Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఢిల్లీని శాసిద్దాం.. కాళేశ్వరానికి జాతీయహోదా సాధిద్దాం

-జాతీయపార్టీలతో దేశానికి ఒరిగిందేమీలేదు: కేటీఆర్
-వందల సంఖ్యలో సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా సీఎం కేసీఆర్
-గులాబీ సైనికులూ.. గడప గడప తట్టండి.. గుండెగుండెను లేపండి
-సార్వత్రిక ఎన్నికలకు టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదనే ప్రచారాన్ని తిప్పికొట్టండి
-టీఆర్‌ఎస్ ఎవరికీ బీ టీం కాదు.. తెలంగాణ ప్రజలే అసలు సిసలైన ఏ టీం
-వినోద్‌కుమార్ కాబోయే కేంద్రమంత్రి.. అఖండ మెజార్టీతో గెలిపిద్దాం
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపు

రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో కీలకంగా మారుతామని, ఢిల్లీని శాసించి కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించి తీరుతామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఉద్ఘాటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీకి.. బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్రమోదీకే లాభం తప్ప రాష్ర్టానికి ఏమీరాదని తెలిపారు. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణలోని ప్రతీపల్లెకు, ప్రతీ మండలానికి, జిల్లాలకు మేలు చేకూరుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలదే నిర్ణయాత్మకశక్తి అని అన్నారు. అందరి ఆశీసులతోనే రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నాం.. ఐదేండ్లపాటు సీఎంగా కేసీఆర్‌కు ఏ ఆటంకం లేదు.. ఇక మనందరి లక్ష్యం లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలువడమేనని పేర్కొన్నారు. శుక్రవా రం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పాల్వంచమర్రిలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కామారెడ్డి జెడ్పీటీసీ నిమ్మ మోహన్‌రెడ్డి, కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ దామోదర్‌రెడ్డి, ఎంపీటీసీ శంకర్.. కేటీఆర్ సమక్షంలో గులాబీ కం డువా కప్పుకొన్నారు. అనంతరం కరీంనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన బహిరంగసభలో కేటీఆర్ పాల్గొన్నారు. రాత్రి కరీంనగర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణలోని గజ్వేల్‌కు వచ్చిన ప్రధాని మోదీని పోలవరానికి జాతీయహోదా ఇచ్చినట్టే ఉత్తర తెలంగాణలో దుర్భిక్ష ప్రాంతాలకు నీళ్లు తెప్పించే మహత్తర ప్రాజెక్టు కాళేశ్వరానికి సైతం జాతీయహోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారని చెప్పారు. అయితే, మోదీ మాత్రం నవ్వి ఊరుకున్నారే తప్ప ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ 16 ఎంపీ సీట్లు గెలుపొందితే.. కేంద్రం మెడలు వంచి రాష్ర్టానికి ఏది అవసరమో అది సాధించుకునే బాధ్యత సీఎం కేసీఆర్ చూసుకుంటారని చెప్పారు. బడితె ఉన్నోడిదే బర్రె అన్నట్టుగా దేశంలో రాజకీయ పరిస్థితి మారిందని అన్నారు.

మోదీ హవా లేనేలేదు.
2014 ఎన్నికల్లో గుజరాత్ మోడల్ అభివృద్ధి ప్రచారంతో ప్రధాని పీఠమెక్కిన మోదీకి ఈసారి 150 సీట్లు వస్తే మహా ఎక్కువని, కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా దాటవని కేటీఆర్ తెలిపారు. సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు.. కేంద్రంలో శాసించేస్థాయిలో టీఆర్‌ఎస్ ఉండాలనే నినాదంతో ఈ ఎన్నికల్లో ముందుకుపోతు న్నాం.. ఆ దిశగా ప్రజల తీర్పు ఉండాలని విజ్ఞప్తిచేశారు. ఒకప్పుడు కరీంనగర్ ప్రజల దీవెనతో ఎంపీగా ఎన్నికైన కేసీఆర్.. ఇద్దరితోనే తెలంగాణ తీసుకొచ్చారని, అలాంటి మొనగాడికి 16 మం దిని అప్పగిస్తే.. ఆ సంఖ్యకు మరో 150ని తోడుచేస్తారని చెప్పారు. ఈ సీట్లతో ఢిల్లీ గద్దెమీద ఎవరు కూర్చోవాలో, ఎర్రకోటపై జెండా ఎవరు ఎగురవేయాలో నిర్ణయిస్తారన్నారు. రైతుబిడ్డ ముఖ్యమంత్రి అయితే రైతు రాజ్యం ఎలా ఉంటుందో కేసీఆర్ చూపించారని కొనియాడారు. వందలసంఖ్యలో సంక్షేమపథకాలు అమలుచేసి తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఏకైక సీఎం కేసీఆర్ అని తెలిపారు.

