Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఢిల్లీని శాసిద్దాం

-సీఎం కేసీఆర్ నాయకత్వంలో వందమంది ఎంపీలతో కొత్త కూటమి
-ఎర్రకోటపై జెండా ఎవరు ఎగరేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి
-కేసీఆర్ ఆలోచన దేశానికి ఆచరణ
-కోటి ఎకరాల మాగాణ కేసీఆర్ లక్ష్యం
-బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు
-పది కోట్ల ఉద్యోగాల్లో ఎన్ని ఇచ్చారు?
-పేదల ఖాతాల్లో వేస్తామన్న 15 లక్షలేవి?
-తెలంగాణకు మోదీ చేసిందేంటి?
-సికింద్రాబాద్, జహీరాబాద్ సన్నాహక సభల్లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

రాబోయే ఎన్నికల్లో ఢిల్లీని శాసిద్దామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి లేదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో వందమంది ఎంపీలతో కొత్త కూటమి ఏర్పాటుకాబోతున్నదని తెలిపారు. రాష్ట్రంలోని పదహారు స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తే.. ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటుందని, కావాల్సిన నిధులను తెచ్చుకోవచ్చన్నారు. టీఆర్‌ఎస్ ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్రలో ఉండాలంటే, దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు రావాలంటే, కేసీఆర్ పథకాలు దేశం మొత్తం అమలుకావాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలువాల్సిన అవసరముందని చెప్పారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరైనా మొత్తం పదహారు స్థానాల్లో మనం వేసే ఓటు కేసీఆర్ సైనికుడికి అనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వం, ఆలోచనలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్న కేటీఆర్.. తెలంగాణకు ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. బుధవారం జహీరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న కేటీఆర్.. దేశంలో ఇంకా కరంటు, తాగునీరు, రోడ్లు వంటి కనీస వసతులలేమితోపాటు.. తినడానికి తిండి దొరకని అభాగ్యులు ఉన్నారంటే అందుకు కారణం దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్, బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీలకు కీలెరిగి వాతపెట్టాలని పిలుపునిచ్చారు.

రాబోయే ఎన్నికల్లో ఢిల్లీని శాసిద్దామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, బీజేపీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి లేదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో వందమంది ఎంపీలతో కొత్త కూటమి ఏర్పాటుకాబోతున్నదని తెలిపారు. రాష్ట్రంలోని పదహారు స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తే.. ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటుందని, కావాల్సిన నిధులను తెచ్చుకోవచ్చన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం, ఆలోచనలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్న కేటీఆర్.. తెలంగాణకు ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అని నినదించిన మోదీ తెలంగాణకు మాత్రం హాత్ ఇచ్చారని విమర్శించారు.

తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా చేశారన్నారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఐదేండ్లలో పదికోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పడాన్ని గుర్తుచేస్తూ.. ఆ ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీశారు. నల్లధనాన్ని వెలికితీసి, ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారని, ఎంతమంది ఖాతాల్లో డబ్బులు వేశారో మోదీ చెప్పాలని అన్నారు. బుధవారం ఉదయం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల శివారు మాగిలో ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్ జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి, సాయంత్రం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్‌లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ బీజేపీ, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీలకు కీలెరిగి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇంకా కరంటు, తాగునీరు, రోడ్లు వంటి కనీస వసతులతోపాటు.. తినడానికి తిండి దొరకని అభాగ్యులు ఉన్నారంటే అందుకు కారణం దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్, బీజేపీ కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రాంతీయ భావోద్వేగాలతో కాంగ్రెస్, మతాల పేరుతో బీజేపీ పబ్బం గడుపుకొంటున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీల రాజకీయాన్ని తిప్పికొడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని చెప్పారు. సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు నినాదంతో ఢంకా బజాయించి ఎన్నికలకు వెళ్దామన్నారు. తెలంగాణలో 16 స్థానాల్లో గులాబీ జెండా, మరోస్థానంలో మిత్రపక్షం ఎంఐఎం జెండా ఎగరాలన్నారు. గోల్కొండ ఖిల్లా మీద కేసీఆర్ జాతీయ జెండా ఎగరవేస్తున్నారని, రేపు ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగురవేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో 40మంది గ్రామసర్పంచులు తమ గ్రామాలను తెలంగాణలో విలీనంచేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేయడం యావత్ దేశాన్ని ఆలోచింపజేసిందని, సీఎం కేసీఆర్ పాలనకు అద్దంపట్టిందని కేటీఆర్ చెప్పారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన ప్రధాని మోదీ.. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ అడిగితే ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారని కేటీఆర్ విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు బాగున్నాయని.. వాటికి రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

మన అభ్యర్థి.. కేసీఆర్ సైనికుడు
టీఆర్‌ఎస్ ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్రలో ఉండాలంటే, దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు రావాలంటే, కేసీఆర్ పథకాలు దేశం మొత్తం అమలుకావాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరముందని కేటీఆర్ అన్నారు. ఎంపీ అభ్యర్థి ఎవరైనా మొత్తం పదహారు స్థానాల్లో మనం వేసే ఓటు కేసీఆర్ సైనికుడికి అనే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఢిల్లీకి మనం పంపే నాయకులు మన కోసం తెగించి కొట్లాడేవారని, కాంగ్రెస్‌వాళ్లు పొరపాటున గెలిస్తే ఢిల్లీ దర్బార్‌లో గులాంల మాదిరిగా ఉంటారని అన్నారు.

