుకు రూ.6.70 లక్షలు మంజూరవగా మరమ్మతులు చేస్తున్నారు. పూడిక తీయడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఆయ కట్టు 50 ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉంది. ఏటా రెండు పంట లు పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.