గడప గడపనూ తట్టండి..
ఇంకా 11 రోజుల సమయమే ఉంది.. గడప గడపనూ తట్టండి.. గుండెగుండెనూ లేపండి.. టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించే వరకూ గులాబీసైనికులు విశ్రమించవద్దు అని కేటీఆర్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదంటూ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ 50 ఏండ్లు, బీజేపీ 13 ఏండ్లు దేశాన్ని పాలించి చేసిందేమీలేదని, నేటికీ కరంటులేని పల్లెలు, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయంటే ఆ పార్టీల వైఫల్యమేనని విమర్శించారు.

తెలంగాణ బిడ్డకు అవకాశం వద్దా
జాతీయపార్టీలు ఎపుడూ ఒకటే కు ట్రలు పన్నుతాయి. అయితే రాహు ల్.. లేకుంటే మోదీ, ఇద్దరే ఉండాలి తప్పా మధ్యలో మరొకరు రావద్దనే చందంగా వారి పరిస్థితి తయారైంది. శుక్రవారం మోదీ మహబూబ్‌నగర్‌కు వచ్చి టీఆర్‌ఎస్ కాం గ్రెస్‌కు బీ టీం అన్నారు. రేపు రాహుల్ వచ్చి టీఆర్‌ఎస్ బీజేపీ బీ టీం అంటారు. మనం ఎవరి బీ టీం కాదు.. తెలంగాణ ప్రజల అసలు సిసలైన ఏ టీం అని కేటీఆర్ స్పష్టంచేశారు. అమేథీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిన రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని కలలు కనొచ్చుకానీ.. ప్రజల దీవెనలు ఉండి.. అద్భుతంగా రాష్ర్టాన్ని నడుపుతూ దేశంలోనే నంబర్‌వన్ సీఎంగా పేరు తెచ్చుకున్న తెలంగాణ బిడ్డ కేసీఆర్‌కు ఎందుకు అవకాశం రావొద్దని ప్రశ్నించారు.

స్మార్ట్‌సిటీగా కరీంనగర్
ఎంపీ వినోద్‌కుమార్ కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా రూపొందించే పనిలో ఉన్నారు. హైదారాబాద్ నుంచి కరీంనగర్‌కు రైలు మార్గాన్ని సాధించే ప్ర యత్నంలో ఉన్నారు. ఇది మరింత తొందరగా పూర్తి కావాలంటే ఆయన కేంద్రమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది అని కేటీఆర్ అన్నారు.

పాలమూరుకు జాతీయహోదా ప్రకటిస్తే ప్రజలు సంతోషించేవారు
-ప్రధాని నరేంద్రమోదీపై ట్విట్టర్‌లో కేటీఆర్
మహబూబ్‌నగర్ సభలో ప్రధాని నరేంద్రమోదీ టీఆర్‌ఎస్‌ను విమర్శించడానికే సమయం వెచ్చించారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. మహబూబ్‌నగర్‌లో మోదీ ప్రసంగంపై ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. టీఆర్‌ఎస్‌ను విమర్శించేందుకు సమయం వెచ్చించే బదులు మహబూబ్‌నగర్ ప్రజలకు లైఫ్‌లైన్ లాంటి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాప్రకటిస్తే అక్కడి ప్రజలు ఎంతో సంతోషపడే వారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని కేటీఆర్ గుర్తు చేశారు.

వినోద్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మంత్రి ఈటల
కరీంనగర్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందించాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ మరోసారి దీవించి తనను పార్లమెంటుకు పంపిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ అధికారదాహంతో ఉన్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, కరీంనగర్ మేయర్ సర్దార్ రవిందర్‌సింగ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, ఎమ్మెల్సీలు సంతోష్‌కుమార్, భానుప్రసాదరావు, ఉమ్మడి జిల్లా ఇంచార్జి బసవరాజు సారయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్రకార్యదర్శి గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట బహిరంగసభ వేదికపై కేటీఆర్ సమక్షంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెందిన సుమారు 300 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.