కరంటు సమస్యకు ఆర్నెళ్లలో పరిష్కారం
తెలంగాణకు కరంటు విషయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు భయపెడితే.. రాష్ట్రం ఏర్పడిన ఆరునెలల్లోనే కరంటు సమస్యను పరిష్కరించి, పరిశ్రమలకు, గృహ, వ్యవసాయ అవసరాలకు బ్రహ్మాండంగా నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరాచేస్తున్నామని చెప్పారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థత అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎకరానికి ఎనిమిదివేల చొప్పున పంట సాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో దానిని పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారని, అది వచ్చే సీజన్ నుంచి అమలుకానున్నదని తెలిపారు. ఆసరా పింఛన్లు రెట్టింపు చేసి, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికేలా చేశారన్నారు.

కోటి ఎకరాల మాగాణ కేసీఆర్ లక్ష్యం
కేసీఆర్ పూర్వీకులు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినవారేనని, దోమకొండ మండలం పోసాన్‌పల్లి గ్రామం 1930-40 దశకంలో అప్పర్‌మానేరు నిర్మా ణం సమయంలో మునిగిపోతే సిద్దిపేటలోని చింతమడకలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఏపీలో ఏ సీఎం సొంత భూములు ఏ ప్రాజెక్టు నిర్మాణంలోనూ పోలేదని అన్నారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి వంటి దుర్భిక్ష ప్రాంతంలో, ఎలాంటి సాగునీటి వసతి లేనిచోటకు కూడా నీటిని తీసుకువచ్చేలా కేసీఆర్ ప్రణాళికలు చేశారన్నారు. నిజామాబాద్ జిల్లా జైలులో ఆనాడు దాశరథి కృష్ణమాచార్య బొగ్గుతో నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాశారని, మన సీఎం తెలంగాణ కోటి ఎకరాల మగాణ కావాలని సంకల్పించారన్నారు.

సికింద్రాబాద్ పైనా గులాబీ జెండా
తెలంగాణలో బీజేపీ గెలువకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సవాలుచేయడాన్ని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ఇదే రకమైన మాటలను జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల ముందు మాట్లాడారని గుర్తుచేశారు. కానీ.. ఐదు ఎమ్మెల్యే స్థానాలుంటే గత ఎన్నికల్లో ఒక స్థానానికి బీజేపీ పరిమితమైందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా చెప్పి ఓడగొట్టామో, అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు చేశామో.. అదేవిధంగా రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కూడా బీజేపీని ఓడించి, గులాబీ జెండా ఎగరేసి తీరుతామని ప్రకటించారు. రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న ఒకేఒక మంత్రి బండారు దత్తాత్రేయను ఏడాదిలోపే అవమానకరంగా తొలిగించి, రాష్ర్టానికి ప్రాతినిధ్యం లేకుండా చేశారని విమర్శించారు. అలాంటి బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు ఉన్నదా? అని ప్రశ్నించారు. తాను, పద్మారావు కలిసి ఢిల్లీకి పోయి సికింద్రాబాద్ పరిధిలో ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు ైఫ్లె ఓవర్, జేబీఎస్ నుంచి తూంకుంట వరకు ైస్కెవే నిర్మించడానికి అవసరమైన భూమి ఇవ్వాలని అడిగితే ఇంతవరకు ఇవ్వలేదన్నారు. రైల్వేశాఖ పరిధిలోని ఎనిమిది ఎకరాల స్థలాన్ని డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి ఇవ్వాలని అడిగినా స్పందన లేదని తెలిపారు. ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటే ఉరుక్కుంటూ వచ్చి భూములు ఇవ్వరా? అంటూ ప్రశ్నించారు.

తెలంగాణకు ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆ పార్టీ నేతలు చెప్పాలి. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అని నినదించిన మోదీ.. తెలంగాణకు మాత్రం హాత్ ఇచ్చారు. తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా చేశారు. 2014 ఎన్నికల సమయంలో ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఐదేండ్లలో పదికోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఆ ఉద్యోగాలు ఏమయ్యాయి? నల్లధనాన్ని వెలికితీసి, ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు.. ఎంతమంది ఖాతాల్లో డబ్బులు వేశారో మోదీ చెప్పాలి. -కేటీఆర్

16 సీట్లలోనూ టీఆర్‌ఎస్ గెలువాలి
అసెంబ్లీ ఎన్నికల తరహాలో లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించి 16కు 16 సీట్లు గెలవాలి. మరో స్థానంలో మిత్రపక్షం మజ్లిస్ గెలుస్తుంది. నాలుగున్నరేండ్లలో ఏ రాష్ట్రంలోనూ లేని అభివృద్ధి తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలాంటి ఎన్నో పథకాలు తెచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడాలేదు. స్వరాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేల బలం మనకే ఉన్నది. లష్కర్‌లో గులాబీ జెండా ఎగరటం ఖాయం. – హోం మంత్రి మహమూద్ ఆలీ

అన్ని స్థానాల్లో భారీ మెజారిటీ సాధించాలి
ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలి. అప్పుడే కేంద్రం నుంచి అభివృద్ధికి అవసరమైన నిధులు రాబట్టుకోవచ్చు. సీఎం కేసీఆర్ నాకు మంత్రిగా తొలిసారి అవకాశం ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తాను. 1930లో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టును గడిచిన ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం నుంచి నిజాంసాగర్‌ను నింపడానికి సీఎం ఎంతో కృషిచేస్తున్నారు.
– మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

సమర్థ నాయకుడు కేటీఆర్
అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గర్వపడేలా అభివృద్ది జరుగుతున్నది. కరంట్‌తోపాటు అన్ని గ్రామాలకు సమృద్ధిగా నీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే. సన్నాహక సమావేశాలు పార్టీ అభ్యర్థుల మెజార్టీకి దోహదపడతాయి. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని మెజార్టీలే లక్ష్యంగా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పనిచేయాలి. జీహెచ్‌ఎంసీ, గ్రేటర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిచేత్తో పార్టీ అభ్యర్థులను గెలిపించిన సమర్థ నాయకుడు కేటీఆర్.
– టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.