Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సీఎం కేసీఆర్‌ను పెద్దకొడుకు అంటున్నరు!

ఓట్లడిగే ప్రతిపక్షాలు నిన్నటి వరకు ఏం చేశాయో ప్రజలకు చెప్పాలి. అరవయ్యేండ్లు అధికారంలో ఉండి హైదరాబాద్‌ను ఆశించిన మేరకు ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలి. కనీసం కరెంటు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారు. నగర ప్రజలు నేడు ఎదుర్కొంటున్న సమస్యలకు విపక్షాలదే బాధ్యత అని పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక్క హైటెక్ బిల్డింగ్ కట్టినంత మాత్రాన అభివృద్ధి అయిపోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో దూరదృష్టితో కృషిచేస్తున్నదనీ, అధికారంలోకి వచ్చిన 19 మాసాల్లోనే ప్రజలు మెచ్చే పాలన అందించిందని, హైదరాబాద్‌లో రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. -ప్రజలు గ్రేటర్‌లో మమ్ముల్నే గెలిపిస్తారు -వంద సీట్లు.. మేయర్ పీఠం మాదే.. -నగర సమస్యలకు గత పాలకులే కారణం -జనం మమ్ముల్ని పిలిచి మీటింగ్ పెట్టించుకుంటున్నరు.. -సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని వాళ్లే చెప్తున్నరు -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally-Krishna-Rao-interview-with-Namasthe-Telangana

కృష్ణా, గోదావరి జలాలను నగరానికి తెచ్చి వచ్చే ఎండాకాలంలోనూ దాహార్తి లేకుండా చర్యలు తీసుకొంటున్నారని, పారిశుద్ధ్యం, పింఛన్లకోసం వేలకోట్లు కేటాయించారని జూపల్లి పేర్కొన్నారు. ఈ సంక్షేమచర్యలు చూసిన పేదలు కేసీఆర్ మా పెద్ద కొడుకులా ఆదుకొంటున్నారని, ఆయన సల్లగ ఉండాలంటున్నారన్నారు. ఈ అశీర్వాదాలే టీఆర్‌ఎస్‌ను జీఎంహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా గెలిపిస్తాయని ధీమాగా చెప్పారు. పలు ప్రశ్నలకు యన ఇలా సమాధానాలు ఇచ్చారు.

ప్రచార సరళి ఎలా జరుగుతున్నది? ప్రజలకు ఏం చెప్తున్నారు? 45 ఏండ్లు కాంగ్రెస్, దాదాపు 20 ఏండ్లు టీడీపీ, బీజేపీలు కలిసి పరిపాలించాయి. గత ప్రభుత్వాలు ఏం చెప్పాయో, ఏం చేశాయో ఆలోచించి ఓటు వేయాలని మేం ప్రజలను సూటిగా కోరుతున్నాం. గత పాలకుల ముందుచూపు లేమివల్లే జీహెచ్‌ఎంసీలో తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సమస్యలు ఇంకా ఉన్నయ్. వాటి పరిష్కారానికి మా సర్కార్ చిత్తశుద్ధితో, పక్కా ప్రణాళికతో, దూరదృష్టితో.. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. మీరు ఎవరికి ఓటు వేయాల్నో, ఎవరిని గెలిపిస్తే అభివృద్ధి ఇంకా బాగుంటుందో ఆలోచించుకొని ఓటు వేయాల్నని ప్రజలను కోరుతున్నాం.

నగరంలోని ఇతర రాష్ర్టాల ప్రజల స్పందన ఎలా ఉంది? రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నేను డే వన్ నుంచి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న. రాజస్థానీ, మరాఠీ, కేరళ వారితో కూడా మీటింగ్‌లు పెట్టిన. తమ సమస్యలు పరిష్కారం కావాలంటే సీఎం కేసీఆర్ తప్ప మరెవరూ చేయలేరని వాళ్లే చెప్తున్నరు. మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టించుకుంటున్నరు. వందకు వంద శాతం పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. టీఆర్‌ఎస్‌లో చేరడానికి చాలామంది ఉత్సాహపడుతున్నారు. పులివెందులకు చెందిన ఓ పెద్ద మనిషి మొన్ననే స్వచ్ఛందంగా వచ్చి గులాబీ కండువా కప్పుకొన్నాడు.

