Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఢిల్లీకి గులాంగిరే

-టీడీపీని గెలిపిస్తే గుంటూరుకు దాసోహం -తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబే -బాబు జై సమైక్యాంధ్ర అంటే.. రేవూరి, ఎర్రబెల్లి చప్పట్లు కొట్టిండ్రు: హరీశ్‌రావు

Harish Rao తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనరాష్ట్రంలో ఆంధ్రా పార్టీలు అవసరమా? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఢిల్లీకి గులాంగిరి చేస్తుంది. టీడీపీని గెలిపిస్తే గుంటూరుకు దాసోహం చేస్తారు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కోసం మన పిల్లలు చనిపోయినా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని, తెలంగాణలో కాంగ్రెస్ చచ్చిపోతుందనే భయంతోనే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్టాన్ని రాకుండా అడ్డుకున్నది టీడీపీయేనని, మోసం చేసింది వాళ్లేనన్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ సభలో చంద్రబాబు జై సమైక్యాంధ్ర అంటే పక్కనే కూర్చున్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా జైకొట్టారని ఎద్దేవాచేశారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చేవి సంకీర్ణ ప్రభుత్వాలని, తెలంగాణ అభివృద్ధి అవసరమైన నిధులు తెచ్చే అపర చాణిక్యుడు కావాలన్నారు. నీతికి, నిబద్ధతకు, త్యాగాలకు వెరవకుండా నిస్వార్థంగా పనిచేస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు గులాంగిరి చేస్తానని ప్రకటించిన కేసీఆర్ నాయకత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

పర్యాకటకేంద్రంగా పాఖాల అభివృద్ధి వరంగల్ జిల్లా నుంచి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పొన్నాల లక్ష్మయ్య ఉన్నప్పుడు పాఖాలకు పందిపంపుల వాగు నుంచి నీటిని మళ్లిస్తామని డ్యాన్స్‌లు చేశాడని, కానీ పైసా ఖర్చు చేయలేదని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే పాఖాలను పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేస్తామని, గూడూరు ప్రాంతంలో విస్తరించిన ఇనుప ఖనిజాలతో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.

పెద్దిని గెలిపించి అసెంబ్లీకి పంపాలి నర్సంపేట నియోజకవర్గం నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించాలని హరీశ్‌రావు ప్రజలను కోరారు.రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు కేంద్రం నుంచి నిధులను ఎక్కువగా రాబట్టుకొని ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేసుకోవచ్చన్నారు. ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, టీడీపీలు ఏమొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాయని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవేనని, కాంగ్రెస్‌కు పోటీ చేసే అర్హత లేదన్నారు. 14 ఏళ్ల మన పోరాటం కాంగ్రెస్, టీడీపీలపైనే కొనసాగిందన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.