సీమాంధ్రులకే డిప్యూటీ మేయర్ అంటున్న టీడీపీ ప్రకటనపై మీరేమంటారు? వాళ్ల మాటల్ని నమ్మే జమానా పోయింది. ఇన్నేండ్లు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేనివారు ఇప్పుడేం చేస్తరు. ప్రజలు వాళ్లకు ఈ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్తారు.

మేమే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని కొన్ని పార్టీలు అంటున్నాయి? ఇట్లా మాట్లాడే పార్టీలు అధికారంలోఉండి నిరంతర విద్యుత్ ఎందుకియ్యలేదు? దీనికి ఫస్ట్ సమాధానం చెప్పాలె వాళ్లు. ఇంకా ఎందుకు దోమల బెడద పోలే? మూసీ ప్రక్షాళన ఎందుకు చేయలే? డ్రైనేజీ సిస్టం ఎందుకు బాగు చేయలే? తాగునీటి సమస్య, స్లమ్స్ ఇంకా ఎందుకున్నయి? ఓల్డ్‌సీటీల ఇంకా పాత బస్తీలే ఉన్నయ్? ఈ పార్టీలు ఎందుకు అభివృద్ధి చేయలే? హైటెక్ సిటీలో కూడా డ్రైనేజీ, తాగునీటి నెట్‌వర్క్ నేటికీ లేదు.

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మజ్లిస్ పార్టీకి వేసినట్లేనని బీజేపీ అంటున్నది.. ? హైదరాబాద్‌లో అన్ని వర్గాలవారు ఉన్నట్లే అన్ని పార్టీలు ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యం. అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనేవే ఇక్కడ ప్రధానాంశాలు. కులాలు, మతాలు కావు. ఆ కోణంలో మాట్లాడటం వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్న.

గ్రేటర్‌లో ఎన్ని సీట్లు గెలుస్తారు? గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురాలే. అందరి మెడల గులాబీ కండువా ఉండాలే అని కార్యకర్తలు, నేతలు అంటున్నరు. పార్టీలో టిక్కెట్ ఎవరికి ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ప్రమాణం చేస్తున్నారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో సెంచరీ కొడతాం.. మేయర్ పీఠాన్ని దక్కించుకొంటాం.

హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటున్నది. ఓటు హక్కుపై మీరిచ్చే సందేశం? హైదరాబాద్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ప్రజాస్వామ్యంలో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అన్నివర్గాల ప్రజలు వారి బాధ్యతను గుర్తించి తప్పకుండా ఓటు వేయాలి. హైదరాబాద్‌ను ప్రపంచ నగరంగా మార్చేందుకు కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలి.

గత ప్రభుత్వాలు చేసిందేమిటి? 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేమీలేదు. ఆ పార్టీలకు ముందుచూపు లేకపోవడం వల్లనే జీహెచ్‌ఎంసీలో తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సమస్యలు ఇంకా ఉన్నయ్. హైదరాబాద్‌లో ఇంకా ఎందుకు దోమల బెడద పోలే.. మూసీ ప్రక్షాళన ఎందుకు చేయలే.. డ్రైనేజీ సిస్టం ఎందుకు బాగు చేయలే.. తాగునీటి సమస్య, స్లమ్స్ ఇంకా ఎందుకున్నయి.. హైటెక్ బిల్డింగ్ కట్టినంత మాత్రాన అభివృద్ధి అయిపోతదా?.. సమస్యల పరిష్కారానికి కేసీఆర్ సర్కార్ చిత్తశుద్ధితో, పక్కా ప్రణాళికతో, దూరదృష్టితో కృషిచేస్తున్నది. గత ప్రభుత్వాలు ఏం చెప్పాయో, ఏం చేశాయో ఒకసారి ఆలోచించుకొని మాకు ఓటు వేయాలని మేం ప్రజలను సూటిగా కోరుతున్నాం. – నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి జూపల్లి కృష్ణారావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.